మర్రిగూడ: 21వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్స్ ల సమ్మె కొనసాగుతుంది. నేడు 21వ రోజుకు చేరుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రమాద బీమా, కనీస వేతనము 26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కి పది లక్షలు హెల్పర్లకు ఐదు లక్షలు ఇవ్వాలని, వేతంలో సగం పెన్షన్ నిర్ణయించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల సంఘం మండల నాయకురాలు కాకులవరం రజిత, బొబ్బలి శోభారాణి, చిట్యాల సువర్ణ, రాపోలు విజయశ్రీ, విజ్ఞేశ్వర, సిల్వేరు లక్ష్మి,శారద, ఉడుతల లక్ష్మి, రమావత్ సుగుణ, అనంతలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 01 2023, 18:35