ఆశ వర్కర్ల సమ్మె 14వ రోజు: అలుపెరుగని ఆశాల పోరాటం.. వంటావార్పు తో నిట్టూర్పు..
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ సమ్మెలో భాగంగా ఆదివారం, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా 14వ రోజు వంటావార్పు కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ, రాష్ట్రంలో అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ వర్కర్లు నిరసనలు తెలియజేస్తున్నారని అన్నారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆశాల పట్ల కనికరం కలగడం లేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో సుమారు 28,000 మంది ఆశా వర్కర్ పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కావడం వలన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఆలోచించి ఈ ఆరోగ్య కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, భీమనపల్లి అరుణ, కాలం సుజాత, పల్లె కౌసల్య, కోయ మంజుల, ఎస్.కె సైదాబీ, విజయమ్మ, అలివేలు మంగ, పందుల పద్మ, లప్పంగి దుర్గమ్మ, పొనుగోటి సునీత, మంజుల, ధనమ్మ, యాదమ్మ, సునీత, జాజాల అనిత, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Oct 09 2023, 06:30