NLG: నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి, టీ ఏస్ పి ఏస్ సి బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో పాల్గొని మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుద్యోగుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నిరుద్యోగులు బలైతూనే ఉన్నారని, గ్రూప్-1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు నిర్వహించారు. ఎలాంటి పారదర్శకత లేకుండా, అక్రమాల పుట్టగా ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా మళ్ళీ పరీక్షల నిర్వహించాలనుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఆయన అన్నారు. నిరుద్యోగుల పక్షాన తీవ్ర మొండి వైఖరి వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యావత్ నిరుద్యోగ లోకమంతా రానున్న ఎలక్షన్లలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి దగ్గర పడ్డాయని, ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని, టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ ను మరియు అలాగే సభ్యులను తొలగించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఒక లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, నూతన బోర్డును నియమించి జరగబోయే పరీక్షలను పారదర్శకతతో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. సిహెచ్ మౌనిక, సిహెచ్ కిరణ్మయి మాట్లాడుతూ.. కుటుంబాలను వదిలేసి వచ్చి సంవత్సరాలుగా లైబ్రరీలలో చదువుకుంటూ హాస్టల్ ఫీజులు కట్టి, ఒక పూట తిండి తిని తినక, మా కుటుంబాలు రోడ్లమీద పడే పరిస్థితి వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనట్లేదని, మా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రేణుక, మౌనిక, కోట క్రాంతి, వినోద్ చారీ, క్రాంతి కుమార్, కిరణ్, సైదులు, విక్రమ్, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. SB NEWS
SB NEWS NALGONDA
SB NEWS TELANGANA
Sep 27 2023, 13:09