ఆశా లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధ వారం, మూడో రోజు సమ్మె సందర్భంగా మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశా వర్కర్ లు తమకు, ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్లను పరిష్కరించాలని సమ్మెలోకి దిగడం జరిగిందని తెలిపారు.
ఆశా వర్కర్స్ ఫిక్స్డ్ వేతనంతో పాటు హెల్త్ కార్డులు, సంక్షేమ పథకాలు అన్నింటిని వర్తింపజేయాలని ఏఎన్ఎం, జిఎన్ఎమ్ పోస్టుల్లో ఆశాలకు ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని, వెయిటేజ్ మార్కులు నిర్ణయం చేయాలి, పారితోషకం లేని అదనం పనులు ఆశలతో చేయించకూడదని, టీబి స్కూటీ డబ్బాలను ఆశలతో మోపించే పని రద్దు చేయాలని, లెప్రసి సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని, వాలంటీర్లను ఏర్పాటు చేయాలి, ఆశాలకు పని భారం తగ్గించాలి, జాబ్ చార్ట్ ను విడుదల చేయాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు.
అదేవిదంగా 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియర్ బిల్లు వెంటనే చెల్లించాలి, కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ ఏలవన్స్ వెయ్యి చొప్పున 16 నెలలు బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని, అట్లాగే 32 రకాల రిజిస్టర్లను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలని, ఆశలకు ప్రసూతి సెలవుల సర్కులర్ ను వెంటనే జారీ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, కాలం సుజాత ,ఎస్కే సైదా బేగం, విజయమ్మ, కలమ్మ, తబిత, మంజుల, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
STREETBUZZ NEWS APP
Sep 29 2023, 12:03