సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరిక ఖాయమేనా ❓️
గద్వాల జిల్లా:జూలై 08
గద్వాల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖారారైంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్య నాయకులతో సమావేశమైన జడ్పీ చైర్‌పర్సన్ దంపతులు అభ్యర్థిత్వంపై చర్చించినట్లు తెలిసింది. హైద రాబాద్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో శుక్రవారం సాయంత్రం సమావేశమై, దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 20న కొల్లాపూర్‌లో జూపల్లి ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో వీరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది.
ఆ సభకు ప్రియాంకా గాంధీ రానుండటంతో.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలువురు ముఖ్య నాయకులు హస్తం గూటి కి చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భా గంగానే అదే రోజు పార్టీలో చేరేందుకు గద్వా ల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దంపతులు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు బీఆర్‌ఎస్ పార్టీలో ఉండగా, మొన్నటి వరకు ఆ పార్టీ నుంచే గద్వాల స్థానం నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన నాటి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తామనే ప్రచారంలో ఉండగా, అటు అలంపూర్, ఇటు గద్వాల శాసనసభ్యులతో వారి వర్గా నికి అంతర్గత కలహాలు ఉన్నాయి. ప్రొటో కాల్ విషయంతో పాటు జడ్పీ సమావేశాల నిర్వహణ.. పలు అధికారిక కార్యక్రమాల్లో బాహాటంగానే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమో హన్‌రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దంప తులకు మధ్య విభేదాలు బయటపడ్డాయి.
ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటన ముందు వరకు కూడా వారు బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉండి, టికెట్ కోసం ప్రయత్నిస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు పలువురు మంత్రుల వద్ద కూడా తమ అభ్యర్థనను పెట్టారు. కానీ అందరూ ఊహించని విధంగా, ఇటీవల పొంగులేటి, జూపల్లితో రేవంత్‌రెడ్డి సమావేశమైన సందర్భంలోనే జడ్పీ చైర్‌పర్సన్ భర్త తిరుపతయ్య కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. దీంతో వారు పార్టీ మారే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సంపత్‌కుమార్ నివాసంలో సమావేశమైన చైర్‌పర్సన్ దంపతులు.. స్థానిక డీసీసీ అధ్యక్షుల తోపాటు మరో బీఆర్‌ఎస్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి చర్చించినట్లు తెలిసింది. అయితే ఈ దంపతులిద్దరూ శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతో స మావేశం కావడంతో ఈ నెల 20న జరిగే సమావే శంలోనే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్లుగా భావించవచ్చు.
Jul 08 2023, 17:23