మర్రిగూడెం మండలంలో కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె
NLG: అంగన్వాడి ఉద్యోగుల సమ్మె 17వ రోజు సందర్భంగా, మర్రిగూడ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క గిరి మహారాజ్ మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీ లు చేస్తున్న సమ్మె న్యాయమైనదని వారు అన్నారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, అట్లాగే బిఎల్ఓ డ్యూటీలను కూడా రద్దు చేయాలని వాళ్ళు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయంలు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఉప్పునూతల వెంకటయ్య, ఊరుపక్క సాయికుమార్, ధర్మసమాజ్ పార్టీ మండల నాయకులు నక్క గిరి, నక్క లక్ష్మణ్, అంగన్వాడి ఉద్యోగుల యూనియన్ మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శోభ,రజిత, శోభారాణి సువర్ణ, జయశ్రీ, శారద, ఉమాదేవి, సరళ, మంగమ్మ, లక్ష్మి, సుగుణ, విఘ్నేశ్వరి, అనంతలక్ష్మి, షబానీ, భాగ్య, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS NALGONDA DIST
STREETBUZZ NEWS APP
SB NEWS TELANGANA
Sep 27 2023, 20:02