ఉచిత విద్యుత్‌పై ఆగని మంటలు
కరీంనగర్ జిల్లా :జులై 13
జిల్లాలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఉచిత కరెంట్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు కూడా చేసింది. తాజాగా గురువారం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
దీనిపై కోపంతో ఊగిపోయిన కాంగ్రెస్ నేత రోహిత్ రావు.. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. అసలు ఆ ఫ్లెక్సీలో ఏముందంటే... ‘‘మూడు గంటలు కరెంట్ చాలన్న కాంగ్రెస్‌కు మా గ్రామంలో ప్రవేశం లేదు. కబర్దార్ కాంగ్రెస్ నేతల్లారా’’ అంటూ బీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను చూసిన కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రోహిత్ రావు... ఆ ఫ్లెక్సీలను వాటిని చించివేశారు.
హైదరాబాద్‌కు రేవంత్..
మరోవైపు... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తానా సభల్లో ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. తాజా పరిణామాలతో రేవంత్ ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. బీఆర్ఎస్ ఆందోళనపై ఇప్పటికే ట్విట్టర్ వేదికగా రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంత దుష్ప్రచారం చేసినా వచ్చేది కాంగ్రెస్ అని... ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ అంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు గురువారం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేవంత్ మీడియా సమావేశం అనంతరం ఉచిత్ విద్యుత్‌పై చెలరేగుతున్న మాటలు మంటలకు పుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి....
Jul 13 2023, 14:38