4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే : మంత్రి హరీష్ రావు
మెదక్ జిల్లా :జూలై 08
రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘటన సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం నర్సాపూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మహిళల కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ హర్ష, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో మొత్తం 517 ఎకరాలకు గాను 610 మంది గిరిజనులకి పోడు పట్టాల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.4 లక్షల ఎకరాల పోడు భూములను పట్టాలను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచలేదు, కనీసం వారికి త్రీ ఫేజ్ కరెంట్ కనెక్షన్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్లు పది శాతానికి పెంచారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి త్రీ ఫేజ్ కరెంట్ గిరిజన తండాలను అందించారని గుర్తు చేశారు.
ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం 3,146 తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. గిరిజనుల కష్టాలు చూసిన కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 3146 తండాలను ఆదివాసీ గూడేలను పంచాయతీలు గా మార్చారని అన్నారు. రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఏ నాయకుడు వచ్చినా మోదీతో సహా కేవలం సీఎం కేసీఆర్ టార్గెట్ చేసి తిట్టుడే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రమేష్, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, మేఘమాల, కవిత, ఎంపీపీలు మంజుల, హరికృష్ణ, వినోద, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు మనసూర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శేఖర్ పట్టణాధ్యక్షుడు భిక్షపతితో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు......
Jul 08 2023, 17:28