NLG: కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడి ఉద్యోగులు
నల్లగొండ: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (సిఐటియు ఏఐటియూసి)ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు వేలాదిమంది అంగన్వాడి ఉద్యోగులు ముట్టడి చేయగా ఆఫీస్ స్తంభించిపోయింది. ప్రధాన గేటుకు తాళాలు వేసి అంగన్వాడీ ఉద్యోగులు నాలుగు గంటలపాటు బైటాయించడంతో కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఆఫీసుకు రాకుండా పోయినారు. అంతకుముందు డైట్ కాలేజీ నుండి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యము లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి, కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్న ఆడపడుచుల కోరికలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉన్నదని వారన్నారు.
శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కార్మిక సంఘాలతో మొదట చర్చలు జరిపి వాగ్దానం చేసినవి అమలు పరచకుండా మాట మార్చడం సరైనది కాదని అన్నారు. పర్మినెంట్ , కనీస వేతనాలు, గ్రాడ్యుటి ,రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, వారసులకు ఉద్యోగాలు, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చుతూ అధికారికంగా సర్కులర్ , జీవోలు ఇచ్చి అంగన్వాడీల సమ్మె విరమింపజేయాలని వారు డిమాండ్ చేశారు
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి లు మాట్లాడుతూ.. 45 సంవత్సరాల పైగా అంగన్వాడీ ఉద్యోగులు ఐసిడిఎస్ సంస్థలో పనిచేస్తున్న ఎలాంటి చట్టబద్ధ హక్కులు కల్పించడం లేదని వారన్నారు. అంగన్వాడీల పనితో పాటు గర్భిణీ బాలింతలు చిన్నపిల్లలు ఇతర ప్రజలకు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పట్టించుకోవడంలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ.. నీటి మూటగానే మిగిలిపోయిందని అన్నారు.
రాష్ట్రంలో పోరాడుతున్న సంఘాలతో చర్చలు జరపకుండా భజన సంఘాలతో చర్చలు జరిపి ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి సమ్మెను విచ్చిన్నం చేయాలనే ప్రభుత్వ కుట్రను తిప్పి కొడుతారని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి టీచర్స్, ఆయాలను భయభ్రాంతులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఇతర ఉద్యోగులతో నడుపాలని చూస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు.
అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి పర్మినెంట్ చేసి హెల్త్ కార్డులు ఇచ్చారని వారన్నారు. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు గ్రాడ్యుటి పెన్షన్
బోనస్, వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వారన్నారు. ఒకవైపు పరివారం అనేక రెట్లు పెంచి ప్రభుత్వ పథకాలు సర్వే నువ్వు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కి మంచి పేరు తీసుకొస్తున్న అంగన్వాడీలకు కదా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు రూ.26000/- ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమ్మె డిమాండ్ల పరిష్కారం చేయకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
అంగన్వాడి ఉద్యోగ సంఘాల జేఏసీ సిఐటియు ఏఐటీయూసీ అధ్యక్షులు పొడి శెట్టి నాగమణి, వనం రాధిక లు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసురత్నం ప్రసంగించారు
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎడమ సుమతమ్మ, సిఐటియు ఏఐటియూసి జిల్లా నాయకులు దోటి వెంకన్న, చాపల శ్రీను, డి వెంకన్న,దండంపల్లి సత్తయ్య, బయన్న,సలీం, సైదయ్య ,అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ,విజయలక్ష్మి,కోట్ల శోభ ,అరుణ,సాయి విజిత, రాణి ,అన్నపూర్ణ , శాంత కుమారి, రమాదేవి,సరిత,మమత, సుజాత , శాంతాబాయి, విజితా,లక్ష్మి, పద్మ, కేదారి , నాగమణి,జగదీశ్వరి, విజయ,సుజాత,అంజలి, స్వప్న ,మహిత, జయమ్మ ,విజయ,సువార్త,మనెమ్మా, జ్యోతి ,లెనిన్, అద్దంకి నరసింహ,తదితరులు పాల్గొన్నారు
Sep 21 2023, 11:03