/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Chandrababu: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు చంద్రబాబు సూచన Yadagiri Goud
Chandrababu: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు చంద్రబాబు సూచన

అమరావతి: రాష్ట్రంలో జూలై 21 నుంచి నెల రోజుల పాటు జరిగే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పట్ల ఏపీ ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు..

బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి చేపట్టే ఓటర్ వెరిఫికేషన్‌లో తమ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలన్నారు.

ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు అందరి బాధ్యతన్న చంద్రబాబు.. ఓటుతోనే భద్రత, భవిష్యత్తుకు భరోసా అని స్పష్టం చేశారు. ఈ మేరకు 'ఓటు మన బాధ్యత.. ఓటుతో భద్రత' అని పేర్కొంటూ ఆయన ట్వీట్‌ చేశారు..

టమాటా సాగుతో.. కోటీశ్వరులుగా మారిన ఇద్దరు రైతులు..

వ్యవసాయంతో కోట్లు ఆర్జించిన రైతులు అరుదు. కానీ.. దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు.. నెల కాలంలోనే ఇద్దరు రైతులను కోటీశ్వరులను చేశాయి..

మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన తుకారాం భాగోజి గాయకర్‌ 12 ఎకరాల్లో టమాటా సాగు చేశారు..

ఈ పంటపై సరైన అవగాహన ఉండడంతో దిగుబడి బాగా వచ్చింది. దీంతో నెల రోజుల్లోనే రూ.కోటిన్నరకు పైగా ఆదాయం సంపాదించారు. ఒక్కో పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్‌ మార్కెట్‌లో విక్రయించారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 900 పెట్టెలను అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు.

ఛత్తీస్‌గఢ్‌ ధమ్‌తరీ జిల్లాలోని బీరన్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ సాహూ 150 ఎకరాల్లో టమాటా సాగు చేసి.. రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించారు. రూ.కోటికి పైగా ఈ నెల కాలంలోనే సంపాదించారు. ఉన్నత విద్య చదివిన సాహూ.. వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలోకి దిగారు..

వందేభారత్‌ రైలులో చెలరేగిన మంటలు : తప్పిన పెను ప్రమాదం

భోపాల్‌ : వందేభారత్‌ రైలుకు పెనుప్రమాదం తప్పింది. భోపాల్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందేభారత్‌ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం ఉదయం కుర్వాయిస్టేషన్‌ వద్ద జరిగింది..

రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద రైలులోని సీ-14 కోచ్‌ వద్ద మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు.

దీంతో రైలును అక్కడే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక దళం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు..

పాలమూరు ప్రజాభేరి వాయిదా..? ఖరారు కాని ప్రియాంక షెడ్యూల్‌

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదాపడిది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు. ఈ నెల 20న జరగాల్సిన ప్రజాభేరి సభను మరొక రోజు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో పాటు మరి కొందరు నాయకులు ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు పాలమూరు ప్రజాభేరి పేరుతో సభ నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది.

అయితే పాలమూరు సభకు ఆహ్వానిస్తూ. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈ నెల మొదటి వారంలోనే పీసీసీ లేఖ రాసింది. కానీ ఇప్పటీ వరకు ప్రియాంగ గాంధీ షెడ్యూల్‌ ఖరార్‌ కాకపోవడంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరి కొందరు నాయకుల చేరికలు మరింత ఆలస్యం కానుంది. అయితే ఈ నెల 23 లేదా 28, 30వ తేదీల్లోని ఏదో ఒక రోజు సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ అధిష్టానం పాలమూరు జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పటికి ప్రియాంక గాంధీ పర్యటన ఖరార్‌కాకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు రావడం ఖాయమని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి....,.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి:జులై 17

సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న ఆదివారం శ్రీవారిని 86,170 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 31,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

TTD: తిరుమల శ్రీవారికి 2కేజీల బంగారు శంఖం

తిరుమల: తితిదే పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు శ్రీవారికి భారీ విరాళం సమర్పించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు బంగారు శంఖం సమర్పించారు..

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఈఓ ధర్మారెడ్డికి బంగారు శంఖం అందజేశారు. దాదాపు రెండు కేజీల బంగారంతో తయారు చేయించిన శంఖం విలువ కోటిరూపాయలు ఉంటుందని సమాచారం..

SB NEWS

Rahul Gandhi: రైతులే దేశానికి బలం - రాహుల్‌ గాంధీ

దిల్లీ: రైతులే దేశానికి బలమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. వారి సమస్యలను విని, వారి అభిప్రాయాలను అర్థం చేసుకుంటే దేశంలో ఉన్న సగం సమస్యలు పరిష్కరించవచ్చన్నారు..

ఇటీవల హరియాణా సోనీపత్‌ జిల్లా మదీనా గ్రామంలో రైతులు (Farmers), వారి కుటుంబాలతో ముచ్చటించిన వీడియోను రాహుల్‌ గాంధీ షేర్‌ చేశారు..

'రైతులే దేశానికి ఎంతో బలం. సోనీపత్‌లో సంజయ్‌ మాలిక్‌, తస్బిర్‌ కుమార్‌ అనే ఇద్దరు రైతు సోదరులను కలుసుకున్నాను. వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఎన్నో ఏళ్లుగా కలిసే వ్యవసాయం చేస్తున్నారు. వారితోపాటు నేనూ పొలంలో దిగి వరి నాట్లు వేయడంలో సహాయపడటంతోపాటు, ట్రాక్టర్‌ నడిపాను. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. ఆ గ్రామ మహిళలు మాపై ఎంతో అభిమానం చూపారు. వారి ఇంటినుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఇచ్చారు.

మన దేశంలోని రైతులు ఎంతో నిజాయతీ, సున్నిత మనస్తత్వం కలిగిన వారు. వాళ్లు పడే కఠినశ్రమ గురించి తెలుసు. అవసరమైనప్పుడు, కనీస మద్దతు, ఇన్సూరెన్స్‌, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారి అభిప్రాయాలను అర్థం చేసుకుంటే, దేశంలోని ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చు' అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు..

Payyavula Kesav: సీబీఐ విచారణకు మంత్రి అంబటి ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నా: పయ్యావుల..

అమరావతి: రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టు పనులపై తెదేపా నేత, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ మరోసారి స్పందించారు. ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై సీబీఐ విచారణకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు..

ప్రాజెక్టు పనుల కుంభకోణంపై త్వరలోనే సీబీఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.

ఎంబుక్‌ రికార్డును నిర్ధారించుకున్నాకే బిల్లులు చెల్లించారని చెబుతూ.. కోర్టులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందనేందుకు ఇంకేం సాక్ష్యం కావాలని ప్రశ్నించారు.

ప్రాజెక్టులో ఎలక్ట్రో మెకానికల్‌ పనుల ఖర్చు రూ.100కోట్లు కాగా.. మంత్రి అంబటి మాత్రం రూ.739కోట్లు విడుదల చేశామని చెప్పారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలకు 2020జులైలో టెండర్లు పిలిచారని, అప్పటికి రాయలసీమ డ్రాట్‌ మిటిగేషన్‌ కార్పొరేషన్‌ లేనేలేదని అన్నారు. రుణాన్ని తీసుకునేందుకు 2020 నవంబరులో కంపెనీ ఏర్పాటు చేశారని పయ్యావుల కేశవ్‌ తెలిపారు..

'వైఎస్సార్‌సీపీ 175కి 175 సీట్లు గెలుచుకునే వాతావరణం ఉంది'

తాడేపల్లి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 175కి 175 సీట్లు గెలుచుకునే వాతావరణం ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు..

ఈరోజు(ఆదివారం) పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు సజ్జల. ఎమ్మెలేలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

రాష్ర్టంలో వైసీపి 175 కి 175 స్దానాలు గెలుచుకునే వాతావరణం ఉంది. ఓటర్ల జాబితా సవరణల్లో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలి. దొంగఓట్ల తొలగింపు,అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో చురుకుగా ఉండాలి. అసైన్డ్ భూములు, చుక్కల భూములు విషయంలో ప్రభుత్వ తీసుకున్న మేలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీకి ప్రతిరోజు కీలకమే. పార్టీ పరిశీలకులు ఎంఎల్ఏలకు, కోఆర్డినేటర్లకు సంధానకర్తలుగా క్రియాశీలకంగా వ్యవహరించాలి. వాలంటీర్లను ఢీఫేమ్ చేయాలని, టెర్రరైజ్ చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విద్వేష, విషపూరిత ప్రచారాన్ని తిప్పికొట్టాలి' అని సజ్జల పేర్కొన్నారు..

Janasena: పవన్‌ కల్యాణ్‌తో పంచకర్ల రమేశ్‌బాబు భేటీ.. 20న జనసేనలో చేరిక

మంగళగిరి: ఇటీవల వైకాపా విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్‌బాబు జనసేన గూటికి చేరనున్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పంచకర్ల రమేశ్‌బాబు కలిశారు..

పవన్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో తాజా రాజకీయ పరిణామాలపై పంచకర్ల చర్చించారు. ఈ నెల 20న పవన్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పంచకర్ల రమేశ్‌బాబు పెందుర్తి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పంచకర్ల చేరికతో విశాఖలో జనసేన బలం పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు..