నేతన్నలను ఆదుకోరా?: బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని
నకిరేకల్: చేనేత కార్మకులను ప్రభుత్వం ఆదుకోవాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో పద్మశాలి కాలనీలో, గడప గడపకు ఏనుగు గుర్తు ను పరిచయం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జియో ట్యాగింగ్ వల్ల ఇంట్లో ఒక్కరికే లబ్ది చేకూరుతుంది అని అన్నారు. మరి రంగులు అద్దె వారు, చిన్న చిన్న పనులు చేసే వారు చేనేత కార్మికులు కారా? అని ప్రశ్నించారు. జియో ట్యాగింగ్ వల్ల చేనేత కుటుంబాలు నష్టపోతున్నారు అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని పత్రికల్లో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవానికి చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు తప్ప మరో పథకం అందడం లేదన్నది ముమ్మాటికీ నిజం అన్నారు. అత్యధిక ఓటర్లున్న పద్మశాలీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు అని అన్నారు. ‘చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు’ నానుడి నేటికీ నిజం. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడని నాయకుల వల్ల నేడు నేతన్నలు అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. నాయకులు ఎన్నికల సమయానికి ఓటు బ్యాంకుగా పద్మశాలీలను ఉపయోగించుకుంటున్నారు తప్ప, వారికి ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు అందించకపోవడం శోచనీయం అన్నారు.
చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం నూలు రాయితీ.. నేతన్న కు చేయూత.. తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొన్ని నెలల క్రితం వార్తల్లో వచ్చింది. కానీ వార్తల్లో వచ్చే
ప్రతి పథకం చేనేత కార్మికులకు అందుతుందని అనుకోవడం, అంతకు మించిన పొరపాటు మరొకటి లేదని ఎద్దేవా చేశారు. అసలు ఈ పథకం అమలులో ఉందో లేదో కూడా చేనేత కార్మికులకు తెలియదు అని అన్నారు. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి నేత కార్మికుడికి పెన్షన్ 2000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం కొద్ది మందికే ఇవ్వడం విచారకరం. వారికి జీఐ ట్యాగ్ లేనందున పెన్షన్ పొందలేకపోతున్నారు. ఆ ట్యాగ్ కోసం ప్రయత్నించినా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు.ఐక్యంగా పోరాడాలి: నేతన్నలకు ప్రభుత్వ పథకాలే కాక, వారు నేచిన బట్టలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అసలే ముడిసరుకు కొనుగోలు కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామాల్లోని నేత కార్మికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలో యూనిఫాం దుస్తుల కోసం చేనేత కార్మికులు నేసిన గుడ్డను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అత్యధిక ఓటర్లైన పద్మశాలీలకు.. ఎన్నికల సమయంలో నాయకులు ఏదో ఒక ఆశ చూపి ఓట్లు వేయించుకునుడు ప్రతీ ఎలక్షన్స్ సమయంలో జరిగేదే అని, నాయకులు ప్రతిసారి చేనేత కార్మికుల ఓట్ల ద్వారా గెలుపొంది, ఆ తరువాత వారికి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
అంతేకాదు పద్మశాలీలు రాజకీయంగా ఎదగకుండా, వారికి ఎలాంటి పదవి అవకాశాలు కల్పించకుండా అణిచివేతకు గురిచేస్తున్నారు. అందుకే చేనేత కార్మికులందరూ ఐక్యంగా పోరాడి తమ హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత కార్మికుడికి ఉంది. ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొని వారికి అండగా నిలవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, సీత, యశ్వంత్, జగదీష్, కృష్ణ, యోగి, మల్లేష్, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![]()

నకిరేకల్: చేనేత కార్మకులను ప్రభుత్వం ఆదుకోవాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో పద్మశాలి కాలనీలో, గడప గడపకు ఏనుగు గుర్తు ను పరిచయం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జియో ట్యాగింగ్ వల్ల ఇంట్లో ఒక్కరికే లబ్ది చేకూరుతుంది అని అన్నారు. మరి రంగులు అద్దె వారు, చిన్న చిన్న పనులు చేసే వారు చేనేత కార్మికులు కారా? అని ప్రశ్నించారు. జియో ట్యాగింగ్ వల్ల చేనేత కుటుంబాలు నష్టపోతున్నారు అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని పత్రికల్లో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవానికి చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు తప్ప మరో పథకం అందడం లేదన్నది ముమ్మాటికీ నిజం అన్నారు. అత్యధిక ఓటర్లున్న పద్మశాలీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు అని అన్నారు. ‘చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు’ నానుడి నేటికీ నిజం. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడని నాయకుల వల్ల నేడు నేతన్నలు అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. నాయకులు ఎన్నికల సమయానికి ఓటు బ్యాంకుగా పద్మశాలీలను ఉపయోగించుకుంటున్నారు తప్ప, వారికి ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు అందించకపోవడం శోచనీయం అన్నారు.
చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం నూలు రాయితీ.. నేతన్న కు చేయూత.. తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొన్ని నెలల క్రితం వార్తల్లో వచ్చింది. కానీ వార్తల్లో వచ్చే
ఐక్యంగా పోరాడాలి: నేతన్నలకు ప్రభుత్వ పథకాలే కాక, వారు నేచిన బట్టలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అసలే ముడిసరుకు కొనుగోలు కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామాల్లోని నేత కార్మికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలో యూనిఫాం దుస్తుల కోసం చేనేత కార్మికులు నేసిన గుడ్డను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అత్యధిక ఓటర్లైన పద్మశాలీలకు.. ఎన్నికల సమయంలో నాయకులు ఏదో ఒక ఆశ చూపి ఓట్లు వేయించుకునుడు ప్రతీ ఎలక్షన్స్ సమయంలో జరిగేదే అని, నాయకులు ప్రతిసారి చేనేత కార్మికుల ఓట్ల ద్వారా గెలుపొంది, ఆ తరువాత వారికి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
అంతేకాదు పద్మశాలీలు రాజకీయంగా ఎదగకుండా, వారికి ఎలాంటి పదవి అవకాశాలు కల్పించకుండా అణిచివేతకు గురిచేస్తున్నారు. అందుకే చేనేత కార్మికులందరూ ఐక్యంగా పోరాడి తమ హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత కార్మికుడికి ఉంది. ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొని వారికి అండగా నిలవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, సీత, యశ్వంత్, జగదీష్, కృష్ణ, యోగి, మల్లేష్, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: జిల్లాకు చెందిన కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి రమాదేవికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు ఈ నెలలో డాక్టరేట్ ను ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 'కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో '' పనిచేసే మహిళల ఆర్థిక అక్షరాస్యత అధ్యయనం - హైదరాబాదు జిల్లా '' అనే అంశం పై ఆచార్య ఎం.సులోచన పర్యవేక్షణలో పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని రమాదేవి రూపొందించి, సమర్పించారు.
గ్రామీణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన రమాదేవి స్వగ్రామం దామరచర్ల మండలం కొండప్రోలు. ఈమె తల్లిదండ్రులు మట్టమ్మ- పిచ్చయ్య. కొండప్రోలు గ్రామంలో పాఠశాల విద్య, మిర్యాలగూడెం నాగార్జున ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్మీడియట్, కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన రమాదేవి శ్రమకోర్చి తపనతో ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాస్త్రంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించారు. ఇష్టంగా అధ్యాపక వృత్తిని ఎంచుకుని ఎంపికై నిబద్ధత గల అధ్యాపకురాలు గా గుర్తింపు తెచ్చుకున్న రమాదేవి, ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో శాఖాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు.
పనిచేసిన ప్రతిచోటా గుణాత్మక సేవలందిస్తూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి పాటుపడుతున్న రమాదేవి డాక్టరేట్ పట్టా పొందడం వెనుకబడిన గ్రామీణ మహిళా విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రపంచ ఉపాధ్యాయ సంఘాలు సమాఖ్య సెక్రెటరీ జనరల్ , విద్యావేత్త ఎం.వి. గోనారెడ్డి, ప్రముఖ కవి, విద్యా విశ్లేషకులు, అసోషియేట్ ప్రొఫెసర్ డా.బెల్లి యాదయ్య అన్నారు.
నల్లగొండ: కాళోజీ జయంతి సందర్భంగా స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జీవితం- సాహిత్యం అను అంశంపై రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు సోమవారం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తెలంగాణ యాసలో నవరసాలు అను అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని, బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాష కావాలని కాళోజీ కోరినట్లే ఇవ్వాళ ప్రజల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తెలంగాణ యాసలో నవరసాలతో కూడిన తాను రాసిన పాటలను పాడి సభను అలరింపజేశారు.
ఈ కార్యక్రమానికి మరో వక్తగా విచ్చేసిన ప్రముఖ కవి ఎన్ వి. రఘువీర్ ప్రతాప్ నా గొడవ- సామాజికత అను అంశంపై మాట్లాడుతూ.. కాళోజీ ఎక్కడ అన్యాయం జరిగినా, స్పందించి కవిత్వం రాశాడని, ప్రజల గొడవను తన గొడవగా భావించి కవిత్వం ద్వారా ప్రజల్ని ఆలోచింపజేశాడని అన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఘనశ్యాం మాట్లాడుతూ.. కాళోజీ నిఖార్సైన మానవత్వానికి నిదర్శనమని, విశ్వమానవతా దృక్పథాన్ని తన కవిత్వం ద్వారా ప్రబోధించారని అన్నారు.
తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ వి. వి. సుబ్బారావు, డాక్టర్ ఎన్. దీపిక, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ సీతారాం రాథోడ్,డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్, డాక్టర్ టి. సైదులు, జి.గోవర్ధనగిరి, ఎస్.ప్రభాకర్ ఎమ్. లింగస్వామి, బి. రమ్య, తదితర అధ్యాపకులతో పాటు, కవి బండారు శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
TS: అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ ల సర్వీస్ క్రమబద్దీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ ల తో పాటు 19 రకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, రాష్టం లో ఏఐటీయూసీ - సీఐటీయూ JAC గా ఏర్పడి, తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పడుతున్నారు. ఈ నెల 11 నుంచి జరిగే అంగన్వాడీ ల సమ్మె ను జయప్రదం చేయాలని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
నల్లగొండ జిల్లా, దేవరకొండ: ఆలిండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షుడు చిట్యాల గోపాల్ ఆధ్వర్యంలో, ఆలిండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర 10వ మహాసభలను జయప్రదం చేయుట కొరకు రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం పట్టణంలోని ఐబి బంగ్లాలో ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు ఏర్పుల శ్రీనివాసు, నర్సింగ్ రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు మధు, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ , జిల్లా సలహాదారుడు డాక్టర్ ఏకుల రాజారావు, జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బరపటి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గ సభ్యులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్య మాట్లాడుతూ.. అక్టోబర్ 15న హైదరాబాదులో జరిగే ఏఐఎస్ఎస్డి 10వ రాష్ట్ర మహాసభ ను విజయవంతం చేయాలని కోరారు.
దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి అందుగుల లక్ష్మీనారి, దిండి మండలం అధ్యక్షుడు పాతుకుల మల్లేష్ ,మల్లేపల్లి సభ్యులు ఆదిరాల రాము, ధర్మపురి శీను, రంజిత్ సింగ్, ఎర్ర సైదులు, సాయి, తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన 'హన్స్ హైదరాబాద్ మారథాన్' పరుగు పోటీలలో 10 కిలోమీటర్ల విభాగంలో, నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థి వి. ధనుష్, ప్రధమ స్థానం సాధించి రూ. 30,000/- క్యాష్ అవార్డ్ ను గెలుచుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి ధనుష్ ను ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఘన్ శ్యామ్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, తదితరులు అభినందించారు.
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం జాను తండాలో విషాదం నెలకొంది. జాను తండ కు చెందిన ఓ బాలుడు జలుబు, దగ్గు ఉంది అని ఈ రోజు నాంపల్లి మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించగా, ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని కుటుంబీకులు బంధువులు ఆరోపిస్తూ నాంపల్లి లో ధర్నా చేపట్టారు.
మృతి చెందిన బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమ కారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో పగిళ్ల యాదయ్య, పాక పాండు, పగిళ్ల రామకృష్ణ, పురుషోత్తం, రాజశేఖర్, హరి, అశోక్, కార్తీక్, జనార్ధన్, రాహుల్ కుమార్, దుర్గేష్, మేతరి శంకర్, దాసరి గణేష్ ముదిరాజ్, కాటగోని కృష్ణయ్య, మేతరి రమేష్, ఏర్పుల సురేష్, చాపల వినయ్, గుండెపురి శంకర్, శ్రీను, ప్రశాంత్, ఏ.రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో ఈరోజు ముత్యాలమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, గ్రామ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఆ తల్లి దీవెనలతో సకాలంలో వర్షాలు పడి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.
Sep 13 2023, 16:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.4k