అభివృద్ధి చేసి..మునుగోడు రుణం తీర్చుకుంటా: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి.. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించిన, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రూ. 30కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల శంకుస్థాపన చేశారు.
మండలంలోని అల్లాపురం గ్రామానికి ఉదయమే చేరుకున్న ఎమ్మెల్యే.. సరళ మైసమ్మ దేవాలయానికి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం పీపల్ పహాడ్, డి.నాగారం, కొయ్యలగూడెం, ఎల్లంబావి, పంతంగి, ఎస్ లింగోటం, నేలపట్ల, కుంట్లగూడెం, మందోళ్ళగూడెం, పెద్ద కొండూరు, చిన్న కొండూరు గ్రామాలలో వరుసగా పర్యటించారు. పంచాయతీరాజ్ నిధులు సుమారుగా రూ.15కోట్లు, హెచ్ఎండిఏ నిధులు రూ.15 కోట్లతో ఆయా గ్రామాలలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఎల్లంబావి గ్రామంలో సర్పంచ్ గుర్రం కొండల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. సర్పంచ్ కొండల్, ఎల్లంబావి గ్రామ శివారు నుండి డప్పు వాయిద్యాల నడుమ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అభివృద్ధి పనుల పట్ల ఆయా గ్రామాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 నుండి 2018వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోయిందని గుర్తు చేశారు.
2018 లో ప్రజలను మోసపూరిత మాటలతో నమ్మించి మోసం చేసి వచ్చిన ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని ధ్వజమెత్తారు. కెసిఆర్ దీవెనలతో మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో 2022 ఉప ఎన్నికల్లో గెలిచానని, గెలిచిన నాటి నుంచి మునుగోడు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు.
మునుగోడు ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చు కోవడమే లక్ష్యంగా ముందు కెళ్తున్నానన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజల ఆశీర్వాదం తనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సర్పంచులు కొలను శ్రీనివాస్ రెడ్డి, గుర్రం కొండల్, రెక్కల ఇందిరా సత్తిరెడ్డి, ఆకుల సునీత శ్రీకాంత్, బక్క స్వప్న శ్రీనాథ్, కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి, బాతరాజు సత్యం, చౌట వేణుగోపాల్, కాయితి రమేష్ గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కాటి నిరంజన్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, ఉప సర్పంచ్ లు బోరెం ప్రకాష్ రెడ్డి, సాయి రెడ్డి బుచ్చిరెడ్డి, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కొత్త పర్వతాలు, జిల్లా డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తూర్పింటి యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు సుర్కంటి శ్రీధర్ రెడ్డి, చెక్క శ్రీనివాస్, బొడ్డు గాలయ్య, మాచర్ల కృష్ణ, పిట్టల శంకరయ్య, మాజీ సర్పంచ్ లు బక్క శంకర్, యాట యోగానందం, నాయకులు మెట్టు మహేశ్వర్ రెడ్డి, గంగాపురం నగేష్ గౌడ్, రాసాల నాగరాజు యాదవ్, బొడ్డు పరమేష్, రిక్కల బాలకృష్ణారెడ్డి, జువ్వి శివకుమార్, పోలేపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Sep 30 2023, 16:33