/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz సేవాలాల్ మహారాజ్ మందిరం కోసం స్థలం కేటాయించాలని వినతిపత్రం Mane Praveen
సేవాలాల్ మహారాజ్ మందిరం కోసం స్థలం కేటాయించాలని వినతిపత్రం

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, అజిలాపురం గ్రామం ఐదో వార్డులో ఉన్న దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి డాక్ తోట బావి స్థలమును బంజారా ఆరాధ్య దైవం.. సద్గురు సేవాలాల్ మహారాజ్ మందిరం కోసం, బంజారా కమిటీ హాల్ కోసం, గ్రామపంచాయతీ తీర్మానం చేయాలని గ్రామస్తులు సర్పంచ్ మరియు కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. గ్రామకంఠం రికార్డులను పరిశీలించి వీలైనంత తొందరలో తీర్మానించి చుట్టుపక్కల స్థలము ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేసి గ్రామకంఠం స్థలాన్ని కాపాడాలని కోరారు .

చండూరు: ముందస్తు అరెస్ట్ అయిన బీఎస్పీ నాయకులు
నల్లగొండ జిల్లా, చండూరు: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్లగొండలో ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా, చండూరు మండల బీఎస్పీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టు అయిన వారిలో బహుజన్ సమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు నేరెళ్ల ప్రభుదాసు, ఉపాధ్యక్షులు కడారి సైదులు యాదవ్, మున్సిపల్ అధ్యక్షులు బుషిపాక మాణిక్యం, ఎర్రజల్ల నాగేంద్ర శ్యామ్ ఉన్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: మర్రిగూడెం మండలంలో కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడి ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది, నేడు 22వ రోజుకు చేరుకుంది.

జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు.

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి చెల్లం పాండురంగా రావు లు అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపి, మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు ఐదు లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు అంగన్వాడీ ఉద్యోగుల పోరాటం ఆగదని వారు హెచ్చరించారు జరగబోయే ఎన్నికల్లో అంగన్వాడీ ఉద్యోగులు తలుచుకుంటే ప్రస్తుత ప్రభుత్వం కూలిపోక తప్పదని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శోభ, కాకులవరం రజిత, బొబ్బిలి శోభారాణి, చిట్యాల సువర్ణ, విగ్నేశ్వరి, అనంతలక్ష్మి, శిలువేరు లక్ష్మి, ఉడుతల లక్ష్మి, అరుణ, పద్మ, సులోచన, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

మర్రిగూడెం: గాంధీ చిత్రపటానికి వినతిపత్రం అందజేసిన ఆశాలు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం: ఆశా వర్కర్ల సమ్మె శిబిరం వద్ద, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, ఆశాలు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ.. గాంధీ చిత్రపటానికి  వినతిపత్రం అందజేశారు. ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ 18,000/- నిర్ణయించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సెప్టెంబర్ 25 నుండి చేస్తున్న ఆశా ల సమ్మె న్యాయమైనదని అన్నారు.  ఆశల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు జంపాల వసంత, భీమనపల్లి అరుణ, పందుల పద్మ, కాలం సుజాత, పొనుగోటి సునీత, లప్పంగి దుర్గమ్మ, కోయ మంజుల, ఐతరాజు సునీత, కంసల్య, జయమ్మ, జాజాల అనిత, కలమ్మ,దామెర యాదమ్మ, సైదా బేగం, సునీత, విజయమ్మ, ఆర్ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
హన్మకొండ: గాంధీ విగ్రహం ఎదుట కేయూ విద్యార్థులు నిరసన
TS: నేడు గాంధీ జయంతి సందర్భంగా, హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట కేయూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. పీహెచ్‌డి అడ్మిషన్ల అవకతవకలపై గత కొద్దిరోజులు కేయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం గాంధీ విగ్రహం ఎదుట చేతులకు సంకెళ్లు, నల్ల రిబ్బన్‌ లతో నిరసన దీక్ష చేపట్టారు. 11 గంటల లోగా వీసీ, రిజిస్ట్రార్ స్పందించకపోతే 12 గంటలకు ఆత్మార్పణకు పాల్పడుతామని విద్యార్థులు హెచ్చరించారు. అయితే ఆత్మార్పణ చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులను తరలించేందుకు పోలీసులు యత్నించారు. ఆ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గాంధీ విగ్రహం దగ్గర ఇనుప సంకెళ్లతో విద్యార్థులు తమను తాము బంధించుకున్నారు. దీంతో కట్టర్లతో ఇనుప సంకెళ్లు తెంచి విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. SB NEWS TELANGANA
'మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలి': లెంకలపల్లి గాంధీ సెంటర్ యూత్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా, గాంధీ సెంటర్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ ఎంచుకున్న అహింస మార్గాన్ని, గాంధీ సిద్ధాంతాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ అడుగుజాడల్లో నడవాలని భావితరాల యువతకి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పగిళ్ల హరీష్, పగిళ్ల రాహుల్, మానే ప్రవీణ్, పాక పరమేష్, కుందారపు సాయి, దాసరి విగ్నేష్, పాక శివ, తదితరులు పాల్గొన్నారు
NLG: లెంకలపల్లి లో ఘనంగా గాంధీ జయంతి
నల్లగొండ జిల్లా:  ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో  ఘనంగా గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. కార్యక్రమంలో మేతరి శంకర్, ఏర్పుల సురేష్, కల్లెట్ల శంకర్, ఏర్పుల నరసింహ, దాసరి నరసింహ, పగిళ్ల యాదయ్య, పాక అంజయ్య, గురుస్వామి, ఏర్పుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.
TS: తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం: ప్రధాని మోదీ
మహబూబ్‌నగర్‌: జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆదివారం రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు  శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం - హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్, వరంగల్‌ - ఖమ్మం - విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. దేశంలో పండగల సీజన్‌ నడుస్తోంది. పార్లమెంట్‌లో నారీశక్తి బిల్లును ఆమోదించుకున్నాం. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. రవాణా సదుపాయాలు మెరుగవుతాయని మోదీ అన్నారు. రోడ్డు ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయని తెలిపారు.

పసుపు బోర్డుపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు, పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని పాలమూరు సభ సాక్షిగా ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు ములుగు జిల్లాకు సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ప్రకటించారు. సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీకి నామకరణం చేశారు.

SB NEWS TELANGANA
సెమీఫైనల్ చేరుకున్న నల్గొండ జిల్లా SGF U/19 ఫుట్బాల్ టీం
NLG: గత రెండు రోజులుగా మెదక్ జిల్లా సదాశివపేట లో జరుగుతున్న SGF U/19 బాలుర ఫుట్బాల్ పోటీల్లో.. నల్గొండ జిల్లా ఫుట్బాల్ టీం ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్ లలో రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, జిల్లా జట్ల పై విజయం సాధించి, పూల్ విన్నర్ గా సెమి ఫైనల్ కు చేరుకుందని జిల్లా జట్టు కోచ్, మేనేజర్లు లింగయ్య నాయక్, మద్ది కరుణాకర్ లు తెలిపారు. ఈ సందర్భంగా SGF అండర్19 సెక్రెటరీ ఇందిర మరియు ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రేపటి పర్యటన వివరాలు

NLG: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గంలో అభివృద్ధి పర్యటనలో భాగంగా.. సోమవారం మునుగోడు మరియు చండూరు మండలాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉదయం గం. 7:30 లకు కోతులారం బ్రిడ్జి శంకుస్థాపన

ఉ.8:00 గంటలకు కల్వకుంట్ల నుండి వెల్మకన్నె బిటి రోడ్ శంకుస్థాపన.

ఉ.8:30 గంటలకు చొల్లేడు నుండి బోడంగిపర్తి బిటి రోడ్ శంకుస్థాపన.

ఉ. 9:00 గంటలకు నెర్మట బిటి రోడ్ బ్రిడ్జి శంకుస్థాపన

ఉ. 9:30 గంటలకు పిడబ్ల్యూడి రోడ్ నుండి జోగుగూడెం బిటి రోడ్ శంకుస్థాపన

ఉ.10:15 గంటలకు తిమ్మరెడ్డిగూడెం నుండి నాంపల్లి రోడ్ వరకు బిటి రోడ్ శంకుస్థాపన

ఉ.11:00 గంటలకు గుండ్రేపల్లి నుండి చొప్పరివారి గూడెం బిటి రోడ్ శంకుస్థాపన

ఉ.11:30 గంటలకు చొప్పరివారిగూడెం నుండి లక్కినేనిగూడెం బిటి రోడ్ శంకుస్థాపన

మధ్యాహ్నం 12:15 గంటలకు ఉడుతలపల్లి నుండి దుబ్బగుడెం రోడ్ శంకుస్థాపన

మ.12:45 గంటలకు పిడబ్ల్యూడి రోడ్ నుండి పడమటితాళ్ల బిటి రోడ్ శంకుస్థాపన

మ. 01:30 గంటలకు పుల్లెంల నుండి బోడంగిపర్తి బిటి రోడ్ మరియు పుల్లెంల నుండి గొల్లగూడెం బిటి రోడ్ శంకుస్థాపన మ. 02:00 గంటలకు తాస్కానిగూడెం నుండి సిర్దేపల్లి బిటి రోడ్ శంకుస్థాపన

మ. 3:00 గంటలకు కొరటికల్ నుండి శిర్దేపల్లి బిటి రోడ్ శంకుస్థాపన మరియు నూతన సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన, అదేవిదంగా కొరటికల్ నుండి దుబ్బాకలువ మిగులు బిటి రోడ్ శంకుస్థాపన చేయనున్నట్లు క్యాంపు కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA