NLG: మర్రిగూడ మండల చౌరస్తాలో ఆశాల రాస్తారోకో
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో ఆశా వర్కర్ల సమ్మె 13వ రోజు సందర్భంగా మర్రిగూడ చౌరస్తాలో..శనివారం రాస్తారోకో చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18,000 నిర్ణయించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యము, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్ లు పరిష్కరించాలని 13 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, వారి సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేశారు.
లేనియెడల జరగబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలను ఇంటికి సాగనంపడం ఖాయమని వారు అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు ఆశాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా ఐదు లక్షలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అన్నింటిని వర్తింపజేయాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, భీమనపల్లి అరుణ, రామావత్ జయమ్మ, కోయ మంజుల, పల్లె కంసల్య, లపంగి దుర్గమ్మ, కాలం సుజాత, జాజాల అనిత, ఆయిల్ల కలమ్మ, దామెర యాదమ్మ, అయితరాజు సునీత, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA DIST
Oct 08 2023, 14:03