మునుగోడు నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేయనున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఆదివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం 7 గంటలకు చండూర్ మండలం ఇడికుడ గ్రామంలో,
ఉదయం 8 గంటలకు చండూర్ మండలం గొల్లగూడం గ్రామంలో,
ఉదయం 9 గంటలకు చండూర్ BRC ఫంక్షన్ హాల్లో చండూర్ మరియు గట్టుప్పల్ మండలాలకు సంబందించిన గృహలక్ష్మి లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపాక ఫంక్షన్ హాల్లో నారాయణపురం మండలానికి సంబందించిన లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేస్తారు.
సాయంత్రం 4 గంటలకు జయశ్రీ ఫంక్షన్ హాల్లో చౌటుప్పల్ మండల మరియు మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేయనున్నారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.

నల్లగొండ జిల్లా,మర్రిగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ సందర్భంగా, ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలను శనివారం మండలంలోని సరంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ వేనమళ్ళ వెంకటమ్మ - మధుకర్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాకేష్, రేషన్ డీలర్ రాములు, ఫీల్ అసిస్టెంట్ రవి, ఐకెపి అధ్యక్షురాలు నాగమణి, ఐకేపీ సీసీ శ్రీశైలం, స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ సురేష్, గ్రామ మహిళలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.
కొమరం భీం అసిఫాబాద్ జిల్లా:
శుక్రవారం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు.
SB NEWS ASIFABAD DIST
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని వెంటనే పర్మినెంట్ చేయాలని, రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని AITUC మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు.
శుక్రవారం నల్లగొండలో జరిగిన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేసారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే విధంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చి అమలు చేయాలని ఆయన కోరారు.
కనీస వేతన చట్టాలు అమలు చేయకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పేరుతో రాష్ట్రంలో కార్మికుల శ్రమ దోపిడి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగునంగా కాంటాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, 12వ రోజు ఆశా వర్కర్ల సమ్మె కొనసాగుతూ ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఫిక్స్డ్ వేతనం రూ. 18000/- ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్లను చిన్నచూపు చూడకుండా వారికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, కాలం సుజాత, జాజాల అనిత, కోయ మంజుల, పందుల పద్మ, ఎస్ కే సైదా బేగం, దుర్గమ్మ పల్లె కౌసల్య, బాలమణి, ఐతరాజు సునీత, వెంకటమ్మ, యాదమ్మ, పొగాకు అలివేలుమంగ, తదితరులు పాల్గొన్నారు

Oct 07 2023, 21:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.9k