NLG: ఎన్జీ కళాశాలలో ఘనంగా హిందీ భాషా దినోత్సవం
నల్లగొండ: హిందీ భాషా దినోత్సవం సందర్భంగా, పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యామ్ ఆధ్వర్యంలో భాషా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హోమ్ నిధి శర్మ, మేనేజింగ్ డైరెక్టర్ బిడిఎల్, హైదరాబాద్ వారు పాల్గొని మాట్లాడుతూ.. హిందీ భాషా ప్రాధాన్యతను, భాషల ఆవశ్యకతను, హిందీ చదవడం వల్ల లభించే ఉద్యోగ అవకాశాలు గురించి వివరించారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే క్రమశిక్షణ సమయపాలన అవసరమని అన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. హిందీ భాషను ఎంచుకొని అభ్యసించడం వలన కలిగే లాభాలు తెలిపారు.
మల్కాజిగిరి ప్రభుత్వ కళాశాల హిందీ ఉపన్యాసకులు జి ఎన్ జగన్ మాట్లాడుతూ.. హిందీ భాషా జాతీయ ఐక్యతకు ప్రతీక అని చెప్పారు.
మరో అతిధి ఖలీముద్దీన్ మాట్లాడుతూ.. హిందీ వలన భారతీయ సంస్కృతి తన భిన్నత్వాన్ని ఎలా నిలుపుకుంటుందో వివరించారు.
ఈ కార్యక్రమంలో హిందీ శాఖ అధ్యక్షులు డాక్టర్ సీతారాం రాథోడ్, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కృష్ణ కౌడిన్య, డాక్టర్ వి వి సుబ్బారావు, డాక్టర్ ఎన్ దీపిక, డాక్టర్ వెల్దండ సుబ్బారావు, లవీందర్ రెడ్డి, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, లింగస్వామి, రమ్య, గోవర్ధనగిరి, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Sep 30 2023, 21:25