/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ''వన్ నేషన్ - వన్ ఎలక్షన్ '' దిశగా కేంద్రం.. Yadagiri Goud
''వన్ నేషన్ - వన్ ఎలక్షన్ '' దిశగా కేంద్రం..

•త్వరలోనే బిల్లు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అందుకేనా..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే ముగియగా.. మరోసారి ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ప్రకటన విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

అయితే ఉన్నపళంగా ఈ సమావేశాలు దేనికంటూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే '' వన్ నేషన్ , వన్ ఎలక్షన్'' బిల్లును ప్రవేశపెట్టేందుకే కేంద్రం ఈ సమావేశాలు నిర్వహిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. దీనిపై ఇప్పటికే పలుమార్లు మేధావులు సూచనలు చేయగా.. లా కమీషన్ ఆఫ్ ఇండియాచే అధ్యయనం చేయబడింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ వాటి గడువు ముగిసిన తర్వాత జరుగుతాయి. ఇది సాధారణంగా ప్రతి ఏడాది రెండు ఎలక్షన్ సైకిల్స్‌గా చెబుతారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రతిపాదన కింద.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సైకిల్‌లో ఎన్నికలు జరుగుతాయి. బహుశా ఒకే రోజు ఓటింగ్ జరుగుతుంది.

Aditya L1 Mission: ఆపరేషన్‌ ఆదిత్య- ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధం

Aditya L1 Mission: సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది..

తిరుపతి జిల్లా అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతోంది. మరో 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనున్నది.

రేపు ఉదయం సరిగ్గా 11.50 గంటలకు ఆదిత్య - ఎల్ 1 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి -సి 57 వాహక నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్ళబోతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. రాకెట్ ప్రయోగానికి మిషన్ సన్నద్దతా సమావేశం పచ్చ జెండా ఊపింది..

అక్కకు 95, తమ్ముడికి 85

సుభాష్‌నగర్‌: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది..

గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు.

సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది..

గురువులకు గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు.

ఇటీవల టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. తుది తీర్పునకు లోబడే బదిలీలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది.

టీచర్ల బదిలీలపై జనవరిలోనే షెడ్యూల్ విడుదలైంది. అయితే హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే న్యాయస్థానం స్టే ఎత్తివేయడంతో బదిలీలకు అవరోధాలు తొలగిపోయాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ రేపటిలోగా షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ బదిలీ ప్రక్రియలో భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులైతే వారికి అదనపు పాయింట్లు కేటాయించనున్నారు...

భారత డైనమిక్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పీవీ రాజారామ్‌

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ బీడీఎల్‌ డైరెక్టర్‌ ప్రొడక్షన్‌ గా పీవీ రాజారామ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన.. పృథ్వీ, ఆకాష్‌ తదితర క్షిపణుల తయారీలో ప్రధాన పాత్ర పోషించారు.

ఈ రంగంలో రాజారామ్‌కు 34 ఏండ్ల అనుభవం ఉన్నది. గతంలో బీడీఎల్‌ హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ యూనిట్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, యూనిట్‌ హెడ్‌గా కూడా విధులు నిర్వహించారు...

శ్రావణ శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బీభత్సంగా పెరిగింది. నేడు శుక్రవారం అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయి క్యూలైన్ వెలుపలికి వచ్చేశారు.

నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

నిన్న గురువారం తిరుమల శ్రీవారిని 59,808 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.6 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 25,618 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

తెలంగాణలో మరోసారి అమిత్ షా" పర్యటన

మరోసారి తెలంగాణ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు.. ఈమేరకు తెలంగాణ బీజేపీ కార్యచరణ రూపొదింస్తుంది.ఈ పర్యటనలో అమిత్‌ షా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. గతేడాది నుంచి సెప్టెంబర్ 17వ తేదీను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి వరంగల్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్ర భద్రత దళాలతో వరంగల్‌లో కవాతు నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు.ఈ కవాతులో అమిత్ షా గౌర వందనం స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారనుంది...

కాంగ్రెస్‌గూటికి తుమ్మల నాగేశ్వరరావు?

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది.

అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఫోకస్ పెట్టింది.

పార్టీలోకి తీసుకువచ్చేందుకు స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సీనియర్ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన ఉన్న వ్యక్తితో పార్టీకి మేలు జరుగుతుందని భావించారు.దీంతోనే తుమ్మలను కాంగ్రెస్‌లోకి చేరాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న విషయం తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా అనుచరులు, కార్యకర్తలు ఫుల్‌జోష్‌‌లో ఉన్నారు. ప్రాధాన్యత లేని పార్టీలో ఉండటం కంటే.. కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఆ జిల్లా కార్యకర్తలు నొక్కి చెబుతున్నారు.

ఇక తుమ్మల, రేవంత్‌లు గతంలో టీడీపీలో కలసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో సీనియర్ నేతగా ఉన్న తుమ్మలకు రేవంత్ మంచి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉన్నదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కేడర్ చర్చించుకుంటున్నది.

సీనియర్ నేతగా గుర్తింపు...

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు రాజకీయాల్లో సుపరిచితుడు. తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలోకి చేరిన ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు.

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సొంత గడ్డ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తుమ్మల మొదటి సారి ఓటమి పాలైనా.. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టారు.

Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై సహజ ప్రకంపనలు..?

బెంగళూరు: జాబిల్లిపై శాస్త్రీయ పరిశోధనలు సాగిస్తోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) పేలోడ్‌లు.. ఆసక్తికర సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్‌ వంటి మూలకాల లభ్యత తదితర సమాచారాన్ని ఇప్పటికే చేరవేశాయి..

ఈ క్రమంలోనే విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander)లోని ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సిస్మిక్‌ యాక్టివిటీ (ILSA) పేలోడ్‌.. తాజాగా చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదు చేయడం గమనార్హం. ఈ మేరకు ఇస్రో (ISRO) ఓ ట్వీట్‌ చేసింది..

'చంద్రయాన్‌-3 ల్యాండర్‌లోని 'ఇల్సా' పేలోడ్‌.. చంద్రుడి ఉపరితలంపై రోవర్‌, ఇతర పేలోడ్‌ల కారణంగా ఏర్పడిన ప్రకంపనలు నమోదు చేసింది. వీటికి అదనంగా.. అక్కడ సహజంగా ఏర్పడినట్లు భావిస్తోన్న ప్రకంపనలనూ గుర్తించింది. ఆగస్టు 26న వాటిని నమోదు చేసింది. వాటి మూలాన్ని గుర్తించే దిశగా అన్వేషణ సాగుతోంది. ఇదిలా ఉండగా.. 'ఇల్సా' పేలోడ్‌.. చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ (MEMS) సాంకేతిక ఆధారిత పరికరం' అని ఇస్రో తెలిపింది. 'ఇల్సా' పేలోడ్‌ను 'లేబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో- ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌' రూపొందించిందని వెల్లడించింది. దాన్ని చంద్రుడి ఉపరితలంపై మోహరించే యంత్రాంగాన్ని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిందని తెలిపింది..

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సెప్టెంబర్‌ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

SB NEWS