/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మర్రిగూడెం: తహసిల్దార్ కు సమ్మె నోటీసు ఇచ్చిన ఆశ వర్కర్లు Mane Praveen
మర్రిగూడెం: తహసిల్దార్ కు సమ్మె నోటీసు ఇచ్చిన ఆశ వర్కర్లు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మహేందర్ రెడ్డి కి బుధవారం ఆశ వర్కర్లు చేపట్టబోయే సమ్మె నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్ కి ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా తదితర డిమాండ్ల కోసం సమ్మెకు పోవడానికి సిద్ధమయ్యారని తెలిపారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు సబ్ సెంటర్ నాయకురాలు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత ,ఏర్పుల పద్మ, సుజాత, సైదా బేగం, లపంగి దుర్గమ్మ, కలమ్మ, రోజా, విజయ తదితరులు పాల్గొన్నారు

SB NEWS

SB NEWS NALGONDA DIST

మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సెపరేట్ కోటా ఉండాలి: మాయావతి

న్యూ ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఎస్పీ అభినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లలోనూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు వేర్వేరుగా కోటా ఉండేలా చూసుకోవాలని మంగళవారం సూచించారు. అలాగైతేనే, ఈ రిజర్వేషన్ లక్ష్యం నేరవేరుతుందని అన్నారు. బీఎస్పీ సహా చాలా పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సానుకూలంగా ఓటేస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత గతంలో మాదిరిగా పెండింగ్‌ కాకుండా ఈ సారి ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాను. మహిళలకు ప్రతిపాదిత 33 శాతం రిజర్వేషన్లు కాదు.. 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. మహిళల జనాభాను దృష్టిలో పెట్టుకుని వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలోనూ బీఎస్పీ పార్టీ తరపున పార్లమెంటులో ఆమె మాట్లాడినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఆలోచిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సెపరేట్ కోటా ఉండాలి. అలాగైతేనే వారికి న్యాయం దక్కుతుంది అని మాయావతి అన్నారు.

SB NEWS
చండూర్: అంగన్వాడీ ఉద్యోగుల ధర్నాకు మద్దతు తెలిపిన బిఎస్పి నాయకులు

నల్గొండ జిల్లా, చండూరు: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు, అంగన్వాడీ వర్కర్స్ సమ్మెకు మద్దతు తెలుపుతూ, మంగళవారం చండూరు మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర తొమ్మిదవ రోజు ధర్నా లో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు నేరల్ల ప్రభుదాస్  ఆధ్వర్యంలో పలువురు బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మునుగోడు అసెంబ్లీ కార్యదర్శి అన్నేపాక శంకర్, అసెంబ్లీ మున్సిపల్ అధ్యక్షులు బూసిపాక మాణిక్యం, సీనియర్ నాయకులు బొట్ట శివ, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము గణేష్, మరియు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. SB NEWS NALGONDA DOWNLOAD SB NEWS APP
లెంకలపల్లి లో ఘనంగా రెండవ రోజు విఘ్నేశ్వరుడికి పూజలు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా..  మంగళవారం గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నవరాత్రి గణేష్ పూజలలో భాగంగా 2వ రోజు, గ్రామానికి చెందిన దంపతులు బిజ్జాల శ్రీధర్ - శ్రీదేవి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. విగ్రహదాత పగిళ్ల రాజశేఖర్, లడ్డు దాత వావిళ్ళ అంజి యాదవ్. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA DIST
చిన్న కొండూరు గ్రామంలో అభివృద్ధి పనుల కోసం పర్యటించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం, నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో వాడవాడల పర్యటించారు. ఈ సందర్భంగా  గ్రామంలోని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో మిగిలి ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై పర్యవేక్షణ చేపడుతున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ.. మిగిలి ఉన్న సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులను పరిశీలించి, ఆ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS, TELANGANA
అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య

నల్లగొండ జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య హాజరై అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారికి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, 26 వేల వేతనం ఇవ్వాలని, అధికారుల వేధింపులు ఆపాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చేయని పక్షంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం చింతపల్లి మండల నాయకులు ఊడిగుండ్ల రాములు, అంగన్వాడి ఉద్యోగుల సంఘం సిఐటియు నాయకురాలు కే. రజిత ఆర్. శోభ, శారద, అనంతలక్ష్మి, సువర్ణ, కలమ్మ, జయ శ్రీ, విమలాదేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు

SB NEWS, NALGONDA DIST

NKL: జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి: గద్దపాటి రమేష్

NLG, నకిరేకల్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బిఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రమేష్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల హామీ ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రజాప్రతినిధుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. లేనట్లయితే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. SB NEWS NALGONDA DIST

PLEASE DOWNLOAD STREETBUZZ APP
డోర్నకల్ లో దొరల ఆధిపత్య పార్టీలను అంతం చేస్తాం: జిల్లా బీఎస్పీ మహిళా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్

మహబూబాబాద్ : డోర్నకల్ నియోజకవర్గం లో దొరల ఆధిపత్య పార్టీలను అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం తెస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ పరిధిలోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో బిఎస్పీ మొదటి పది హామీల గోడ పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో తరతరాలుగా దొరలు, వారి బినామీ పాలకులే పరిపాలనలో ఉంటున్నారని.. అధికారంలో పార్టీలు మారుతున్నాయే తప్ప దొరలు, దొరల బినామీ పాలకులు మారడం లేదని.. వారి ఆధిపత్యంలో బహుజనులు ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా తీవ్ర వివక్షకు గురయ్యారని ఇక గడీ ల పాలనను,  బిఎస్పీ ఆధ్వర్యంలో భూస్థాపితం చేస్తామని అన్నారు. బిఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో  తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం తెచ్చి, అధికారంలో బహుజనులందరికి వాటా కల్పిస్తామని బహుజనులందరు బిఎస్పీ తో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ లు తేజావత్ అభి నాయక్, ఎల్ విజయ్ కాంత్, జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐతం ఉపేందర్, జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను, బిఎస్పీ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి ఏడెల్లి అఖిల్, డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు భాషిపంగు మహేందర్,మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు జినక కృష్ణమూర్తి, గుగులోత్ బాసునాయక్, నాయకులు కోర్ని సురేష్, జినక వీరయ్య తదితరులు పాల్గొన్నారు. SB NEWS, TELANGANA

PLEASE DOWNLOAD STREETBUZZ APP & FOLLOW MANE PRAVEEN
NLG: మార్నింగ్ వాక్ కు వెళ్లిన యువ దంపతులు తిరిగిరాని లోకాలకు...
నల్లగొండ: పట్టణంలోని పానగల్ సమీపాన మంగళవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని యువ దంపతులు మృతి చెందారు. వివరాలు.. పానగల్ కు చెందిన దంపతులు ఓర్సు విష్ణు (30), స్వప్న (27) ఇద్దరూ రోజువారి కార్యక్రమంలో భాగంగా పానగల్ ఉదయ సముద్రం సమీపంలోని హైవే పై 'మార్నింగ్ వాక్' వెళ్లారు.

పానగల్ ఉదయ సముద్రం కట్ట మధ్య భాగంలో  ఇద్దరు దంపతులను నకిరేకల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టగా దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన దంపతులకు ఇద్దరూ చిన్న పిల్లలు ఉన్నారు. మృతి చెందిన దంపతులలో ఓర్సు విష్ణు స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పలువురు  అధ్యాపకులు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సంతాపం తెలియజేస్తున్నారు. ఘటనతో పానగల్ విషాదంలో మునిగిపోయింది.

SB NEWS, NALGONDA DIST

PLS DOWNLOAD STREETBUZZ APP
లెంకలపల్లి: మండపంలో కొలువుదీరిన గణనాథుడు

మర్రిగూడ మండలం, లెంకలపల్లి: ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా, గణేష్ నవరాత్రి ఉత్సవాల లో భాగంగా.. గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ, గాంధీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడు, గాంధీ సెంటర్ మండపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ వారు ప్రథమ పూజ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SB NEWS, NALGONDA DIST

PLEASE DOWNLOAD STREETBUZZ APP FOR INSTANT NEWS