''వన్ నేషన్ - వన్ ఎలక్షన్ '' దిశగా కేంద్రం..
•త్వరలోనే బిల్లు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అందుకేనా..?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే ముగియగా.. మరోసారి ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ప్రకటన విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
అయితే ఉన్నపళంగా ఈ సమావేశాలు దేనికంటూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే '' వన్ నేషన్ , వన్ ఎలక్షన్'' బిల్లును ప్రవేశపెట్టేందుకే కేంద్రం ఈ సమావేశాలు నిర్వహిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. దీనిపై ఇప్పటికే పలుమార్లు మేధావులు సూచనలు చేయగా.. లా కమీషన్ ఆఫ్ ఇండియాచే అధ్యయనం చేయబడింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ వాటి గడువు ముగిసిన తర్వాత జరుగుతాయి. ఇది సాధారణంగా ప్రతి ఏడాది రెండు ఎలక్షన్ సైకిల్స్‌గా చెబుతారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రతిపాదన కింద.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సైకిల్‌లో ఎన్నికలు జరుగుతాయి. బహుశా ఒకే రోజు ఓటింగ్ జరుగుతుంది.
Sep 01 2023, 11:16