/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Tomato Robbed: మార్కెట్‌కు తరలిస్తుండగా రెండు వేల కిలోల టమాటాల చోరీ.. Yadagiri Goud
Tomato Robbed: మార్కెట్‌కు తరలిస్తుండగా రెండు వేల కిలోల టమాటాల చోరీ..

బెంగళూరు: మార్కెట్‌లో ప్రస్తుతం టమాటా (tomatoes)ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చోరీల ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. మొన్నటికిమొన్న కర్ణాటకలో ఓ రైతు పొలంలో 60 బస్తాల టమాటాలను ఎత్తుకెళ్లారు..

తాజాగా టమాటాలను మార్కెట్‌కు తరలిస్తున్న వాహనాన్ని దొంగతనం చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం చిక్కజాల సమీపంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీసులు కథనం ప్రకారం.. చిత్రదుర్గలోని ఓ రైతు కోలార్‌ మార్కెట్‌కు 2 వేల కిలోల టమాటాలను తరలిస్తుండగా ముగ్గురు దుండగులు కారులో ఆ వాహనాన్ని అనుసరించారు. తమ వాహనాన్ని ఆ రైతు ఢీకొట్టాడని ఆరోపిస్తూ.. రైతు, డ్రైవరుపై దాడి చేశారు. అనంతరం వారిని నష్టపరిహారం కూడా డిమాండ్‌ చేశారు. అలా వారి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత రైతు, డ్రైవరును రోడ్డుపై వదిలేసి దుండగులు టమాటాల వాహనంతో పారిపోయారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల గురించి గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ. 120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. చోరీ ఘటనలు పెరుగుతుండటంతో రైతులు పొలాల వద్ద టెంట్లు వేసి కాపలా కాస్తున్నారు..

తెలంగాణ బిజెపి నేతలకు కేంద్రం భద్రత కేటాయింపు

తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్ ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్‌ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది.

హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటలకు ‘వై’ ప్లస్ భద్రతను కేటాయించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మందితో భద్రతా సిబ్బంది రక్షణగా ఉండనున్నారు.

అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అర్వింద్‌కు సెక్యూరిటీగా ‘వై' కేటగిరీలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. ఈరోజు సోమవారం ఈటల, అరవింద్ నివాసాలకు కేంద్ర భద్రతా బలగాలు వెళ్లనున్నారు.

గవర్నర్లకు రాజకీయాలపై మాట్లాడే హక్కు : ఉండదా ❓️

రాజకీయ పార్టీల నాయకులకు ఉన్నట్టే రాజకీయాలపై మాట్లాడే హక్కు గవర్నర్లకు కూడా ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఇతరులు రాజకీయ చర్చల్లో పాల్గొన్నట్టే గవర్నర్లకు కూడా ఆ స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించకుండా ఉండాలన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై వ్యాఖ్యల నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కూడా అయిన తమిళిసై తన వైఖరి స్పష్టం చేశారు. వాస్తవానికి అన్నామలై తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు.

ఆ సమయంలో ఓ విలేకరి తమిళిసై పేరును ప్రస్తావిస్తూ ఆమె తరచూ మీడియాతోరాజకీయాలపై మాట్లాడతారు కదా అని ప్రశ్నించారు. దీంతో అన్నామలై స్పందిస్తూ గవర్నర్లు తరచు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం, రాజకీయాల గురించి మాట్లాడడం మానుకోవాలని అన్నారు.

ఈ నేపథ్యంలో తమిళిసై కోయంబత్తూరు విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ తాను ఒక చట్రానికి పరిమితమై ఉండలేనని, అవసరం అనుకున్నప్పుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. ఎవరైనా గవర్నర్ల అభిప్రాయంతో విభేదించవచ్చని, కానీ వారిపై విరోధం పెంచుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఆయన (ఆర్‌ఎన్‌ రవి) ఎక్కడికి వెళితే అక్కడ పోస్టర్లు అంటించడం, నల్లజెండాలు ప్రదర్శించడం మంచి రాజకీయాలు అనిపించుకోవని పరోక్షంగా డీఎంకే ప్రభుత్వానికి సూచించారు...

కూకట్ పల్లిలో 250కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్ :జులై 10

నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మాదాపూర్ ఎస్ ఓటీ కూకట్ పల్లి పోలీసుల అధ్వర్యంలో 230 కేజీల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, రెండు ఇన్నోవా వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు........

SB NEWS

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) ఏపీ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. రాష్ట్రంలో మహిళలు అదృష్యానికి వలంటీర్లే కారణం ఆరోపించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది..

అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో మహిళా కమిషన్ పేర్కొంది. అలాగే పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, 10 రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) పవన్‌ను కోరారు.

పవన్‌పై ఫిర్యాదు

పవన్ వ్యాఖ్యలపై వలంటీర్లు (Volunteers) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్‌ (Uravakonda Police Station)లో పవన్‌పై వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ వారు చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. వారాహి యాత్రలో పవన్ వలంటీర్లపై నిందలు వేయడం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వాలంటీర్లు వ్యాఖ్యానించారు. వలంటీర్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వలంటీర్లు ఏం చేస్తున్నారో.. పవన్‌కల్యాణ్ చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ డౌన్ డౌన్ అంటూ వలంటీర్లు నినాదాలు చేశారు..

TS Rajbhavan: పెండింగ్‌ బిల్లుల అంశంపై తెలంగాణ రాజ్‌భవన్‌ క్లారిటీ..

హైదరాబాద్‌: పెండింగ్‌ బిల్లుల అంశంపై గత కొంత కాలంగా ప్రగతి భవన్‌, రాజ్‌భవన్‌ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధిని అడ్డుకునే విధంగా గవర్నర్‌ బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారంటూ అధికార పార్టీ నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై గత కొన్నిరోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు..

తాజాగా ఈ పెండింగ్‌ బిల్లుల అంశంపై రాజ్‌భవన్‌ వివరణ ఇచ్చింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని స్పష్టం చేసింది.

గతంలోనే 3 బిల్లులను గవర్నర్‌ ఆమోదించారని వెల్లడించింది. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు పేర్కొంది..

చిక్కుల్లో ఎమ్మెల్సీ ::కౌశిక్ రెడ్డి ❓️

•బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా తెరపైకి పెద్దిరెడ్డి, సతీష్‌కుమార్‌

హుజురాబాద్ :జులై 09

కాంగ్రెస్‌ నుంచి ఏరి కోరి తెచ్చుకుని నెత్తినెక్కించుకున్న కౌశిక్‌రెడ్డి కథకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పుల్‌స్టాప్‌ పెట్టాలని భావిస్తున్నారా.. అన్న ప్రశ్నకు ఆ పార్టీ వర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తున్నది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీకి లాభం చేకూరుతుందని, బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ను ఓడించాలంటే యువకుడు, ఉత్సాహం, దూకుడుతనం ఉన్న కౌశిక్‌ రెడ్డి సరైన వ్యక్తి అని కేసీఆర్‌ భావించారు. ఉప ఎన్నికలో ఆయనకు టికెట్‌ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఎన్నికల తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్‌ పదవిని ఇచ్చి నియోజకవర్గంలో ప్రొటోకాల్‌ హోదా కల్పించారు. హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చి ఆయనను నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యత నుంచి తప్పించి కౌశిక్‌రెడ్డికి అప్పజెప్పారు.

సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి

అనతికాలంలోనే ఎమ్మెల్సీ, విప్‌ పదవి, నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి దక్కడంతో కౌశిక్‌రెడ్డి రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేయకుండా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ నియోజకవర్గంలో పార్టీశ్రేణులకు, ఉద్యోగవర్గాలకు, ప్రజలకు క్రమేపి దూరమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన దూకుడుతనం, వ్యవహారశైలి పార్టీ ఉనికికి ప్రమాదకరంగా మారుతున్నదని గమనించిన ఆయన ప్రత్యామ్నాయ నాయకుల కోసం వెతుకుతున్నట్లు చెబుతున్నారు. సొంత పార్టీ నాయకులు కూడా ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈటలకు కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో వెల్లడించినట్లు సమాచారం. అధికారులతో ఆయన అనుసరిస్తున్న దురుసువైఖరి అధికార, ఉద్యోగ వర్గాల్లో పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచుతున్నదని వారు తెలిపినట్లు తెలిసింది. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కూడా ఆయన అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారని సమాచారం. ఇటీవల ముదిరాజ్‌ కులస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యానాలు రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజికవర్గం ఆందోళనలకు, బీఆర్‌ఎస్‌కు ఆ వర్గానికి దూరం కావడానికి కారణమయ్యాయని పార్టీ నేతలు విమర్శించారు. దీంతో అధిష్ఠానం పాడి కౌశిక్‌రెడ్డిని మార్చాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఈటలకు దీటైన అభ్యర్థి కోసం వేట?

కౌశిక్‌రెడ్డి స్థానంలో ఈటల రాజేందర్‌ను ఢీకొనడానికి ప్రజల్లో మంచి పేరు ఉన్న వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్‌ ప్రజలతో మమేకమై వారిలో ఒకరిగా ఉంటూ రాజకీయంగా తిరుగులేని శక్తిగా ఎదిగారు. అలింటి నేతనే ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నికకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అందుకు సరైన వ్యక్తి అని భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఇనుగాల పెద్దిరెడ్డిని నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా ఉండాలని సూచించారని సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆయన హుజూరాబాద్‌లో నివాసం ఉండడానికి ఏర్పాట్ల చేసుకుంటున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డికి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో సత్సంబంధాలున్నాయి. నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నా పాత సంబంధాలను పునరుద్ధరించుకోవడం ఆయనకు ఇబ్బందేమీ కాదని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. పెద్దిరెడ్డితోపాటు ప్రస్తుత హుస్నాబాద్‌ శాసనసభ్యుడు వొడితెల సతీష్‌ కుమార్‌ను హుజూరాబాద్‌ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సతీష్‌కుమార్‌ తండ్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు కేసీఆర్‌కు సన్నిహితుడే కాకుండా ఆయన మంత్రి వర్గంలో పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. కెప్టెన్‌ కుటుంబానికి, హుజూరాబాద్‌ రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉన్నది. నియోజకవర్గంలో ఆయనకు గట్టి పట్టు ఉండడం, ఆ కుటుంబంలోని వారికి సౌమ్యులు, ప్రజలకు దగ్గరగా ఉండేవారని పేరుండడంతో సతీష్‌కుమార్‌ను హుజూరాబాద్‌ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని సమాచారం. ఇనుగాల పెద్దిరెడ్డి, వొడితెల సతీష్‌కుమార్‌ ఈటలను ఆయన పద్ధతిలోనే ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవారిగా గుర్తిస్తున్నారు. దీంతో హుజూరాబాద్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు మారతాయని అంచనా వేస్తున్నారు. ఊహించని విధంగా వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌లో ఉన్న కౌశిక్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌లో చేరేలా చేసి రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తును ఆయన ముందుంచింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తన దుందుడుకు చర్యలతో చేజేతులా ఆయన దూరం చేసుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్నది....

సికింద్రాబాద్ మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ :జులై 09

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా బోనాల పండుగ ప్రారంభమైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి సతీసమెతంగా సీఎం కేసీఆర్ బంగారు బోనంతో వచ్చారు.

తలపై పట్టు వస్త్రాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నా కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేసీఆర్ కవిత ఆలయం లోపల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి లక్షలాది మంది మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు....

తెలంగాణలో బిజెపి అడ్రస్సే లేదు

ఖమ్మం జిల్లా:జూలై 09

సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని, తెలంగాణలో బీజేపీ అడ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అన్నారు. ఆదివారం ఆమె ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతోందన్నారు. నార్త్‌లో వంద సీట్లకుపైగా బీజేపీ కోల్పోబోతోందన్నారు. బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతతత్వ రాజకీయాలకు ఈ దేశంలో చోటు లేదన్నారు.

పార్లమెంట్‌లో అసభ్యంగా.. అసహ్యంగా ప్రధాని మోదీ అబద్దాలు చెబుతున్నారని రేణుక చౌదరి అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్, కేసీఆర్‌ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. మంత్రి హరీష్ రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. కాంగ్రెస్ గంగా నది లాంటిదని, ఇందులోకి ఎంతో మంది వచ్చి స్నానం చేసి పునీతులవుతున్నారని అన్నారు. సర్వే నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని రేణుక చౌదరి పేర్కొన్నారు...............

బోనమెత్తిన కవిత

హైదరాబాద్ :జూలై 09

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు క‌న్నుల‌పండువ‌గా సాగుతున్నాయి. హైద‌రాబాద్‌లో బోనాల జోష్ నెల‌కొంది. ఇవ్వాల ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారికి భ‌క్తులు బోనాలు స‌మ‌ర్పిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఉజ్జ‌యిని అమ్మ‌వారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మహంకాళి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇక‌.. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించారు. భారీ ర్యాలీతో త‌ర‌లివ‌చ్చిన క‌విత అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. మొక్కు చెల్లించుకున్నారు. కాగా, ఇవ్వాల‌, రేపు రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు, ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. బోనాలు, ఓడి బియ్యం సమర్పణతో ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక‌.. పోత‌రాజుల నృత్యాలు, శివసత్తులు,జోగినీల నృత్యాల‌తో సికింద్రాబాద్‌లో సంద‌డి నెల‌కొంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్లాట్ కేటాయించారు. భక్తులు భద్రత కోసం ఆలయంలో 20 సీసీ కెమెరాలు ఉండగా, జాతర సందర్బంగా మరో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

బోనాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయానికి వచ్చే భక్తుల వెహికిల్స్ పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్వచ్చే మార్గంలో సైతం ట్రాఫిక్ ఉంటుందని తెలిపారు...