NLG: వ్రాతపూర్వక హామీలు వచ్చే వరకు సమ్మె విరమించేది లేదు: బండ శ్రీశైలం
చండూరు: మంత్రుల సమక్షంలో నేడు జరిగిన అంగన్వాడీ ఉద్యోగ సంఘాల చర్చల హామీలు.. రాతపూర్వకంగా ఇచ్చేవరకు సమ్మె యధావిధి గా కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. చండూరు మండల కేంద్రంలో మండల తహసిల్దార్ ఆఫీస్ ముందు జరుగుతున్న అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ నిరవధిక సమ్మె నేటితో 21వ రోజు కు చేరుకుంది.
ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ.. మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ ఇరువురి సమక్షంలో అంగన్వాడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సిఐటియు, ఏఐటియూసి సంఘాల నాయకులు ఆదివారం మంత్రి నివాసంలో చర్చలు జరపడం జరిగిందని తెలిపారు. చర్చలలో పి ఆర్ సి పరిధిలోకి వచ్చే విధంగా వేతన పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వేతనాలు ఎంత పెంచాల్సి ఉంటుందో మరో మారు చర్చిద్దామని అన్నారని తెలిపారు. అయితే వేతన పెంపు ఎంత అని స్పష్టమైన హామీ రాతపూర్వకంగా వచ్చేవరకు సమ్మె కొనసాగుతుందని బండ శ్రీశైలం తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొమ్మరగోని కిరణ్ అడ్వకేట్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ నాయకులు కేదారి, నాగమణి, సత్తెమ్మ, తారక, మునిసా, రాజేశ్వరి, పార్వతమ్మ, భాగ్యమ్మ, సుజాన, అనంతలక్ష్మి, వెంకటమ్మ, మంగ, కలమ్మ, ఉషారాణి, జగదీశ్వరి, సునీత, ఆయాలు అండాలు, సుగుణమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Oct 01 2023, 18:53