సిఐ స్వర్ణలత -దొంగ , పోలీసా ❓️
విశాఖపట్నం:జూలై 08
మూడేళ్ల కిందట విశాఖ జిల్లా ఎస్పీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుడు అయ్యన్న పాత్రుడిపై ఇష్టారీతిన మాట్లాడిన ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ని చాలా మంది గుర్తు పెట్టుకునే ఉంటారు. ఆమె పోలీస్ ఆఫీసర్స్ సంఘానికి ఉపాధ్యక్షురాలు కూడా. ఆమె పేరు స్వర్ణలత. ఇప్పుడు ఆమె బండారం మొత్తం బయటపడింది. ఏకంగా ఓ దోపిడీ ముఠానే నడుపుతున్నట్లుగా బయటపడింది.
ఈ వ్యవహారం పోలీసు శాఖలో సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి అధికారులను కాపాడేందుకు ప్రభుత్వంలోని వైసీపీ పెద్దలు ఎప్పుడూ రెడీగా ఉంటారు కాబట్టి.. తెర వెనుక ప్రయత్నాలు జరుగతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ సీఐగా స్వర్ణలత పనిచేస్తున్నారు. రూ. 90 లక్షల్లో సీఐ స్వర్ణలత రూ. 20 లక్షలు నొక్కేశారు. సీఐ స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా స్వర్ణలత ఉన్నారు. రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపా లని డీసీపీ -1 విద్యాసాగర్ నాయుడు, క్రైమ్ డీసీపీ జి.నాగన్నలను ఆదేశించారు. విచారణలో ఆ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో శుక్రవారం సీపీకి నివేదించారు. మరోవైపు రిటైర్డ్ నేవీ ఉద్యోగులను బెదిరించి లక్షలు కాజేసిన సిఐకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. నిందితులైపై చర్యలకు సిద్దమైన సమయంలో నగరానికి చెందిన ఒక వైసీపీ ప్రజాప్రతినిధి ఫోన్ చేసి. కేసు లేకుండా వదిలేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాధితులు నగదుతో వస్తున్నారనే సమాచారం లీక్ చేసి కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి దోపిడీలు చేసి ఉంటారని.. ఇప్పుడు బయటపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు స్వర్ణలతను అరెస్ట్ చేస్తారా లేకపోతే.. అలాంటి ఆఫీసర్లే తమ బలం అని వదిలేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
Jul 08 2023, 10:58