గురుకుల విద్యార్థుల సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
•బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న మునుగోడు రోడ్ లో అప్పాజీపేట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల బాలికల పాఠశాలను బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థులని అడిగి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను పేరు కోసమే ప్రారంభించారు తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గాని విద్యాశాఖ మంత్రి గాని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గాని సమక్షించకపోవడం చాలా దురదృష్టకరం కేవలం రాజకీయాలకే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులని వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోకపోవడం బీసీ విద్యార్థి సంఘం తరఫున ఖండిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం విద్యార్థుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉన్న తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించాలి .వాస్తు బాగాలేదని మంచిగా ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని కూలగొట్టి ఒక సంవత్సరంలో సచివాలయం మాత్రం దగ్గరుండి కట్టించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి గురుకులాలకు మాత్రం 9 సంవత్సరాలు నుండి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా శోచనీయం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గురుకుల పాఠశాల కట్టించలేకపోయాడు.
ఈరోజు అధికారులు కమిషన్ల కోసం అరకొర వసతులు ఉన్న బిల్డింగ్స్ ని తీసుకుని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు జిల్లా కలెక్టర్లు గారు పర్యవేక్షణ లేకపోవడం వల్ల గురుకుల పాఠశాలలను వారికి ఇష్టం వచ్చినట్లుగా జిల్లా కేంద్రాలకు దూరంగా కనీసం రవాణా సౌకర్యం లేని బిల్డింగ్స్ ఊర్లలో తీసుకొని విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులని చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణ లేకపోవడం వల్ల గురుకులాల పాఠశాలలో ఉన్న సిబ్బంది వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న అప్పాజీపేట మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో అక్కడున్నటువంటి సిబ్బంది
ఏ మాత్రం శ్రద్ధ లేకుండా విద్యార్థులకు వంట వండే సమయంలో బియ్యంలో పురుగులు ఉన్నా కూడా అలాగే వండి పెట్టడంతో విద్యార్థులు అన్నం కూడా సరిగా తినలేక పోతున్నామని అక్కడున్నటువంటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఆదివారం కావడంతో ప్రిన్సిపల్ కూడా పాఠశాలలో లేకపోవడంతో అక్కడున్న సిబ్బంది మెనూ ప్రకారం వంటలు కూడా చేపియలేకపోయారు ఇదేమని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అడగగా పొంతనలేని సమాధానం చెప్పి దాటవేస్తున్నారు అక్కడున్న విద్యార్థులు బిల్డింగు ప్రహరి కూడా లేకపోవడంతో రాత్రిపూట పాములు తేళ్లు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి తక్షణమే
జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క పాఠశాలను సందర్శించి మౌలిక వస్తువులు కూడా సరిగా లేవు అని చెప్పి విద్యార్థులు తెలియజేశారు మరి అన్ని మౌలిక వసతులు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న గురుకుల పాఠశాల సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం లేని ఎడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు బిసి విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు ఎరుకల లక్ష్మణ్ గౌడ్, వెంకన్న ,చంద్రశేఖర్ ,శివకుమార్ ,పరమేష్, మల్లేష్ ,మహేష్ ,పృథ్వీరాజ్ ,సత్తయ్య ,లింగస్వామి ,యాదయ్య , ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Jul 16 2023, 19:32