NLG: మర్రిగూడెం మండలంలో కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడి ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది, నేడు 22వ రోజుకు చేరుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు.
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి చెల్లం పాండురంగా రావు లు అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపి, మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు ఐదు లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు అంగన్వాడీ ఉద్యోగుల పోరాటం ఆగదని వారు హెచ్చరించారు జరగబోయే ఎన్నికల్లో అంగన్వాడీ ఉద్యోగులు తలుచుకుంటే ప్రస్తుత ప్రభుత్వం కూలిపోక తప్పదని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శోభ, కాకులవరం రజిత, బొబ్బిలి శోభారాణి, చిట్యాల సువర్ణ, విగ్నేశ్వరి, అనంతలక్ష్మి, శిలువేరు లక్ష్మి, ఉడుతల లక్ష్మి, అరుణ, పద్మ, సులోచన, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 03 2023, 16:12