ఏ మొహం పెట్టుకొని మోదీ వరంగల్ కు వస్తున్నాడు
ప్రధాని నరేంద్ర మోదీ పై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి అని ధ్వజమెత్తారు.
తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి, తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని, కానీ రాష్ట్ర పునర్ విభజన హామీలో భాగమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మాత్రము మొండి చేయి చూపించారని, కేవలం 520 కోట్ల రూపాయలతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేట లో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు : తెలంగాణకు 520 కోట్ల రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కి 20000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ తీసుకుపోయిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారన్నారు కేటీఆర్. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, తొమ్మిదేళ్ల పాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్....
Jul 08 2023, 08:25