/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz లెంకలపల్లి: గ్రామపంచాయతీ కార్మికుడు తిప్పర్తి లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం Mane Praveen
లెంకలపల్లి: గ్రామపంచాయతీ కార్మికుడు తిప్పర్తి లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామ పంచాయతీ కార్మికుడు తిప్పర్తి లింగయ్య అనారోగ్యంతో బుధవారం మరణించడం జరిగింది.  గ్రామ పంచాయతీ కార్యదర్శి  గుర్రం ఉమాదేవి తో కలిసి గ్రామ సర్పంచ్ పాక నగేష్ గురువారం తిప్పర్తి లింగయ్య పార్థివ దేహాన్ని సందర్శించి, వారి సతీమణి తిప్పర్తి జయమ్మ కు ఆర్ధిక సహాయం అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా 'మానక్ మహోత్సవ్'
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల స్టాండర్డ్స్ క్లబ్ ఆధ్వర్యం లో గురువారం 'మానక్ మహోత్సవ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుంచి టి.రాకేష్, జాయింట్ డైరెక్టర్ మరియు జి‌. ప్రభాకర్ రిటైర్డ్ డి‌ఎస్‌ఓ పాల్గొని హాల్ మార్క్ తదితర స్టాండర్డ్స్ ప్రాముఖ్యతను, BIS పనితీరును వివరించారు. ప్రిన్సిపాల్ డా.ఘన్ శ్యామ్ మాట్లాడుతూ..నిత్య జీవితంలో స్టాండర్డ్స్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో  విద్యార్ధినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు BIS తరపున పది వేల రూపాయల నగదు బహుమతులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, ఏ‌ఈసి డా.వెంకట కృష్ణ, అధ్యాపకులు రాజశేఖర్, యాదగిరి, నరసింహ రాజు, బిక్షమయ్య, అరుణ, నరేష్ పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
లెంకలపల్లి: తిప్పర్తి లింగయ్యకు ఘన నివాళి
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి  గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వర్కర్స్ సీనియర్ నాయకుడు కామ్రేడ్ తిప్పర్తి లింగయ్య కు గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ.. కామ్రేడ్ తిప్పర్తి లింగయ్య  గ్రామపంచాయతీ వర్కర్స్ గా పనిచేస్తూ మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ చురుగ్గా ఉద్యమంలో పాలుపంచుకొని ముందుకెళ్లాడని ప్రజా ఉద్యమానికి సిఐటియు కీలకంగా పని చేశాడని, ఆయన లోటు పూడ్చలేనిదని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఘన నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు  నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మండల అధ్యక్షుడు వట్టిపల్లి హనుమంతు, మండల కార్యదర్శి ఊరుపక్క లింగయ్య, నక్క నరసింహ, ఊరు పక్క వెంకటయ్య, బడే లక్ష్మీకాంత్, గుండెపూరి నరసింహ, ప్లంబర్ యూనియన్ నాగోల్, హైదరాబాద్ యూనియన్ అధ్యక్షుడు దామెర రవి, ఆశ వర్కర్స్ ఏర్పుల పద్మ, ఎస్.కె సైదాబేగం, అమరాబాదు సునీత,ఎడ్ల అంజయ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు.
TS: ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ
HYD: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో బిజెపి ఎన్నికల కమిటీలను  ప్రకటించింది. 14 కమిటీలను నియమించింది.
వివరాలు ఇలా ఉన్నాయి
1. సోషల్ ఔట్‌రీచ్‌ కమిటీ చైర్మన్ డాక్టర్ కె. లక్ష్మణ్ (ఎంపీ)
కన్వీనర్ బొర్రా నర్సయ్య గౌడ్ (మాజీ ఎంపీ)
2. పబ్లిక్ మీటింగ్స్ చైర్మన్ బండి సంజయ్ కుమార్ (ఎంపీ)
కన్వీనర్ జి. ప్రేమేందర్ రెడ్డి
జాయింట్ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు.
3. ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌ రీచ్‌ కమిటీ చైర్మన్ డీకే అరుణ.
కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి
4. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.
కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి.
జాయింట్ కన్వీనర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
5. చార్జిషీట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావు.
కన్వీనర్ లక్ష్మీనారాయణ (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ రామచంద్రుడు (రిటైర్డ్ ఐఏఎస్)
6. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కన్వీనర్ దుగ్యాల ప్రదీప్ కుమార్.
7. యాక్షన్ కమిటీ చైర్మన్ విజయశాంతి (మాజీ ఎంపీ)
కన్వీనర్ గంగిడి మనోహర్ రెడ్డి
8. సోషల్ మీడియా చైర్మన్ ధర్మపురి అరవింద్
కన్వీనర్ పొరెడ్డి కిషోర్ రెడ్డి
9. ఎన్నికల కమిషన్ ఇష్యూష్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి
కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్
10. హెడ్ క్వార్టర్స్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నల్లు ఇంద్రసేనా రెడ్డి
కన్వీనర్ బంగారు శృతి
11. మీడియా కమిటీ చైర్మన్ రఘునందన్ రావు,
కన్వీనర్ ఎన్. రామచంద్రరావు. (మాజీ ఎమ్మెల్సీ)
జాయింట్ కన్వీనర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి (బీజేపీ సెక్రటరీ)
12. క్యాంపెయిన్ ఇష్యూ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్.
కన్వీనర్ ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్
13. ఎస్సీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి.
కన్వీనర్ జి. విజయ రామారావు (మాజీ మంత్రి)
14. ఎస్టీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గరికపాటి మోహన్ రావు.
కన్వీనర్ సోయం బాపూరావు (ఎంపీ)
జాయింట్ కన్వీనర్ డి. రవీంద్ర నాయక్
TS: పెండింగ్ లో ఉన్న కరువుభత్యాలు అన్ని మంజూరు: సజ్జనార్
HYD: TSRTC ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు (డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు టి ఎస్ ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏ ను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏ ను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సజ్జనార్ మాట్లాడుతూ..టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ టిఎస్ ఆర్టిసి అని, క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏ లను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరు తో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది. అని తెలిపారు.

SB NEWS TELANGANA
YBD: భువనగిరి మండలం లో దారుణ హత్య
యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం తుక్కాపూర్‌ గ్రామంలో గురువారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన గుంటి బసవయ్య(65), తిరుపతమ్మ(50) దంపతులపై  రాసాల రాజమల్లు అనే వ్యక్తి చేతి కొడవలితో దాడి చేశాడు. భర్త బసవయ్య అక్కడికక్కడే ఘటన స్థలంలో మృతి చెందగా, భార్య తిరుపతమ్మ ను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజమల్లు ను అదుపులోకి తీసుకున్నారు. రాజమల్లు సైకో అని, గతంలో భార్యపై దాడికి పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. SB NEWS YADADRI DIST

SB NEWS TELANGANA
యాదాద్రి జిల్లాలో మొత్తం ఓటర్లు 4,39,100 మంది
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 4 లక్షల 39 వేల 100 మంది ఓటర్లు ఉన్నట్లు  జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. 1)భువనగిరి, 2) ఆలేరు

• భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 1,05,404 మంది పురుషులు, 1,05,958 మంది స్త్రీలు కలిపి మొత్తం 2,11,362 మంది ఓటర్లు

• ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 1,14,388 మంది పురుషులు, 1,13,332 మంది స్త్రీలు, 18 మంది థర్డ్ జెండర్స్ కలిపి మొత్తం 2,27,738 మంది ఓటర్లు • వీరిలో 18 నుండి 19 సంవత్సరముల వయస్సు గల ఓటర్లు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 7338, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 7077. మొత్తం ఓటర్లు 14,415.

• 80 సంవత్సరములు పైబడిన ఓటర్లు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 3208 మంది, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 3870 మంది ఉన్నారు. మొత్తం 7078 మంది ఓటర్లు.

ఇక దివ్యాంగులు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 5346 మంది ఓటర్లు • ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 5707 మంది ఉన్నారు. మొత్తం 11,053 మంది ఓటర్లు. థర్డ్ జెండర్స్ ఓటర్లు అలేరు నియోజకవర్గానికి సంబంధించి 18 మంది ఉన్నారు. జిల్లాలో ఇవిఎం, వివిప్యాట్ మొబైల్ వాహనాల ద్వారా 406 ప్రాంతాలలో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు. రెండవ ఓటరు సవరణ ముసాయిదా జాబితా 21-8-2023 నుండి రెండవ ఓటరు సవరణ తుది జాబితా తేది. 04-10-2023 నాటికి మొత్తం 11,629 మంది ఓటర్లు.

• భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 1663 మంది పురుషులు, 2866 మంది స్త్రీలు, మొత్తం 4529 ఓటర్లు. ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 3052 మంది పురుషులు, 4038 మంది స్త్రీలు, 10 మంది థర్డ్ జెండర్స్ కలిపి మొత్తం 7100 ఓటర్లు.
మొత్తంగా జిల్లా లో 2.65 శాతం ఓటర్లు పెరిగారని కలెక్టర్ తెలిపారు.
NLG: ఉమెన్స్ కాలేజీలో మన్మాద ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం
నల్లగొండ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మన్మాద ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. 1991- 95 మద్యకాలంలో స్థానిక ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పని చేసి పదవీవిరమణ పొందిన PSMK మన్మాద జ్ఞాపకార్థం వారి పిల్లలు ప్రతి సంవత్సరం ఈ అవార్డు ను బహుకరిస్తున్నారు. ఈ అవార్డు క్రింద డిగ్రీ ప్రధమ , ద్వితీయ , మరియు తృతీయ సంవత్సరం BZC గ్రూప్ లో ప్రధమ,ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినులకు వరుసగా రూ. 5000/-, 4000/-, ౩౦౦౦/- చొప్పున ప్రైజ్ మనీ మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. ఈ అవార్డు ను 2006 -07 విద్యా సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు. 2019 -20, 2020 -21, మరియు 2021 -22 విద్యా సంవత్సరాలకు గాను మొత్తం 27 మంది విద్యార్థినులు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్. నరేష్ అధ్యక్షత వహించగా విశిష్ట అతిధి గా మన్మాద కూతురు సి. రాధా రమణి మరియు ముఖ్య అతిధి గా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా రమణి మాట్లాడుతూ.. మా అమ్మ పేరు మీద అవార్డు నివ్వడం చాల సంతృప్తిగా వున్నదని, విద్యార్థులు దీన్ని ప్రేరణగా తీసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అన్నారు. డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. విద్యార్థినులు కష్టపడి పట్టుదల తో చదివి ఇలాంటి ఆర్థిక తోడ్పాటు ఆసరాగా చేసుకొని తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జంతుశాస్త్ర అధ్యాపకులు జె. స్వామి , కే.వనజ, మిస్కీన్, సి హెచ్ సమత, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి , వృక్ష శాస్త్ర విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డి, మైక్రో బయాలజీ విభాగాధిపతి దేవవాణి, రసాయన శాస్త్ర విభాగాధిపతి బి. జ్యోతి, గణితశాస్త్ర విభాగాధిపతి నర్సింహా రాజు, BSSP రాజశేఖర్, IQAC కో ఆర్డినేటర్ రవిచంద్ర, అధ్యాపకులు హాసేన, యాదగిరి, రవి, నరేష్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST
TS: 20 మంది అభ్యర్ధులతో బీఎస్పీ తొలి జాబితా విడుదల

HYD: ప్రజాబలం తో రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో, మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కో-ఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్, బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 20 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు.

1. సిర్పూర్ (జనరల్) - డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్

2. జహీరాబాద్ (ఎస్సీ) - జంగం గోపీ

3. పెద్దపల్లి (జనరల్) - దాసరి ఉష

4. తాండూరు (జనరల్) - చంద్రశేఖర్ ముదిరాజ్

5. దేవరకొండ (ఎస్టీ)- డా.ముడావత్ వెంకటేష్ చౌహాన్

6. చొప్పదండి (ఎస్సీ) - కొంకటి శేఖర్

7. పాలేరు (జనరల్) - అల్లిక వెంకటేశ్వర్ రావు

8. నకిరేకల్ (ఎస్సీ) - మేడి ప్రియదర్శిని

9. వైరా (ఎస్టీ)- బానోత్ రాంబాబు నాయక్

10. ధర్మపురి (ఎస్సీ) - నక్క విజయ్ కుమార్

11. వనపర్తి (జనరల్) - నాగమోని చెన్న రాములు

12. మనకొండూరు (ఎస్సీ) - నిషాని రామచందర్

13. కోదాడ (జనరల్) - పిల్లిట్ల శ్రీనివాస్

14. నాగర్ కర్నూల్ (జనరల్)- కొత్తపల్లి కుమార్

15. ఖానాపూర్ (ఎస్టీ)- - బాన్సీలాల్ రాథోడ్

16. అందోల్ (ఎస్సీ) - ముప్పారపు ప్రకాష్

17. సూర్యాపేట (జనరల్) - వట్టే జానయ్య యాదవ్

18. వికారాబాద్ (ఎస్సీ) - గోర్లకాడి క్రాంతి కుమార్

19. కొత్తగూడెం (జనరల్) - ఎర్ర కామేష్

20. జుక్కల్ (ఎస్సీ) - ప్రధ్న్య కుమార్ మాధవరావు

మిగిలిన స్థానాలకు అభ్యర్థులను మరికొద్ది రోజులలో ప్రకటిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP TELANGANA

NLG: నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడి ప్రియదర్శిని
తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ మంగళవారం.. రాష్ట్రంలో 20 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తూ మొదటి జాబితాను విడుదల చేశారు.
నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడి ప్రియదర్శిని ని.. బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. మేడి ప్రియదర్శిని నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీని విస్తరింప చేయడానికి కొంతకాలం నుండి విశేష కృషి చేస్తున్నారు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి మండల కమిటీలను, గ్రామ కమిటీలను వేసి ప్రజల్లోకి వెళ్లి బహుజన్ సమాజ్ పార్టీలోకి రావాలని ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలు నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో ఆమె బలమైన కేడర్ ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల్లోకెళ్లి బహుజన సమాజ్ పార్టీ గురించి తెలుపుతూ ప్రజాధరణ పొందుతున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించడానికి నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని ముందుంటున్నారు. ప్రజలకు మేలు జరగడానికి అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.. ఇప్పటికే ఆవిడ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పలు ఉద్యమాలు చేపట్టారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టి ప్రజలకు చేరువయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదివిన మేడి ప్రియదర్శిని ని బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు నియోజకవర్గ ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.