NLG: ప్రారంభమైన ఆశాల నిరవధిక సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశా వర్కర్ ల నిరవధిక సమ్మె సోమవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు నిర్ణయించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్స్ ను పరిష్కరించాలని కోరుతూ.. రాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహించాము, గతంలో 106 రోజులు సమ్మె చేశారు. కలెక్టరేట్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ల ముందు అనేకసార్లు ధర్నాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు కూడా నిర్వహించారు. ఇంకా అనేక రూపాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.
ఇటీవల సెప్టెంబర్ 11న కోఠి, హైదరాబాద్ హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశాలతో ధర్నా నిర్వహించి, అదే రోజు హెల్త్ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
అనేక సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో నేటికీ ఫిక్స్డ్ వేతనం నిర్ణయం జరగకపోవడంతో.. ఆశా వర్కర్ లు తీవ్రమైన ఆందోళన గురి అవుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్ప మార్గం లేదని సెప్టెంబర్ 25 నుండి రాష్ట్రంలో అన్ని పిహెచ్సి సెంటర్లో ఆశా వర్కర్లు సమ్మెకు దిగారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో గత 32 సంవత్సరాలు మైదాన ప్రాంతంలో 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లకు రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏర్పుల యాదయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, భీమనపల్లి అరుణ, పందుల పద్మ, కాలం సుజాత బుసిరెడ్డి, ధనమ్మ, మెండు విజయమ్మ,కొయ్య మంజులమ్మ, ఎస్కే సైదా బేగం, ఆయిల్ల కలమ్మ, కే.సునీత, పల్లె కౌసల్య, ఐతరాజు సునీత, లపంగి తబిత, లపంగి దుర్గమ్మ, పొగాకు అలివేలుమంగ, బోయపల్లి యాదమ్మ, దేశగోని మంజుల, రోజా, తదితరులు సమ్మెలో పాల్గొన్నారు
SB NEWS NALGONDA
SB NEWS TELANGANA
Sep 26 2023, 19:27