తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోంది అంటున్న వెన్ రెడ్డి రాజు
యాదాద్రి జిల్లా, చౌటుప్పల్: పట్టణ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు అని ఆయన అన్నారు. తెలంగాణ జాతి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం పొందింది అని అన్నారు.
చిన్న రాష్ట్రమైన, కొత్త రాష్ట్రమైన తెలంగాణ దేశంలోనే అభివృద్ధి లో ముందుందని అన్నారు. తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యతకు చిహ్నం అని అన్నారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు తెలంగాణ రాష్ట్రం పాటుపడుతుందని అన్నారు.
లింగోజిగూడెం అంబేద్కర్ చౌరస్తా నుంచి స్వచ్ఛ హి సేవ కార్యక్రమం చేపట్టి ర్యాలీగా వెళ్తూ చారిత్రక కట్టడమైనటువంటి రింగుల బావి సందర్శించి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, MD బాబా షరీఫ్, కోరగొని లింగస్వామి, బండమీది మల్లేష్, ఆలె నాగరాజు, కొయ్యడ సైదులు, శ్రీధర బాబు,సుల్తాన్, గోపగొని లక్ష్మణ్, ఉబ్బు వెంకటయ్య, బొడిగే బాలకృష్ణ, బత్తుల స్వామి, కామిషెట్టి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Sep 18 2023, 13:22