/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz 'అక్టోబర్ 15న హైదరాబాదులో జరిగే ఏఐఎస్ఎస్డి 10వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి' Mane Praveen
'అక్టోబర్ 15న హైదరాబాదులో జరిగే ఏఐఎస్ఎస్డి 10వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి'
నల్లగొండ జిల్లా, దేవరకొండ: ఆలిండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షుడు చిట్యాల గోపాల్ ఆధ్వర్యంలో, ఆలిండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర 10వ మహాసభలను జయప్రదం చేయుట కొరకు రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం పట్టణంలోని ఐబి బంగ్లాలో ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు ఏర్పుల శ్రీనివాసు, నర్సింగ్ రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు మధు, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ , జిల్లా సలహాదారుడు డాక్టర్ ఏకుల రాజారావు, జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బరపటి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గ సభ్యులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్య మాట్లాడుతూ.. అక్టోబర్ 15న హైదరాబాదులో జరిగే ఏఐఎస్ఎస్డి 10వ రాష్ట్ర మహాసభ ను విజయవంతం చేయాలని కోరారు. దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి అందుగుల లక్ష్మీనారి, దిండి మండలం అధ్యక్షుడు పాతుకుల మల్లేష్ ,మల్లేపల్లి సభ్యులు ఆదిరాల రాము, ధర్మపురి శీను, రంజిత్ సింగ్, ఎర్ర సైదులు, సాయి, తదితరులు పాల్గొన్నారు.
NLG: హన్స్ హైదరాబాద్ మారథాన్ పరుగు పోటీలో ఎన్జీ కళాశాల విద్యార్థికి ప్రధమ స్థానం
ఈరోజు  హైదరాబాద్ లో నిర్వహించిన 'హన్స్ హైదరాబాద్ మారథాన్' పరుగు పోటీలలో 10 కిలోమీటర్ల విభాగంలో, నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థి వి. ధనుష్, ప్రధమ స్థానం సాధించి రూ. 30,000/- క్యాష్ అవార్డ్ ను గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి ధనుష్ ను ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఘన్ శ్యామ్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, తదితరులు అభినందించారు.
BREAKING NEWS నాంపల్లి: ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి, ఆందోళనకు దిగిన బంధువులు
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం జాను తండాలో విషాదం నెలకొంది. జాను తండ కు చెందిన ఓ బాలుడు జలుబు, దగ్గు  ఉంది అని ఈ రోజు నాంపల్లి మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించగా, ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని కుటుంబీకులు బంధువులు ఆరోపిస్తూ నాంపల్లి లో ధర్నా చేపట్టారు. మృతి చెందిన బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: లెంకలపల్లి లో ఘనంగా చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి
చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమ కారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పగిళ్ల యాదయ్య, పాక పాండు, పగిళ్ల రామకృష్ణ, పురుషోత్తం, రాజశేఖర్, హరి, అశోక్, కార్తీక్, జనార్ధన్, రాహుల్ కుమార్, దుర్గేష్, మేతరి శంకర్, దాసరి గణేష్ ముదిరాజ్, కాటగోని కృష్ణయ్య, మేతరి రమేష్, ఏర్పుల సురేష్, చాపల వినయ్, గుండెపురి శంకర్, శ్రీను, ప్రశాంత్, ఏ.రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
లెంకలపల్లి గ్రామ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి బోనాలు శుభాకాంక్షలు: సర్పంచ్ పాక నగేష్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో ఈరోజు ముత్యాలమ్మ తల్లి  బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, గ్రామ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఆ తల్లి దీవెనలతో సకాలంలో వర్షాలు పడి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.
NLG: నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజేపి నాయకులు డా. నాగం వర్శిత్ రెడ్డి
నల్గొండ: సేవా దృక్పథం ఉన్న బిజేపి నాయకులు డా. నాగం వర్శిత్ రెడ్డి,  నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించి ఉన్నారు. పట్టణంలోని 39 వ వార్డు గాంధీనగర్ లో నివాసం ఉంటున్న కటకం సతీష్-రేణుక వివాహానికి,  బిజెపి నాయకులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హాజరై పుస్తే మెట్టెలు నూతన వధూవరులకు కానుకగా అందచేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కార్యక్రమం లో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.
ఆర్డీవో కార్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చండూరు: మండల కేంద్రంలో ఆర్డీవో కార్యాలయానికి, ఖాళీగా ఉన్న స్త్రీ శక్తి భవనాన్ని కేటాయించారు. ఆ భవనం అసంపూర్తిగా ఉండడంతో పున నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  శనివారం సందర్శించి మాట్లాడుతూ.. ఆర్డిఓ కార్యాలయాన్ని అన్ని విధాల సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు , తాహసిల్దార్, ఇతర అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: సిఐటియు
నల్లగొండ జిల్లా: చింతపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందు అంగన్వాడీల సమావేశం లో శనివారం, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఐసిడిఎస్ ప్రారంభించి 48 సంవత్సరాలు అవుతుంది. రానున్న రెండు సంవత్సరాలలో అర్థ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయటం లేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70, 000 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. గత 48 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏమి రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. దీనివల్ల అంగన్వాడి ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు.

మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటివ్ చెల్లిస్తున్నారు.

మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదు,స్వయంగా ముఖ్యమంత్రి అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్గా మార్చారు. కానీ టీచర్ తో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. అందుకు అనుగుణంగా అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. కనీస వేతనం 26,000 చెల్లించాలి గ్రాడ్యుయేటివ్ అమలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంపు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్కు 10 లక్షలు హెల్పర్ కు 5లక్షలు చెల్లించాలని, వేతనంతో సగం పెన్షన్ నిర్ణయించాలి. 60 సంవత్సరాల తర్వాత అంగన్వాడీ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిలు నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, అంగన్వాడి యూనియన్ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉగాది టు ఉగాది డైరీ లు పంపిణీ
నల్లగొండ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల జిల్లా క్రీడా శాఖ అధ్యక్షులు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కొడుమూరు వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో శనివారం,  ఉగాది నుండి ఉగాది వరకు 2023-2024 నూతనంగా ముద్రించిన డైరీ ని వ్యాయామ ఉపాధ్యాయులకు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, సూర్యాపేట జిల్లా క్రీడల శాఖ అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, రాష్ట్ర, జిల్లా, ప్రతినిధులు, పాముల అశోక్, దగ్గుపాటి విమల, నారాయణ కవిత, కందుకూరి శైలజ, అంబటి రేణుక, దుగ్యాల శంకర్, కేతావత్ శ్రీనివాస్, మద్ది కర్ణాకర్, చెరుకు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Mane Praveen

నల్లగొండ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం.. కేంద్రంలో, రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలకు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేయడానికి ప్రచార రథాన్ని ప్రారంభించిన బిజెపి రాష్

NLG: ప్రచార రథాన్ని ప్రారంభించిన కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి
నల్లగొండ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం.. కేంద్రంలో, రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలకు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేయడానికి ప్రచార రథాన్ని ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి