/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Madhapur Drugs Case Update : మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు Yadagiri Goud
Madhapur Drugs Case Update : మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు

హైదరాబాద్‌: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు

నిందితుడు వెంకట్‌ అక్రమాలపై నార్కోటిక్ పోలీసుల ఆరా..

నిందితుడు వెంకట్‌పై తెలుగు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులు

ఐఆర్ఎస్ అధికారి పేరుతో పలుచోట్ల వెంకట్ మోసాలు

నిర్మాతలు సి.కల్యాణ్‌, రమేశ్‌ నుంచి రూ.30 లక్షలకుపైగా వసూలు

పెళ్లి పేరుతో అధికారిని సైతం మోసం చేసినట్లు గుర్తింపు

సినిమాలో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేసినట్లు గుర్తింపు

ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం

ఎన్‌ఆర్‌ఐను అంటూ పెళ్లి పేరుతో విదేశీ యువతలను మోసం చేసిన వెంకట్

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్న వెంకట్

సినీ, రాజకీయ నేతలను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించినట్లు గుర్తింపు

వెంకట్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారిని ప్రశ్నించే యోచనలో పోలీసులు

పోలీస్ వ్యవస్థ పై కన్నెర్ర చేసిన ప్రజలు.,.
.,సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫనిగిరి గ్రామ శివారులో పోలీస్ వాళ్ళు ఫైన్ లు రాస్తుండగా వాళ్లను తప్పించుకునే క్రమంలో బైక్ కారు యాక్షి డెంట్ అయ్యి ఒకరు మృతి,మరొకరు చావుబతుకుల మధ్య హాస్పిటల్ తరలింపు.,ప్రజలు పోలీసుల పై తిరుగుబాటు చేయడం జరిగింది

.,సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫనిగిరి గ్రామ శివారులో పోలీస్ వాళ్ళు ఫైన్ లు రాస్తుండగా వాళ్లను తప్పించుకునే క్రమంలో బైక్ కారు యాక్షి డెంట్ అయ్యి ఒకరు మృతి,మరొకరు చావుబతుకుల మధ్య హాస్పిటల్ తరలింపు.,ప

టీడీపీ 9మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

  ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన అయ్యన్నపాత్రుడుని అడుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు 

ఇటీవల గన్నవరం యువగళం సభలో ముఖ్యమంత్రి, మంత్రుల్ని విమర్శించిన అయ్యన్నపాత్రుడు

గన్నవరం సభలో ప్రసంగాలకు సంబందించి టీడీపీ నేతలపై కేసులు

 మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదుp

ఒక్క ఛాన్స్ ఇవ్వండి: జానకిపురం సర్పంచ్ నవ్య

టికెట్ రేసులో తాను సైతం అని జానకిపురం సర్పంచ్ నవ్య అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధినేత కేసీఆర్‌కు ఆమె అర్జీ పెట్టుకుంటున్నారు. రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు టికెట్ రేసులో కడియం శ్రీహరి, రాజయ్యతో నవ్య కూడా పోటీపడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని.. కాబట్టి తనకు అవకాశం ఇవ్వండని నవ్య వేడుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులను నవ్య దంపతులు కలవనున్నారు. ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసిన నవ్య ఇప్పుడు టిక్కెట్టు కోసం పోటీ పడడంపై ప్రజలలో చర్చ జరుగుతోంది. పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి మరి....

కేంద్రమంత్రి నివాసంలో మృతదేహం కలకలం.. తనయుడిపైనే అనుమానం

లఖ్‌నవూ: కేంద్రమంత్రి కౌశల్‌ కిశోర్(Union Minister Kaushal Kishore) నివాసంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. కేంద్రమంత్రి తనయుడే ఆ యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది..

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) రాజధాని లఖ్‌నవూలోని మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

మృతుడి పేరు వినయ్ శ్రీవాస్తవ అని పోలీసులు వెల్లడించారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీస్థాయిలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారని ఆ కథనాలు పేర్కొన్నాయి..

Adilabad: అనుమానంతో భార్యను చంపి.. లొంగిపోయేందుకు వెళ్తూ..

ఆదిలాబాద్‌ : భార్యను హతమార్చిన ఓ వ్యక్తి.. అక్కడికి కొద్దిసేపటిలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణానికి సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.

అనుమానంతో శుక్రవారం వేకువజామున దీపను అరుణ్‌ హత్య చేశాడు. అనంతరం లొంగిపోతానంటూ ద్విచక్ర వాహనంపై పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరి వెళ్లాడు. ఈ క్రమంలో ఖుర్షిద్‌నగర్‌ వద్ద ఆగి ఉన్న లారీని అరుణ్ ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

డీజీపీ ఆఫీస్‌ ముట్టడి యత్నం.. తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా..

పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగులు తీశారు అభ్యర్థులు. దీంతో వాళ్లను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

జీవో నెంబర్‌ 46 నుంచి టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. జీవో నెంబర్‌ 46తో హైదరాబాద్‌కు 53 శాతం రిజర్వేషన్‌.. మిగతా ప్రాంతాలకు 47 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంది. తద్వారా ఇతర జిల్లాల వాళ్లకు మార్కులు ఎక్కువ ఎంపిక కాకపోవచ్చు. పైగా ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు..

''వన్ నేషన్ - వన్ ఎలక్షన్ '' దిశగా కేంద్రం..

•త్వరలోనే బిల్లు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అందుకేనా..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే ముగియగా.. మరోసారి ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ప్రకటన విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

అయితే ఉన్నపళంగా ఈ సమావేశాలు దేనికంటూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే '' వన్ నేషన్ , వన్ ఎలక్షన్'' బిల్లును ప్రవేశపెట్టేందుకే కేంద్రం ఈ సమావేశాలు నిర్వహిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. దీనిపై ఇప్పటికే పలుమార్లు మేధావులు సూచనలు చేయగా.. లా కమీషన్ ఆఫ్ ఇండియాచే అధ్యయనం చేయబడింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ వాటి గడువు ముగిసిన తర్వాత జరుగుతాయి. ఇది సాధారణంగా ప్రతి ఏడాది రెండు ఎలక్షన్ సైకిల్స్‌గా చెబుతారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రతిపాదన కింద.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సైకిల్‌లో ఎన్నికలు జరుగుతాయి. బహుశా ఒకే రోజు ఓటింగ్ జరుగుతుంది.

Aditya L1 Mission: ఆపరేషన్‌ ఆదిత్య- ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధం

Aditya L1 Mission: సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది..

తిరుపతి జిల్లా అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతోంది. మరో 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనున్నది.

రేపు ఉదయం సరిగ్గా 11.50 గంటలకు ఆదిత్య - ఎల్ 1 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి -సి 57 వాహక నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్ళబోతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. రాకెట్ ప్రయోగానికి మిషన్ సన్నద్దతా సమావేశం పచ్చ జెండా ఊపింది..

అక్కకు 95, తమ్ముడికి 85

సుభాష్‌నగర్‌: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది..

గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు.

సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది..