మర్రిగూడ: 12వ రోజుకు చేరిన ఆశా వర్కర్ల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, 12వ రోజు ఆశా వర్కర్ల సమ్మె కొనసాగుతూ ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఫిక్స్డ్ వేతనం రూ. 18000/- ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్లను చిన్నచూపు చూడకుండా వారికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, కాలం సుజాత, జాజాల అనిత, కోయ మంజుల, పందుల పద్మ, ఎస్ కే సైదా బేగం, దుర్గమ్మ పల్లె కౌసల్య, బాలమణి, ఐతరాజు సునీత, వెంకటమ్మ, యాదమ్మ, పొగాకు అలివేలుమంగ, తదితరులు పాల్గొన్నారు
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 06 2023, 16:20