యాదాద్రి జిల్లాలో మొత్తం ఓటర్లు 4,39,100 మంది
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 4 లక్షల 39 వేల 100 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. 1)భువనగిరి, 2) ఆలేరు
• భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 1,05,404 మంది పురుషులు, 1,05,958 మంది స్త్రీలు కలిపి మొత్తం 2,11,362 మంది ఓటర్లు
• ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 1,14,388 మంది పురుషులు, 1,13,332 మంది స్త్రీలు, 18 మంది థర్డ్ జెండర్స్ కలిపి మొత్తం 2,27,738 మంది ఓటర్లు
• వీరిలో 18 నుండి 19 సంవత్సరముల వయస్సు గల ఓటర్లు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 7338, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 7077. మొత్తం ఓటర్లు 14,415.
• 80 సంవత్సరములు పైబడిన ఓటర్లు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 3208 మంది, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 3870 మంది ఉన్నారు. మొత్తం 7078 మంది ఓటర్లు.
ఇక దివ్యాంగులు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 5346 మంది ఓటర్లు • ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 5707 మంది ఉన్నారు. మొత్తం 11,053 మంది ఓటర్లు. థర్డ్ జెండర్స్ ఓటర్లు అలేరు నియోజకవర్గానికి సంబంధించి 18 మంది ఉన్నారు.
జిల్లాలో ఇవిఎం, వివిప్యాట్ మొబైల్ వాహనాల ద్వారా 406 ప్రాంతాలలో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు. రెండవ ఓటరు సవరణ ముసాయిదా జాబితా 21-8-2023 నుండి రెండవ ఓటరు సవరణ తుది జాబితా తేది. 04-10-2023 నాటికి మొత్తం 11,629 మంది ఓటర్లు.
• భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 1663 మంది పురుషులు, 2866 మంది స్త్రీలు, మొత్తం 4529 ఓటర్లు. ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 3052 మంది పురుషులు, 4038 మంది స్త్రీలు, 10 మంది థర్డ్ జెండర్స్ కలిపి మొత్తం 7100 ఓటర్లు.
మొత్తంగా జిల్లా లో 2.65 శాతం ఓటర్లు పెరిగారని కలెక్టర్ తెలిపారు.
Oct 06 2023, 11:19