సిటీలో ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ :జూలై 08
సికింద్రాబాద్‌లో మహంకాళి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా నేటి నుంచి ఈ నెల 10 తారీకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.
దీంతో కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ పీఎస్, ప్యారడైస్, ఎస్‌బీఐ క్రాస్ రోడ్, సీటీఓ, ప్లాజా, వైఎంసీఎ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, పార్క్ లైన్, బాటా, పాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లైన్, ఘస్మండి క్రాస్ రోడ్, రసూర్ రోడ్లు, జంక్షన్ల వైపు వాహన దారులు రావొద్దని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేవారు ముందుగా బయలుదేరాలని సూచించారు.
కాగా టబాకో బజార్, హిట్ స్ట్రీట్ నుంచి మహంకాళి దేవాలయం వైపు వెళ్లే రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరుగుతుంది. బాట క్రాస్ రోడ్ నుంచి పాత రాంగోపాల్ పేట పీఎస్, సికింద్రాబాద్, సుభాష్ రోడ్ వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. అలాగే.. కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను మినిస్టర్ రోడ్ - రసూల్‌పురా క్రాస్ రోడ్డు-పీఎన్టీ-సీటీఓ-ఎస్‌బీఐ క్రాస్ రోడ్ -వైఎంసీఎ క్రాస్ రోడ్ సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్-గోపాలపురం లైన్‌లో రాణిగంజ్ క్రాస్ వద్దకు మళ్లించనున్నారని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దీంతో మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని సూచించారు....
Jul 08 2023, 19:23