/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: ఎస్సీ ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా బక్కి వెంకటయ్య నియామకం Mane Praveen
TS: ఎస్సీ ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా బక్కి వెంకటయ్య నియామకం

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్ ను, సభ్యులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల, మెదక్ )ను, ముఖ్యమంత్రి నియమించారు.

సభ్యులుగా  కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్)

రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ)

కొంకటి లక్ష్మీనారాయణ (ఎస్సీ మాదిగ, కరీంనగర్)

జిల్లా శంకర్ (ఎస్సీ మాదిగ, నల్లగొండ జిల్లా), 

రేణికుంట ప్రవీణ్ (ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్) లను సీఎం నియమించారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నది.
SB NEWS

SB NEWS TELANGANA
మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి: పల్లా దేవేందర్ రెడ్డి

నల్లగొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల యొక్క, నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

గురువారం AITUC ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల దాటిపోయినా.. నేటికీ వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాలేజీ ప్రిన్సిపాల్ ను ఎన్నిసార్లు కలిసిన ప్రయోజనం లేదని అన్నారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని అన్నారు. జీతాలు రాక ఇంటి కిరాయి, ఆటో కిరాయిలు భరించలేకపోతున్నారని అన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు.

ప్రిన్సిపాల్, కాంట్రాక్టర్ ఇద్దరి మధ్య లో కార్మికులు నలిగిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా కోశాధికారి పానెం వెంకట్రావ్, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎండీ జకీర్, అండాలు, చెంద్రమ్మ, స్వర్ణ, జానయ్య, విజయ, రేణుక, కవిత చంద్రమ్మ, కోటేశ్వరి ,సీత, లక్ష్మి, శిల్ప, జమీర్, శ్రీను, కోటేశ్వరి, శిల్ప , కృష్ణవేణి, కరుణ, ఇద్దమ్మ, మంగమ్మ, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA
నల్గొండ లో మండల ప్రవాస్ యోజన వర్క్ షాప్
NLG: ఈరోజు నల్గొండ జిల్లా బిజేపి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి  ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజేపి జిల్లా ఇంచార్జ్ రవికాంతి ప్రదీప్ కుమార్ పాల్గొని భవిష్యత్ కార్యచరణ గురించి దిశ నిర్దేశం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ కుమార్, ఉమ్మడి నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ నరసింహారెడ్డి, పార్లమెంట్ ఫుల్ టైమర్ స్వామీ కుమార్, రాష్ట్ర,జిల్లా నాయకులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS NALGONDA

STREETBUZZ NEWS
NLG: ' మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈనెల 25న చండూర్ లో రౌండ్ టేబుల్ సమావేశం'

మర్రిగూడ: మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈనెల 25న చండూర్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ను, గురువారం మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మర్రిగూడ నాయకులు నాగిళ్ళ మారయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా అమరవీరుల ఆశయ సాధన సమితి అధ్యక్షులు కోరే సాయిరామ్, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మునుగోడు నియోజకవర్గ చైర్మన్ మల్గ యాదయ్య, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఇంచార్జ్ ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు జిల్లా వెంకటేష్ మాదిగ, బీసీ నాయకులు అంబాల రవి గౌడ్,  శ్రీనివాస్ చారి, వెంకటాచారి, రాచకొండ బుద్ధ ట్రస్ట్  వ్యవస్థాపకులు గిరి నరసింహ, మరియు సందీప్ యాదవ్, పాండు గౌడ్, అభి సందేశ్ తదితరులు పాల్గొని పోస్టర్ ను ఆవిష్కరించారు.

వారు మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు, మహిళ సంఘాలు, మేధావులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

SB NEWS MARRIGUDA MANDAL

SB NEWS NALGONDA DIST STREETBUZZ NEWS
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వెన్ రెడ్డి రాజు

చౌటుప్పల్: ఈరోజు ఆచార కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా, పట్టణ కేంద్రంలోని చిన్నకొండూరు రోడ్డు చౌరస్తాలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్రోద్యమం, క్విట్ ఇండియా, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, నాయకులు బడుగు లక్మయ్య, కందగట్ల బిక్షపతి, చిక్క నరసింహ, బడుగు మాణిక్యం, పెద్ది జగదీష్, గోషిక నరసింహ, దోర్నాల గజేందర్, సురేపల్లి శివ మరియు పద్మశాలి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS YADADRI DIST 

చండూరు: అంగన్వాడీల సమ్మెకు సిపిఎం మద్దతు: బండ శ్రీశైలం

NLG: అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం తెలిపారు.

      

గురువారం చండూరు తహసిల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్న 11వ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా బతుకమ్మలాడుతూ నిరసన తెలిపారు.

సమ్మె శిబిరానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం హాజరై మద్దతు ప్రకటించి మాట్లాడుతూ..  రాష్ట్రంలో 70 వేల మంది గత 48 సంవత్సరాలుగా పేద మహిళలకు, రక్తహీనత పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయుటకు ఎంతగానో కృషి చేస్తున్న అంగన్వాడి టీచర్లకు, ఆయా లకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇందులో 90 శాతం మంది దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలని వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని, ఆలోపు వారికి గౌరవ వేతనాలు కాకుండా కనీస వేతనం టీచర్ కు రూ. 26000/- ఆయా కు రూ.18000/- వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రజా ప్రతినిధులు అధికారులు బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటు అని అన్నారు నల్లగొండ జిల్లా 'నాటి నైజాం సర్కార్ను తరిమికొట్టిన పోరు గడ్డ' అని, వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని అందుకున్న అంగన్వాడీ మహిళలని ఎమ్మెల్యేలు బెదిరిస్తే భయపడేది లేదని వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ప్రభుత్వం వెంటనే పోరాడుతున్న అంగన్వాడీ సంఘాల జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని, లేనిపక్షంలో అంగన్వాడీలు చేసే పోరాటాల్లో సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొంటూ వారికి అండదండలుగా ఉంటూ పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

   

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు దోటి వెంకన్న, సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొడ్డు వెంకన్న, బరిగెల రమణమ్మ, నాగమణి, కేదారి జగదీశ్వరి, తారక, పి.జ్యోతి, కే.రాజేశ్వరి, బి.శోభ, కే.శారద, జంగమ్మ, పెద్దమ్మ, ఉష, వనజాత, పద్మ, సునీత, పి.సునీత, విజయనిర్మల, భాగ్యలక్ష్మి, వెంకటమ్మ, పార్వతమ్మ, విజయలక్ష్మి,  బి ప్రమీల, జ్యోతి, సుజన, ఆయాలు అండాలు, సుగుణమ్మ, అనూష, కృష్ణవేణి, సోనీ, సాయమ్మ, వెంకటమ్మ, రాణి, నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

బొలేరో వ్యాన్ ను ఢీ కొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

పశ్చిమగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో రోడ్ ప్రమాదం

యర్నగూడెం గండి చెరువు వద్ద నల్లజర్ల వెళ్తున్న బొలెరో వాహనాన్ని, హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్తున్న సుమన్వి ప్రైవేట్ ట్రావెల్ బస్ ఎదురుగా ఢీ కొనటంతో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒకరి పరిస్తితి విషమంగా ఉంది.

26 మంది ప్యాసింజర్లతో హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు, యర్నగూడెం గండి చెరువు వద్ద ఎదురుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టడంతో.. బోలేరా లో వున్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒకరి పరిస్తితి విషమంగా ఉంది.

అదే సమయంలో అటుగా బైక్ పై వెళ్తున్న ఇద్దరికి వాహనాలు తగలటంతో తీవ్రగాయాలు అయ్యాయి. బస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

క్షతగాత్రులను 108 నందు వైద్యచికిత్స నిమిత్తం గోపాలపురం వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

SB NEWS

SB NEWS, A.P

మీ ఫోనుకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వస్తుందా?.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్  మెసేజ్ లు... వైబ్రేషన్ మరియు వినూత్న సౌండ్ తో వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో తెలియక అందరూ గందరగోళానికి గురవుతున్నారు. కానీ అందులో భయపడాల్సింది ఏమీ లేదు. ప్రణాళికాబద్ధమైన ట్రయల్ ప్రాసెస్‌లో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహకారంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం ద్వారా ఈ సందేశం పంపబడుతోంది.

అయితే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుంది.

ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు సమాచారం.
లెంకలపల్లి: గాంధీ సెంటర్లో ఘనంగా గణేష్ పూజలు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా..  బుధవారం వారం గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నవరాత్రి గణేష్ పూజలలో భాగంగా 3వ రోజు, గ్రామానికి చెందిన దంపతులు చాపల మల్లయ్య- పద్మ మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. విగ్రహ దాత పగిళ్ల తిరుపతయ్య, లడ్డు దాత వావిళ్ళ అంజి యాదవ్. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. SB NEWS

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
NLG: కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడి ఉద్యోగులు

నల్లగొండ: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (సిఐటియు ఏఐటియూసి)ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు వేలాదిమంది అంగన్వాడి ఉద్యోగులు ముట్టడి చేయగా ఆఫీస్ స్తంభించిపోయింది. ప్రధాన గేటుకు తాళాలు వేసి అంగన్వాడీ ఉద్యోగులు నాలుగు గంటలపాటు బైటాయించడంతో కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఆఫీసుకు రాకుండా పోయినారు. అంతకుముందు డైట్ కాలేజీ నుండి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యము లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి, కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్న ఆడపడుచుల కోరికలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉన్నదని వారన్నారు.

శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కార్మిక సంఘాలతో మొదట చర్చలు జరిపి వాగ్దానం చేసినవి అమలు పరచకుండా మాట మార్చడం సరైనది కాదని అన్నారు. పర్మినెంట్ , కనీస వేతనాలు, గ్రాడ్యుటి ,రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, వారసులకు ఉద్యోగాలు, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చుతూ అధికారికంగా సర్కులర్ , జీవోలు ఇచ్చి అంగన్వాడీల సమ్మె విరమింపజేయాలని వారు డిమాండ్ చేశారు

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి లు మాట్లాడుతూ.. 45 సంవత్సరాల పైగా అంగన్వాడీ ఉద్యోగులు ఐసిడిఎస్ సంస్థలో పనిచేస్తున్న ఎలాంటి చట్టబద్ధ హక్కులు కల్పించడం లేదని వారన్నారు. అంగన్వాడీల పనితో పాటు గర్భిణీ బాలింతలు చిన్నపిల్లలు ఇతర ప్రజలకు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పట్టించుకోవడంలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ.. నీటి మూటగానే మిగిలిపోయిందని అన్నారు.

రాష్ట్రంలో పోరాడుతున్న సంఘాలతో చర్చలు జరపకుండా భజన సంఘాలతో చర్చలు జరిపి ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి సమ్మెను విచ్చిన్నం చేయాలనే ప్రభుత్వ కుట్రను తిప్పి కొడుతారని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి టీచర్స్, ఆయాలను భయభ్రాంతులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఇతర ఉద్యోగులతో నడుపాలని చూస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు.

అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి పర్మినెంట్ చేసి హెల్త్ కార్డులు ఇచ్చారని వారన్నారు. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు గ్రాడ్యుటి పెన్షన్

బోనస్, వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వారన్నారు. ఒకవైపు పరివారం అనేక రెట్లు పెంచి ప్రభుత్వ పథకాలు సర్వే నువ్వు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కి మంచి పేరు తీసుకొస్తున్న అంగన్వాడీలకు కదా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు రూ.26000/- ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమ్మె డిమాండ్ల పరిష్కారం చేయకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

అంగన్వాడి ఉద్యోగ సంఘాల జేఏసీ సిఐటియు ఏఐటీయూసీ అధ్యక్షులు పొడి శెట్టి నాగమణి, వనం రాధిక లు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసురత్నం ప్రసంగించారు

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎడమ సుమతమ్మ, సిఐటియు ఏఐటియూసి జిల్లా నాయకులు దోటి వెంకన్న, చాపల శ్రీను, డి వెంకన్న,దండంపల్లి సత్తయ్య, బయన్న,సలీం, సైదయ్య ,అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ,విజయలక్ష్మి,కోట్ల శోభ ,అరుణ,సాయి విజిత, రాణి ,అన్నపూర్ణ , శాంత కుమారి, రమాదేవి,సరిత,మమత, సుజాత , శాంతాబాయి, విజితా,లక్ష్మి, పద్మ, కేదారి , నాగమణి,జగదీశ్వరి, విజయ,సుజాత,అంజలి, స్వప్న ,మహిత, జయమ్మ ,విజయ,సువార్త,మనెమ్మా, జ్యోతి ,లెనిన్, అద్దంకి నరసింహ,తదితరులు పాల్గొన్నారు