ప్రభుత్వ బడిని కాపాడుకుందాం : వంగూరి దామోదర్
నాగారం మండలం (సోమవారం) :ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామానికి రాకుండా అడ్డుకుందామని ,ఈటూర్ గ్రామ ప్రభుత్వ బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపైన ఉందని ఈటూరు గ్రామ వాసి టెక్నో డీడ్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వంగూరి దామోదర్ అన్నారు.
ఈ సందర్భంగా సోమవారం గ్రామంలో దామోదర్ మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.ఈటూరు గ్రామం నుండి ప్రైవేట్ స్కూల్స్ కి పంపుతున్న పిల్లల తల్లిదండ్రులనీ కలిసి ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్న విచ్చలవిడి విడి దందనీ,విద్య వ్యాపారాన్ని గురించి తల్లిదండ్రులకి అహాగాహన కల్పించామన్నారు.
గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడికి గ్రామ పిల్లలని పంపించకుండా ప్రైవేట్ బడులకి పంపటం వల్ల పిల్లలు తగ్గిపోతే భవిష్యత్ లో మూతపడే అవకాశం కూడా ఉందని,ప్రైవేట్ బడులకీ పోయే పిల్లల మనస్తవ్వం కూడా వ్యాపారం చేసే లాగా ఉంటుందని విలువలు నేర్పకుండ కేవలం ప్రతిధి పైసలకి ముడిపెట్టి ఒక వస్తువు లాగా విద్యార్థులు తయారు అయితరని , విలువలతో కూడిన విద్యా కేవలం ప్రభుత్వ బడిలోనే సాధ్యం కాబట్టి ఈటూరు గ్రామస్థులు అంత తమ పిల్లలని ఊరిలోని ఉన్న ప్రభుత్వ బడిలోకే పంపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరాల సరిత యాదగిరి, హైస్కూల్ ఇంఛార్జి ప్రభాకర్,SMC చైర్మన్ కొత్తోజు ఏళ్ళ చారి,కవి గాయకులు పేరాల యాదగిరి,ప్రతిభ యూత్ అధ్యక్షులు బోడ పరశరాములు యువజన సంఘాల నాయకులు వంగూరి కుమార్,వంగూరి సందీప్,బొట్టు సురేష్,పేరాల రాజు,వంగూరి అవిలమల్లు,బోడ కళ్యాణ్, బొడ దిలీప్,వంగూరి అంజయ్య,బోడ సురేష్,పేరాల అబ్బాస్,పేరాల గోపి,పేరాల అవిలయ్యా,పేరాల దయానంద్,పేరాల అంజయ్య,తదితరులు పాల్గొన్నారు..
Jul 18 2023, 08:45