/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz కాంగ్రెస్ పార్టీలో చేరిన వేముల వీరేశం, మైనంపల్లి హన్మంతరావు Mane Praveen
కాంగ్రెస్ పార్టీలో చేరిన వేముల వీరేశం, మైనంపల్లి హన్మంతరావు
TS: మల్కాజ్ గిరి నియోజకవర్గ  ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం కాంగ్రెస్ లో చేరారు. మరి కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు హస్తం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్‌, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి నాయకులు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గురువారం సాయంత్రం తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు తాఖరే, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS TELANGANA STREETBUZZ NEWS APP



లెంకలపల్లి: రికార్డ్ స్థాయిలో రూ. 1,01,116/- లకు పలికిన లడ్డు వేలం

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, గాంధీ సెంటర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద లడ్డు వేలంపాట రికార్డ్ స్థాయిలో రూ. 1,01,116/- లకు పలికింది. గ్రామానికి చెందిన కాటం వెంకన్న రూ. 1,01,116/- లకు సొంతం చేసుకున్నారు. అదేవిధంగా

కొబ్బరికాయ - దాసరి వెంకన్న రూ. 9,116/-
పండ్లు - పగిళ్ళ రామకృష్ణ 9,016/-
పట్టువస్త్రాలు - చిరుమామిళ్ళ గోపి రూ.5,116/-
చిన్న లడ్డు - గుంటోజు బ్రహ్మచారి రూ.23,116/-
లకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు గాంధీ సెంటర్ వినాయక ఉత్సవ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. SB NEWS SB NEWS NALGONDA DIST STREETBUZZ NEWS APP SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP TELANGANA
చౌటుప్పల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రేపు శుక్రవారం నాడు చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యక్రమ సమయ వివరాలు:
ఉ 8:00    అల్లాపురం
ఉ 8:30    పీపలపహాడ్
ఉ 9:00    డి నాగారం
ఉ 9:30    కొయ్యలగూడెం
ఉ 10:00  ఎల్లంబావి
ఉ 11:00  పంతంగి
ఉ 11:45  ఎస్ లింగోటం
మ 12:15 నేలపట్ల
మ 1:00   కుంట్లగూడెం
మ 1:30   మందోళ్లగూడెం
మ 2:00   పెద్దకొండూర్
మ 2:30   చిన్నకొండూర్

ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
*అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలి*: *రామావత్ రమేష్ నాయక్

దేవరకొండలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవదిక సమ్మె 18 రోజు సందర్భంగా, వారి సమ్మెకు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ రామావత్ రమేష్ నాయక్ మద్దతు తెలిపి మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో ఆయాలు, టీచర్లు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ, వారిబ్చంటి బిడ్డలను కూడా తమ బిడ్డ లాగానే సాకుతూ వారి భవిష్యత్తుకు పునాది వేసేటువంటి అంగన్వాడీ ఆయాలు టీచర్లు ఇవాళ సమ్మె చేసే పరిస్థితి వచ్చింది అంటే ఈ తెలంగాణలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు అని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వారు ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, కనీస వేతనం అడుగుతున్నారు. ప్రమాద భీమా, రిటర్మెంట్ పింఛన్ అడుగుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ఏఐటీయూసీ నాయకులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, మహమ్మద్ ఇమ్రాన్, మంగు నాయక్, దత్తు నాయక్, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు SB NEWS SB NEWS NALGONDA DIST SB NEWS TELANGANA STREETBUZZ NEWS APP

SB NEWS
ఇబ్రహీంపట్నంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఆర్పీలు

రంగారెడ్డి జిల్లా: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ  మెప్మా  ఆర్పి ల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో గురువారం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆర్పి ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు జిల్లా అధ్యక్షురాలు భరతాకి  హంసమ్మ మాట్లాడుతూ.. రూ.4000  ఉన్న తమ గౌరవ వేతనాన్ని సీఎం కేసీఆర్ మరో రూ. 2000 పెంచుతూ.. రూ. 6000 చేసి జీవో విడుదల చేశారని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మెప్మా ఆర్పీల తరఫున ధన్యవాదాలు అని తెలిపారు. 

కార్యక్రమంలో రాష్ట్ర  ఉపాధ్యక్షురాలు మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు  భారతాకి హంసమ్మ, , ఇబ్రహీం పట్నం అధ్యక్షురాలు పార్వతమ్మ అమీర్పేట అధ్యక్షురాలు సుగుణ, జిల్లెలగూడ అధ్యక్షురాలు అనిత, తుర్కయంజాల్  అధ్యక్షురాలు ఝాన్సీ, బడంగ్ పేట అధ్యక్షురాలు ఎం.డి సఖిన, అంబర్పేట అధ్యక్షురాలు సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఆశా లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధ వారం, మూడో రోజు సమ్మె  సందర్భంగా మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి  ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశా వర్కర్ లు తమకు, ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్లను పరిష్కరించాలని సమ్మెలోకి దిగడం జరిగిందని తెలిపారు. ఆశా వర్కర్స్ ఫిక్స్డ్ వేతనంతో పాటు హెల్త్ కార్డులు, సంక్షేమ పథకాలు అన్నింటిని వర్తింపజేయాలని ఏఎన్ఎం, జిఎన్ఎమ్ పోస్టుల్లో ఆశాలకు ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని, వెయిటేజ్ మార్కులు నిర్ణయం చేయాలి, పారితోషకం లేని అదనం పనులు ఆశలతో చేయించకూడదని,  టీబి స్కూటీ డబ్బాలను ఆశలతో మోపించే పని రద్దు చేయాలని, లెప్రసి సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని, వాలంటీర్లను ఏర్పాటు చేయాలి, ఆశాలకు పని భారం తగ్గించాలి, జాబ్  చార్ట్ ను విడుదల చేయాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. అదేవిదంగా 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియర్ బిల్లు వెంటనే చెల్లించాలి, కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ ఏలవన్స్ వెయ్యి చొప్పున 16 నెలలు బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని,  అట్లాగే 32 రకాల రిజిస్టర్లను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలని, ఆశలకు ప్రసూతి సెలవుల సర్కులర్ ను వెంటనే జారీ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, కాలం సుజాత ,ఎస్కే సైదా బేగం, విజయమ్మ, కలమ్మ, తబిత, మంజుల, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA DIST SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP

సరంపేట: ముత్యాలమ్మ దేవస్థాన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం సరంపేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవస్థాన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి మండపం వద్ద బుధవారం సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వెన్నెమల్ల వెంకటమ్మ మధుకర్ సహకారంతో ఏర్పాట్లు చేసినారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సభ్యుల ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ జెల్లకుల సైదులు, మరియు బిఆర్ఎస్ నాయకులు వెన్నెమల్ల నరసింహ లను శాలువాతో సత్కరించి సన్మానించారు. తదుపరి లడ్డు వేలం పాటకు మరియు గణేష్ నిమజ్జనం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP