/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి Mane Praveen
NLG: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం, ఆశాల న్యాయమైన డిమాండ్ల కోసం మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ దీపక్ ను కలిసి  సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా ల పారితోషకాలను  రూ.18, 000/- లకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని అన్నారు. పారితోషకం లేని అదనపు పనులు ఆశలతో  చేయించకూడదని, టిబి, లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని, లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని అన్నారు. వాలంటరీలను ఏర్పాటు చేసి, ఆశాలకు పనిభారం తగ్గించాలి. ఆశాలకు జాబ్  చార్ట్ విడుదల చేయాలి. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ రూ.1000/- చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలి. 32 రకాల రిజిస్టర్ లను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వమే సప్లై చేయాలి. క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని, ఆశలకు ప్రసూతి సెలవుల సర్కిలర్ వెంటనే జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సెప్టెంబరు 25 నుండి సమ్మెలోకి పోవడానికి సిద్ధమవుతున్నారని, ఈ లోపుగా వారి న్యాయమైన 11 డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు మర్రిగూడ మండల అధ్యక్ష కార్యదర్శులు సబ్ సెంటర్ల నాయకురాలు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, లప్పంగి తబిత, అందుగుల యాదమ్మ, కలమ్మ, బి.యాదమ్మ, రోజా, బాలమణి తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి: మాల మహానాడు మండలాధ్యక్షుడు
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేయాలని మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య  ప్రభుత్వాన్ని  కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మర్రిగూడెంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లి ఖర్చు చేసి విద్యను అభ్యసించలేక చదువు మానేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని,  ప్రైవేట్ కళాశాలలో ఎక్కువ ఫీజులు ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మర్రిగూడెం నుండి  15 - 30 కిలోమీటర్ల దూరంలో కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వారు స్పందించి, మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేస్తే మండలానికి చెందిన వందలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందించిన వారవుతారని అన్నారు. ఇకనైనా మర్రిగూడ మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మాల మహానాడు మండలాధ్యక్షుడు నాగిల్ల మారయ్య కోరారు.
మర్రిగూడ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి: మాల మహానాడు మండలాధ్యక్షుడు
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేయాలని మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య  ప్రభుత్వాన్ని  కోరుతున్నట్లు ఒక ప్రకటన తెలిపారు. మర్రిగూడెంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లి ఖర్చు చేసి విద్యను అభ్యసించలేక చదువు మానేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని,  ప్రైవేట్ కళాశాలలో ఎక్కువ ఫీజులు ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మర్రిగూడెం నుండి  15 - 30 కిలోమీటర్ల దూరంలో కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వారు స్పందించి, మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేస్తే మండలానికి చెందిన వందలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందించిన వారవుతారని అన్నారు. ఇకనైనా మర్రిగూడ మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మాల మహానాడు మండలాధ్యక్షుడు నాగిల్ల మారయ్య కోరారు.
NLG: నీటి సమస్యను తీర్చుటకు మోటర్ పంపును ప్రారంభించిన కన్మంతరెడ్డి శ్రీదేవి
నల్లగొండ: పట్టణంలోని పానగల్ 2వ వార్డు నందు మహిళలు నీటిసరఫరా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు  కన్మంతరెడ్డి శ్రీదేవి శనివారం పానగల్ రెండో వార్డును సందర్శించారు. కాలనీ మహిళలు నీటి సమస్యతో ఇబ్బంది పడటం చూడలేక, స్థానిక కాలనీవాసుల కోరిక మేరకు, ఆమె అక్కడ ఉన్న హ్యాండ్ బోరులో.. మోటారు ఏర్పాటుచేయుటకు సహాయం చేసి వారి నీటి సమస్య తీర్చారు. మోటార్ పంపును ప్రారంభించే ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి మిర్యాలయాదగిరి, వలిగొండ మధు, మహిళలు , యువకులు పాల్గొన్నారు.
TS: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్

HYD: సంక్షేమ పథకాలలో భాగంగా సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త తెలిపారు. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు "ముఖ్యమంత్రి అల్పాహార పథకం" అందించాలని సీఎం నిర్ణయించారు. తద్వారా విద్యార్థులకు చక్కని బోధన తో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది.

ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీ పనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అమలు చేయనున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.

కాగా, తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సీఎం ఇటీవలే పంపించారు. అక్కడ విజయవంతంగా అమలవుతున్న "విద్యార్థులకు అల్పాహారం" పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది.

NLG: రేపు నాంపల్లి మండలానికి రానున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రేపు శనివారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలానికి విచ్చేయుచున్నారు. నాంపల్లి మండలంలోని దేవత్ పల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే ఉదయం 09: 30 గంటలకు ముష్టిపల్లి గ్రామంలో  11 KV విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం  ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను మండలంలోని లబ్దిదారులకు అందజేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలలో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలి: కక్కిరేణి శిరీష
యాదాద్రి జిల్లా, రామన్నపేట: ఈ నెల 18 నుండి ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాలలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బహుజన్ సమాజ్ పార్టీ రామన్నపేట మండల మహిళా కన్వీనర్ కక్కిరేణి శిరీష డిమాండ్ చేశారు. శుక్రవారం రామన్నపేట బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతు.. స్దానిక సంస్థలలో మాదిరిగా చట్ట సభలలో కూడా 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని  డిమాండ్ చేశారు. అవసరం అయితే ప్రతి పక్షాల మద్దతుతో ఈ పార్లమెంట్ సమావేశాలలో బిల్లు ప్రవేశ పెట్టాలని ఆమె కోరారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు విశేష కృషి చేయాలని అన్నారు.
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే భగత్
NLG: త్రిపురారం మండలం, రాగడప గ్రామానికి చెందిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ రేవూరి దశరథ ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న విషయాన్ని తెలుసుకొన్న నాగార్జునసాగర్ శాసనసభ్యులు భగత్ కుమార్ శుక్రవారం దశరథ గృహాన్ని సందర్శించి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, సర్పంచ్ రేవూరి కొండల్, మండల నాయకులు మడుపు వెంకటేశ్వర్లు, కలకొండ వెంకటేశ్వర్లు, బొల్లం సైదులు, రేగులగడ్డ దేవస్థాన చైర్మన్ జాల పాపయ్య, త్రిపురారం పట్టణ అధ్యక్షుడు జంగిలి శ్రీనివాస్, ఎంపీటీసీ రావినాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అవిరెండ్ల సైదులు, మండల నాయకుడు మంద వెంకటేశ్వర్లు, మండల బిసి సెల్ అధ్యక్షుడు పోషబోయిన సైదయ్య, మాజీ సర్పంచ్ లు రేవూరి కోటయ్య, బాలు నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు ఆధ్వర్యంలో జిపి కార్మికుల వివిధ డిమాండ్లపై ఎంపీడీవో కు వినతి పత్రం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: మండలం లో తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్ర వారం, కార్మికుల వివిధ డిమాండ్లపై  ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను, అదేవిధంగా సమ్మె కాలంలో వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా సౌకర్యం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, వివిధ డిమాండ్లతో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. గతంలో 34 రోజులు సమ్మె చేస్తే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  జిపీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని సమ్మెను విరమించండి  అని తెలంగాణ రాష్ట్ర జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఎలాంటి డిమాండ్లను పరిష్కరించలేదని వారు అన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించనిచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె బాటలోకి వెళ్లడానికి మళ్లీ సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఒట్టిపల్లి హనుమంతు, ఊరిపక్క లింగయ్య, పోలేపల్లి రాములు నాయక్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు
ఒకేరోజు ఇద్దరు భార్యల మృతి..
TS: రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి కి చెందిన మంగళారం అంతయ్య కు ఇద్దరు భార్యలు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద భార్య లక్ష్మి (55), చిన్న భార్య చంద్రమ్మ (40) ఇద్దరూ ఒకేరోజు మృతి చెందారు. మొదట తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్న భార్య మృతి చెందింది.

ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద భార్య కూడా మరణించడం జరిగింది. దీంతో భర్త అంతయ్య తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని సమీప బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.