/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం Mane Praveen
అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
TS: రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లో వారిని చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కానున్నాయి. త్వరలోనే ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఆ జాబితాలో అంగన్వాడీ లను కూడా చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రి హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆదివారం ఇద్దరు మంత్రులతో ఆయా సంఘాల ప్రతినిధులు భేటీ కాగా.. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీ ల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. జేఏసీ ప్రతినిధులు మంత్రులతో జరిపిన చర్చలు సఫలం కావటంతో అంగన్వాడీలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

ఆదివారం మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ తో జరిగిన చర్చలు ఫలవంతం అయ్యాయని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లో అంగన్వాడీలను చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. దీంతోపాటు మధ్యాహ్న భోజనానికి సంబధించిన పెండింగ్ బిల్లులు సైతం ప్రభుత్వం విడుదల చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. మిగతా అన్ని సమస్యల పరిష్కారం కోసం నివేదిక అందించాలని శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ ని మంత్రులు ఆదేశించారని తెలిపారు.

తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో.. అంగన్వాడి సమ్మెను నేటితో విరమించుకుంటున్నట్లు ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ పై తమకు పూర్తి విశ్వాసం ఉందని… అంగన్వాడీల బాగోగులు చూసుకునే విషయంలో ముఖ్యమంత్రి అనుకూలంగా ఉంటారని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ కు ఆయా సంఘాల ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మర్రిగూడ: 21వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్స్ ల సమ్మె కొనసాగుతుంది. నేడు 21వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రమాద బీమా, కనీస వేతనము 26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కి పది లక్షలు హెల్పర్లకు ఐదు లక్షలు ఇవ్వాలని, వేతంలో సగం పెన్షన్ నిర్ణయించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని  వారు డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల సంఘం మండల నాయకురాలు కాకులవరం రజిత, బొబ్బలి శోభారాణి, చిట్యాల సువర్ణ, రాపోలు విజయశ్రీ, విజ్ఞేశ్వర, సిల్వేరు లక్ష్మి,శారద, ఉడుతల లక్ష్మి, రమావత్ సుగుణ, అనంతలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: బార్ అసోసియేషన్ క్రికెట్ టీమ్ కు నూతన క్రికెట్ కిట్ ను అందజేసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు
NLG: ఖమ్మం లో జరగబోయే న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ కొరకు ఆదివారం, నల్గొండ బార్ అసోసియేషన్ క్రీకెట్ టీమ్ కు.. నూతన క్రికెట్ కిట్ ను, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి రఘుపతి  మరియు జనరల్ సెక్రెటరీ జెనిగల రవికుమార్, ఈ. సీ. మెంబెర్స్ ఏ.ఆదిరెడ్డి, కే. శ్రీనివాస్ రెడ్డి, ఎల్. గోవర్ధన్ గారు, జీ. కిషోర్ కుమార్ , పి. కార్తిక్ , గాలి. శ్రీనివాస్. అందజేసినట్లు గేమ్స్ సెక్రెటరీ, ఏర్పుల కామేశ్వర్ తెలిపారు. కార్యక్రమం లో సీనియర్ న్యాయవాదులు యన్ ప్రసన్న కుమార్, జీ. అశోక్ కుమార్ గారు, కే. కిషోర్ కుమార్, పి స్వామీ గౌడ్, జీ. అంజిరెడ్డి మరియు జూనియర్ న్యాయవాదులు అజ్మీర్ ఖాన్, ఆఫ్రోజ్, నరేందర్ నాయక్ ,హరి రామ్, బాలకృష్ణ, మరియు కోర్టు స్టాఫ్ వి. నర్సింహ, ఫణి  తదితరులు పాల్గొన్నారు SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: చేల్లం పాండురంగారావు
NLG జిల్లా, మర్రిగూడ: అంగన్వాడీ టీచర్స్ హెల్పర్లు నిర్వహిస్తున్న సమ్మె 20వ రోజుకు చేరిన సందర్భంగా మర్రిగూడ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద శనివారం వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చేల్లం పాండురంగారావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం, 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమ అరెస్టులను ఆపివేయాలని, అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ పైన అధికారుల వేధింపులను మానుకోవాలని ఆయన అన్నారు.

అంగన్వాడి సమస్యల పైన నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అంగన్వాడి కార్మికుల కోరిన సాధారణమైన డిమాండ్లను పరిష్కరించపోగా వారిపై కేసులు పెడుతూ బెదిరింపులకు గురి చేయడం ప్రభుత్వానికి సరైన విధానం కాదని, తక్షణమే వారిని చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వారు విధుల్లో చేరే విధంగా వారి డిమాండ్లను పరిష్కరించి వారికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


TTD: కొండపై భక్తుల రద్దీ, సర్వదర్శనం టోకెన్లు రద్దు..
తిరుమల కొండ భక్తులతో నిండి పోయింది. పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా ఆధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్ ఎస్ డి టోకెన్ల జారీని రద్దు చేసింది. పవిత్రమైన పెరటాసి మాసంలో రెండవ శనివారంతో పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో రద్దీగా మారాయి. క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో అక్టోబర్ 1, 7, 8, 14 మరియు 15వ తేదీలలో ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేయటం లేదని టీటీడీ ప్రకటించింది. అలిపిరి నుండి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చిన బస్సులతో నిలిచి ఉన్నాయి. అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. సెప్టెంబర్ 30 నాటికి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. కావున ఈ దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థ యాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

TS: పారదర్శకత, అక్రమాల నివారణకు ఈ - మైనింగ్ మొబైల్ యాప్: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
HYD: గనులు భూగర్భ వనరుల శాఖలో మరింత పారదర్శకతను పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ- మైనింగ్ మొబైల్ యాప్ దోహదం చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంలో సిఎస్ శాంతి కుమారి, గనుల శాఖ డీఎం జిపి.కాత్యాయని దేవి లతో కలిసి శనివారం, తెలంగాణ ఈ - మైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ మరియు హైదరాబాద్ లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసి) సంయుక్తంగా ఈ మొబైల్ యాప్ ను అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. ఈ- మైనింగ్ యాప్ తో గనులు, ఇటుక, ఇసుక రవాణా జరిగినప్పుడు రవాణా వాహనాలను తనిఖీ చేసి ట్రాన్సిస్ట్ ఫామ్ మరియు ట్రాన్సిస్టర్ అనుమతులు ఉన్నాయా లేవా అనే అంశాలను ఆన్లైన్లో వెంటనే సిబ్బంది తెలుసుకోవచ్చని తెలిపారు. అక్రమ రవాణా, అనుమతులు లేకుండా, అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో రవాణా కు పాల్పడితే వారిపై చర్యలు తీసుకొని, పెనాల్టీ విధించి ఆ సమాచారాన్ని వాహన యజమానికి ఆన్లైన్ పద్ధతిలో లింక్ ద్వారా పంపించి, వెంటనే పెనాల్టీ వసూలు చేసేందుకు సిబ్బందికి.. అలాగే చెల్లించేందుకు వాహన యజమానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు. డీలర్లు మరియు లీజు హోల్డర్లు ఖనిజ రవాణాలో ఆన్లైన్ ద్వారా తమ రవాణా చేసుకునేందుకు శాఖా పరమైన అనుమతుల నిర్ధారణ సైతం తెలుసుకోవచ్చని అన్నారు. అలాగే తనిఖీలు నిర్వహించే గనుల శాఖ ఏడీ లు, అసిస్టెంట్ జియాలజిస్టులు, టెక్నికల్ అసిస్టెంట్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్ లకు వాహనాల తనిఖీ చాలా సులభం అవుతుందని వెల్లడించారు.

ఈ - మైనింగ్ మొబైల్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు వెంటనే తీసుకోవడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు. ఇసుకతో పాటు ఇటుక, ఖనిజాల అక్రమ రవాణాలో పారదర్శకతకు ఎంతో తోడ్పడుతుందని, దేశంలోనే ఎక్కడలేని విధంగా అభివృద్ధి పరిచే దశలో ఉందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు.

SB NEWS TELANGANA
NLG: 2023 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ డివిజన్ స్థాయి కబడ్డీ పోటీల్లో విజేతగా నిలిచిన నల్గొండ మండల కబడ్డీ టీం
నల్లగొండ: పట్టణంలోని  మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన, నల్గొండ డివిజన్ స్థాయి కబడ్డీ అండర్ 17 బాలుర విభాగంలో, నల్గొండ మండల జట్టు అద్భుతమైన ఆటతీరుతో అన్ని మండల జట్లపై విజయం సాధించి ఫైనల్ కు చేరుకొని.. కేతెపల్లి మండలం పై అద్భుతమైన విజయం సాధించి డివిజన్ స్థాయి విజేతగా నిలిచిందని, శనివారం కబడ్డీ టీం కోచ్ బొమ్మపాల గిరిబాబు తెలిపారు. గత వారం రోజుల నుండి మండల కబడ్డీ జట్టుకు హైదరాబాద్ రోడ్ లోని ఏస్ ఆర్ ప్రైమ్ స్కూల్ లో ప్రత్యేక శిక్షణను పాఠశాల పిఇటి ల పర్యవేక్షణలో నిర్వహించామని, తద్వారా క్రీడాకారులు మంచి ప్రావిణ్యాన్ని పొందారని ఈ సందర్భంగా కోచ్ బొమ్మపాల గిరిబాబు తెలిపారు. SB NEWS SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
TS: రాష్ట్ర శాసన సభ, శాసన మండలిని సందర్శించిన కేరళ మంత్రి.. స్వాగతం పలికిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
హైదరాబాద్: కేరళ రాష్ట్ర ప్రభుత్వ పోర్ట్స్, మ్యూజియమ్స్, అర్కియాలజీ శాఖల మంత్రి అహ్మద్ దేవర కోవిల్ శనివారం తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలిని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా తో సత్కరించి, చార్మినార్ మెమెంటో ను అందజేశారు. కేరళమంత్రికి శాసన సభ, శాసన మండలి సమావేశ మందిరాలను చూపించి.. తెలంగాణ రాష్ట్రంలో సమావేశాలు జరిగే తీరు, నియమ నిబంధనలు అన్నింటిని సుఖేందర్ రెడ్డి వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి కూడా కేరళ మంత్రి కి ఆయన వివరించారు. ఈ ప్రోగ్రామ్స్ వల్ల తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి పథంలో నడుస్తున్నదని కేరళ మంత్రి  అహ్మద్ దేవర కోవిల్ ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, శాసన మండలి సచివాలయ అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
NLG: మర్రిగూడ మండలంలో వంటావార్పు తో నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో  శనివారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పాల్గొని, మద్దతు తెలిపి మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం  రూ. 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 10 లక్షలు హెల్పర్ కు 5 లక్షల చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని,  2017 నుండి టీఏ డీఏ ఇంక్రిమెంట్, అలవెన్సులు బకాయిలు మొత్తం చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
TS: నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం ఆనందంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌ లో గవర్నర్‌ తమిళిసై శనివారం కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. "తమకు (మహిళలకు) 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు నేను భాజపా నేతను, ఇప్పుడు గవర్నర్‌ను.. రాజకీయాలపై ఇష్టం వల్లే వైద్య వృత్తికి దూరంగా ఉన్నా, రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. గవర్నర్‌గా వచ్చిన తర్వాత ఇద్దరు మహిళలు మంత్రులు అయ్యారు.

నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు.. రాళ్లు వేసే వారున్నారు. నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా. నాపై పిన్స్‌ వేస్తే..ఆ పిన్స్‌ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర బుక్‌ రాసుకుంటా.. అందరూ అందరికీ నచ్చాలని లేదు. నాపై పువ్వులు వేసినా.. రాళ్లు వేసినా ఆహ్వానిస్తా. మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలి. ఎలాంటి అవమానాలు పట్టించుకోను.. ప్రజల కోసం పనిచేస్తా'' అని గవర్నర్‌ వెల్లడించారు.