నేడు షిరిడీ సాయిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం షిరిడీ సాయినాథుడిని దర్శించుకుకోనున్నారు. ప్రత్యేక విమానంలో షిరిడీ రానుండడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రపతి ముర్ము సుమారు మూడు గంటల పాటు షిర్డీలో ఉంటారని, మధ్యాహ్నహారతికి హాజరవుతారని సంస్థాన్ సీఈవో పి. శివశంకర్ తెలిపారు.
సాయి సమాధి వద్ద రాష్ట్రపతి పూజ చేస్తారని, ఆ తర్వాత సాయిబాబా రాకను గుర్తుచేసే గురుస్థాన్ ఆలయాన్ని, నిమ్మాక్ చెట్టును సందర్శించే అవకాశం ఉందన్నారు. బాబా నివసించిన సర్వమత సమానత్వానికి ప్రతీక అయిన ద్వారకామాయిలో కూడా ముర్ము సందర్శించనున్నారు.
కాగా, సాయి సంస్థాన్ సీఈవో పి. శివశంకర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది టూర్ ప్లాన్‌లో బిజీగా ఉన్నారు. ఇక.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు గవర్నర్ రమేశ్ బైస్, మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్, ఎంపీలు సదాశివ లోఖండే, డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ కూడా రాష్ట్రపతితో పాటు రానున్నట్టు సమాచారం అందుతోంది. గతంలో భారత రాష్ట్రపతులుగా ఉన్న వారిలో నీలం సంజీవ్‌రెడ్డి, శంకర్‌దయాళ్ శర్మ, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్‌నాథ్ కోవింద్ సాయిదర్శనం సందర్భంగా షిర్డీని సందర్శించారు..
Jul 07 2023, 16:34