'అంగన్వాడి ఉద్యోగులను పెర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం ఆగదు': నాంపల్లి చంద్రమౌళి
NLG: మర్రిగూడ మండలంలో అంగన్వాడీ ఉద్యోగులు 16వ రోజు సమ్మెలో భాగంగా మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రజానాట్యమండలి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు పది లక్షలు, హెల్పర్ కు 5 లక్షల చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని, 2017 నుండి టీఏ డీఏ ఇంక్రిమెంట్ ఇన్చార్జి అలవెన్సులు బకాయిలు మొత్తం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులను పెర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం ఆగదని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శోభ, కే రజిత,జయశ్రీ, శారద, లక్ష్మి, సులోచన, అరుణ, అనంతలక్ష్మి, పద్మ, నిర్మల, సుగుణ యాదమ్మ,విమలాదేవి, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS NALGONDA
SB NEWS TELANGANA
Sep 27 2023, 17:10