/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం Yadagiri Goud
తెలంగాణ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో చాలాచోట్ల సోమ మంగళ బుధవారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది.

ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని వెల్లడించింది.

సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా వేంసూరులో 56 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మేడ్చల్‌ జిల్లా కేశవరంలో 18.3, ఖమ్మం జిల్లా పంగిడిలో 11.5, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 11 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.....

జర్నలిస్టు ఫోన్‌ సీజ్‌ చేయడానికి వీల్లేదు: కేరళ హైకోర్టు..

ఓ కేసుకు సంబంధించి విచారణ పేరుతో ఓ జర్నలిస్టు ఫోన్‌ను పోలీసులు సీజ్‌ చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. చట్టం నిర్దేశించిన నిబంధనలు అనుసరించకుండా జర్నలిస్టు ఫోన్‌ను సీజ్‌ చేయడానికి వీల్లేదని పేర్కొంది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో ‘నాలుగో స్తంభం’లో భాగమని.. ఏదైనా కేసులో వారి ఫోన్‌ అవసరమని భావిస్తే, సీఆర్‌పీసీ నిబంధనలను అనుసరించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే..?

కేరళకు చెందిన షాజన్‌ స్కారియా అనే వ్యక్తి.. ఓ యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నాడు. అయితే, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలతో తన పరువు తీశాడని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పీవీ శ్రీనిజిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. స్కారియాతో జి.విశాఖన్‌ అనే ఓ మలయాళ జర్నలిస్టుకు వార్తల విషయంలో కొద్దిపాటి పరిచయం ఉంది.

సంబంధం లేకపోయినా..

ఈ క్రమంలోనే షాజన్‌ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ.. విచారణలో భాగంగా పోలీసులు వేధిస్తున్నారని విశాఖన్‌ ఆరోపించారు. ఇదే విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంట్లో అక్రమంగా సోదాలు (జులై 3న) జరిపారని.. భయభ్రాంతులకు గురిచేస్తూ తన ఫోన్‌ను సీజ్‌ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనను వేధించొద్దంటూ పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. సోదాలు నిర్వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పోలీసుల తీరు తప్పు..

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ పీవీ కున్హి కృష్ణన్‌.. ఈ కేసులో పోలీసుల తీరును తప్పుపట్టారు. సదరు జర్నలిస్టు నేరంలో భాగస్వామ్యం కాదని.. అలాంటప్పుడు ఫోన్‌ సీజ్‌ చేయడం జర్నలిస్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని మౌఖికంగా అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతడి ఫోన్‌ అవసరమని భావిస్తే నిబంధనలు పాటించాలన్నారు. ఫోన్‌ను సీజ్‌ చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పోలీసులు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది.

తెలంగాణ రూటే సపరేటు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అధోకారికంగా అనగా కేవలం వార్తలు రాశారు లేదా వార్తలను చూపారనే ఉద్దేశ్యంతో 47మంది జర్నలిస్టుల (అనధికారికంగా 173 కేసులలో వివిధ రూపాలలో జర్నలిస్టు)లను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులలో వందకు పైగా ఫోన్లు సీజ్ చేశారను.

నల్గొండ కేసులో.. ఫోన్లు గాయబ్.._

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక పరిశోధన పాత్రికేయుడి అరెస్ట్ సందర్భంగా పది ఫోన్లు, ఒక ల్యాబ్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. ఆ మేరకు పంచనామా కూడా న్యాయస్థానంలో దాఖలాలు చేశారు. అయితే

తాజాగా కేసు కథ ముగిసింది. సీజ్ చేసిన ఫోన్లనో నాలుగు ఫోన్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై హైకోర్టులో కేసు ఉండటం గమనార్హం. ఈ విషయంలో పోలీసులపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు, హైకోర్టు న్యాయవాది యల్లంకి పుల్లారావు చెప్పారు.

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ

తిరుపతి :జులై 11

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం 64,347 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,358 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.....

రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు… హరీష్ రావు

తెలంగాణ‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. పటాన్ చెరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ తో కలిసి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రక్కన ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కును ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జిహెచ్ఎంసి వార్డు కార్యాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన డిసిసిబి బ్యాంక్ భవనాన్ని ప్రారంభించారు.

పట్టణ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ భవనాన్ని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జీఎంఆర్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా..? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

రిజెక్టెడ్ లీడ‌ర్లు, స్క్రాప్ లీడర్లు జాయిన్ అయితే పోయేది లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్ర‌మేన‌ని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్య‌మ‌న్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పట్టణవాసులు పాల్గొన్నారు...

Tomato Robbed: మార్కెట్‌కు తరలిస్తుండగా రెండు వేల కిలోల టమాటాల చోరీ..

బెంగళూరు: మార్కెట్‌లో ప్రస్తుతం టమాటా (tomatoes)ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చోరీల ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. మొన్నటికిమొన్న కర్ణాటకలో ఓ రైతు పొలంలో 60 బస్తాల టమాటాలను ఎత్తుకెళ్లారు..

తాజాగా టమాటాలను మార్కెట్‌కు తరలిస్తున్న వాహనాన్ని దొంగతనం చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం చిక్కజాల సమీపంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీసులు కథనం ప్రకారం.. చిత్రదుర్గలోని ఓ రైతు కోలార్‌ మార్కెట్‌కు 2 వేల కిలోల టమాటాలను తరలిస్తుండగా ముగ్గురు దుండగులు కారులో ఆ వాహనాన్ని అనుసరించారు. తమ వాహనాన్ని ఆ రైతు ఢీకొట్టాడని ఆరోపిస్తూ.. రైతు, డ్రైవరుపై దాడి చేశారు. అనంతరం వారిని నష్టపరిహారం కూడా డిమాండ్‌ చేశారు. అలా వారి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత రైతు, డ్రైవరును రోడ్డుపై వదిలేసి దుండగులు టమాటాల వాహనంతో పారిపోయారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల గురించి గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ. 120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. చోరీ ఘటనలు పెరుగుతుండటంతో రైతులు పొలాల వద్ద టెంట్లు వేసి కాపలా కాస్తున్నారు..

తెలంగాణ బిజెపి నేతలకు కేంద్రం భద్రత కేటాయింపు

తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్ ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్‌ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది.

హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటలకు ‘వై’ ప్లస్ భద్రతను కేటాయించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మందితో భద్రతా సిబ్బంది రక్షణగా ఉండనున్నారు.

అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అర్వింద్‌కు సెక్యూరిటీగా ‘వై' కేటగిరీలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. ఈరోజు సోమవారం ఈటల, అరవింద్ నివాసాలకు కేంద్ర భద్రతా బలగాలు వెళ్లనున్నారు.

గవర్నర్లకు రాజకీయాలపై మాట్లాడే హక్కు : ఉండదా ❓️

రాజకీయ పార్టీల నాయకులకు ఉన్నట్టే రాజకీయాలపై మాట్లాడే హక్కు గవర్నర్లకు కూడా ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఇతరులు రాజకీయ చర్చల్లో పాల్గొన్నట్టే గవర్నర్లకు కూడా ఆ స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించకుండా ఉండాలన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై వ్యాఖ్యల నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కూడా అయిన తమిళిసై తన వైఖరి స్పష్టం చేశారు. వాస్తవానికి అన్నామలై తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు.

ఆ సమయంలో ఓ విలేకరి తమిళిసై పేరును ప్రస్తావిస్తూ ఆమె తరచూ మీడియాతోరాజకీయాలపై మాట్లాడతారు కదా అని ప్రశ్నించారు. దీంతో అన్నామలై స్పందిస్తూ గవర్నర్లు తరచు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం, రాజకీయాల గురించి మాట్లాడడం మానుకోవాలని అన్నారు.

ఈ నేపథ్యంలో తమిళిసై కోయంబత్తూరు విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ తాను ఒక చట్రానికి పరిమితమై ఉండలేనని, అవసరం అనుకున్నప్పుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. ఎవరైనా గవర్నర్ల అభిప్రాయంతో విభేదించవచ్చని, కానీ వారిపై విరోధం పెంచుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఆయన (ఆర్‌ఎన్‌ రవి) ఎక్కడికి వెళితే అక్కడ పోస్టర్లు అంటించడం, నల్లజెండాలు ప్రదర్శించడం మంచి రాజకీయాలు అనిపించుకోవని పరోక్షంగా డీఎంకే ప్రభుత్వానికి సూచించారు...

కూకట్ పల్లిలో 250కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్ :జులై 10

నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మాదాపూర్ ఎస్ ఓటీ కూకట్ పల్లి పోలీసుల అధ్వర్యంలో 230 కేజీల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, రెండు ఇన్నోవా వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు........

SB NEWS

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) ఏపీ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. రాష్ట్రంలో మహిళలు అదృష్యానికి వలంటీర్లే కారణం ఆరోపించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది..

అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో మహిళా కమిషన్ పేర్కొంది. అలాగే పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, 10 రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) పవన్‌ను కోరారు.

పవన్‌పై ఫిర్యాదు

పవన్ వ్యాఖ్యలపై వలంటీర్లు (Volunteers) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్‌ (Uravakonda Police Station)లో పవన్‌పై వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ వారు చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. వారాహి యాత్రలో పవన్ వలంటీర్లపై నిందలు వేయడం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వాలంటీర్లు వ్యాఖ్యానించారు. వలంటీర్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వలంటీర్లు ఏం చేస్తున్నారో.. పవన్‌కల్యాణ్ చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ డౌన్ డౌన్ అంటూ వలంటీర్లు నినాదాలు చేశారు..

TS Rajbhavan: పెండింగ్‌ బిల్లుల అంశంపై తెలంగాణ రాజ్‌భవన్‌ క్లారిటీ..

హైదరాబాద్‌: పెండింగ్‌ బిల్లుల అంశంపై గత కొంత కాలంగా ప్రగతి భవన్‌, రాజ్‌భవన్‌ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధిని అడ్డుకునే విధంగా గవర్నర్‌ బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారంటూ అధికార పార్టీ నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై గత కొన్నిరోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు..

తాజాగా ఈ పెండింగ్‌ బిల్లుల అంశంపై రాజ్‌భవన్‌ వివరణ ఇచ్చింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని స్పష్టం చేసింది.

గతంలోనే 3 బిల్లులను గవర్నర్‌ ఆమోదించారని వెల్లడించింది. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు పేర్కొంది..