/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz డోర్నకల్ లో దొరల ఆధిపత్య పార్టీలను అంతం చేస్తాం: జిల్లా బీఎస్పీ మహిళా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ Mane Praveen
డోర్నకల్ లో దొరల ఆధిపత్య పార్టీలను అంతం చేస్తాం: జిల్లా బీఎస్పీ మహిళా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్

మహబూబాబాద్ : డోర్నకల్ నియోజకవర్గం లో దొరల ఆధిపత్య పార్టీలను అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం తెస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ పరిధిలోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో బిఎస్పీ మొదటి పది హామీల గోడ పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో తరతరాలుగా దొరలు, వారి బినామీ పాలకులే పరిపాలనలో ఉంటున్నారని.. అధికారంలో పార్టీలు మారుతున్నాయే తప్ప దొరలు, దొరల బినామీ పాలకులు మారడం లేదని.. వారి ఆధిపత్యంలో బహుజనులు ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా తీవ్ర వివక్షకు గురయ్యారని ఇక గడీ ల పాలనను,  బిఎస్పీ ఆధ్వర్యంలో భూస్థాపితం చేస్తామని అన్నారు. బిఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో  తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం తెచ్చి, అధికారంలో బహుజనులందరికి వాటా కల్పిస్తామని బహుజనులందరు బిఎస్పీ తో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ లు తేజావత్ అభి నాయక్, ఎల్ విజయ్ కాంత్, జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐతం ఉపేందర్, జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను, బిఎస్పీ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి ఏడెల్లి అఖిల్, డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు భాషిపంగు మహేందర్,మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు జినక కృష్ణమూర్తి, గుగులోత్ బాసునాయక్, నాయకులు కోర్ని సురేష్, జినక వీరయ్య తదితరులు పాల్గొన్నారు. SB NEWS, TELANGANA

PLEASE DOWNLOAD STREETBUZZ APP & FOLLOW MANE PRAVEEN
NLG: మార్నింగ్ వాక్ కు వెళ్లిన యువ దంపతులు తిరిగిరాని లోకాలకు...
నల్లగొండ: పట్టణంలోని పానగల్ సమీపాన మంగళవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని యువ దంపతులు మృతి చెందారు. వివరాలు.. పానగల్ కు చెందిన దంపతులు ఓర్సు విష్ణు (30), స్వప్న (27) ఇద్దరూ రోజువారి కార్యక్రమంలో భాగంగా పానగల్ ఉదయ సముద్రం సమీపంలోని హైవే పై 'మార్నింగ్ వాక్' వెళ్లారు.

పానగల్ ఉదయ సముద్రం కట్ట మధ్య భాగంలో  ఇద్దరు దంపతులను నకిరేకల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టగా దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన దంపతులకు ఇద్దరూ చిన్న పిల్లలు ఉన్నారు. మృతి చెందిన దంపతులలో ఓర్సు విష్ణు స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పలువురు  అధ్యాపకులు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సంతాపం తెలియజేస్తున్నారు. ఘటనతో పానగల్ విషాదంలో మునిగిపోయింది.

SB NEWS, NALGONDA DIST

PLS DOWNLOAD STREETBUZZ APP
లెంకలపల్లి: మండపంలో కొలువుదీరిన గణనాథుడు

మర్రిగూడ మండలం, లెంకలపల్లి: ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా, గణేష్ నవరాత్రి ఉత్సవాల లో భాగంగా.. గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ, గాంధీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడు, గాంధీ సెంటర్ మండపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ వారు ప్రథమ పూజ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SB NEWS, NALGONDA DIST

PLEASE DOWNLOAD STREETBUZZ APP FOR INSTANT NEWS
చండూరు: ఒంటి కాలు పై నిలబడి నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు
నల్లగొండ జిల్లా, చండూరు: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రీపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 8వ రోజు చేరుకున్న సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు ఒంటి కాలు పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. వీరిచే ఇతర పనులు కూడా చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.


రికార్డుల నిర్వహణ పేరిట అధికారులు వేధింపులు గురి చేస్తున్నారని, కొత్త యాప్ లు తీసుకొచ్చి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. అదనపు పనులను రద్దు చేయాలని, అంగన్వాడీల పై ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని నివారించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న టిఎ, డిఎ ఇతర అలవెన్స్ ను వెంటనే విడుదల చేయాలన్నారు.


అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీ సిబ్బంది చేసే సమ్మెకు పూర్తిగా మద్దతుగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో సత్తమ్మ, తారకమ్మ, నాగమణి, రమణ, విజయలక్ష్మి, కేదారి, జగదీశ్వరి, సునీత, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడెం మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: నాగిళ్ల మారయ్య
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మాల మహానాడు మర్రిగూడెం మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిల్ల మారయ్య మర్రిగూడెం మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు, మరియు గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగిళ్ల మారయ్య మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జరిపే వేడుకల సమయంలో యువకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పండుగను ఆనందంతో జరుపుకోవాలని కోరారు.

ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని, తలచిన కార్యాలు విజయవంతంగా నెరవేరాలని, ఆ ప్రధమ పూజ్యుడు ప్రజలందరికీ మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రైతులు పండించిన పంటలు సమృద్ధిగా పండాలని, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలని, ఉద్యోగులకు ప్రమోషన్లు రావాలని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని, శ్రమజీవులకు తగిన ప్రతిఫలం దక్కాలని, విద్యారంగంలో, వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

SB NEWS, NALGONDA DIST

PLEASE DOWNLOAD APP FROM GOOGLE PLAY



లెంకలపల్లి గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సర్పంచ్ పాక నగేష్ యాదవ్

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి: వినాయక చవితి మరియు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందర్భంగా.. లెంకలపల్లి గ్రామ ప్రజలకు, గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

  


అదేవిధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాలలో విజయాలు సిద్ధించాలని, వినాయక చవితి పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

SB NEWS, NALGONDA DIST

జాతీయ జెండా మరియు బీఎస్పీ జెండా ఆవిష్కరించిన మేడి ప్రియదర్శిని
NLG: బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ పునర్ విముక్తి ప్రతిజ్ఞ దివస్ జరిపారు. నకిరేకల్ బీఎస్పీ పార్టీ కార్యాలయంలో, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని జాతీయ జెండాను మరియు బహుజన్ సమాజ్ పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ నియంత్రృత్వ పాలన నుండి విముక్తి చేయడానికి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని తెలిపారు. ఇదే రోజు మహనీయుడు పెరియార్ రామస్వామి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి మేడి ప్రియదర్శిని పూలమాలలు సమర్పించి మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగులు కలలుగన్న ఆశలు.. నిరాశలు గానే మిగిలినాయి... అని అన్నారు. తెలంగాణలో ప్రజలందరూ బంగారు తెలంగాణ వస్తదని అనుకుంటే బాధలతో కూడిన తెలంగాణ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ తెలంగాణను ఈ దొరల నుండి విముక్తి చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ పునర్విముక్తి ప్రతిజ్ఞ దివస్ గా జరుపుకొని ప్రతిజ్ఞ చేసి తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపన కోసం పాటుపడాలని ఆదేశించినారని తెలిపారు. తెలంగాణలో 99 శాతం ఉన్న బహుజన జాతులన్నీ ఏకమై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసుకొని,  బాధల తెలంగాణ నుండి బహుజన తెలంగాణను స్థాపించడం కోసం ప్రజలందరూ కలిసి రావాలని,  మార్పు దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కట్టంగూర్ మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండా మరియు బీఎస్పీ జెండా ఆవిష్కరించిన మేడి ప్రియదర్శిని
NLG: బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ పునర్ విముక్తి ప్రతిజ్ఞ దివస్ జరిపారు. నకిరేకల్ బీఎస్పీ పార్టీ కార్యాలయంలో, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని జాతీయ జెండాను మరియు బహుజన్ సమాజ్ పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ నియంత్రృత్వ పాలన నుండి విముక్తి చేయడానికి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని తెలిపారు. ఇదే రోజు మహనీయుడు పెరియార్ రామస్వామి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి మేడి ప్రియదర్శిని పూలమాలలు సమర్పించి మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగులు కలలుగన్న ఆశలు.. నిరాశలు గానే మిగిలినాయి... అని అన్నారు. తెలంగాణలో ప్రజలందరూ బంగారు తెలంగాణ వస్తదని అనుకుంటే బాధలతో కూడిన తెలంగాణ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ తెలంగాణను ఈ దొరల నుండి విముక్తి చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ పునర్విముక్తి ప్రతిజ్ఞ దివస్ గా జరుపుకొని ప్రతిజ్ఞ చేసి తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపన కోసం పాటుపడాలని ఆదేశించినారని తెలిపారు. తెలంగాణలో 99 శాతం ఉన్న బహుజన జాతులన్నీ ఏకమై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసుకొని,  బాధల తెలంగాణ నుండి బహుజన తెలంగాణను స్థాపించడం కోసం ప్రజలందరూ కలిసి రావాలని,  మార్పు దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కట్టంగూర్ మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర బిజేపి కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి
నల్లగొండ: పట్టణం పాతబస్తీలోని ఒంటి స్తంభం శివాలయం వద్ద ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో బిజేపి  తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి పాల్గొని, జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 15, 1947 నాడు దేశం స్వాతంత్రం పొందినప్పటికీ నిజాం రాక్షస పాలనలో మగ్గిపోతున్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు స్వాతంత్ర్యం అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్యతో సెప్టెంబర్ 17న స్వాతంత్రం లభించిందన్నారు. ఆ సమయంలో ఎంతో మంది ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బాలలు, యువకులు చరిత్ర తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ నుంచి విడిపోయి కొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కలిసాయి. అక్కడ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జాతీయ జెండాను ఎగర వేస్తూ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీ లలో విజేతలుగా నిలిచిన వారికి కన్మంతరెడ్డి శ్రీదేవి బహుమతి ప్రదానం చేసారు.
తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోంది అంటున్న వెన్ రెడ్డి రాజు
యాదాద్రి జిల్లా, చౌటుప్పల్: పట్టణ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు అని ఆయన అన్నారు. తెలంగాణ జాతి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం పొందింది అని అన్నారు. చిన్న రాష్ట్రమైన, కొత్త రాష్ట్రమైన తెలంగాణ దేశంలోనే అభివృద్ధి లో ముందుందని అన్నారు. తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యతకు చిహ్నం అని అన్నారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు తెలంగాణ రాష్ట్రం పాటుపడుతుందని అన్నారు. లింగోజిగూడెం అంబేద్కర్ చౌరస్తా నుంచి స్వచ్ఛ హి సేవ కార్యక్రమం చేపట్టి ర్యాలీగా వెళ్తూ చారిత్రక కట్టడమైనటువంటి రింగుల బావి సందర్శించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  ఎస్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, MD బాబా షరీఫ్, కోరగొని లింగస్వామి, బండమీది మల్లేష్, ఆలె నాగరాజు, కొయ్యడ సైదులు, శ్రీధర బాబు,సుల్తాన్, గోపగొని లక్ష్మణ్, ఉబ్బు వెంకటయ్య, బొడిగే బాలకృష్ణ, బత్తుల స్వామి, కామిషెట్టి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.