సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను మరింత ఉదృతం చేస్తాము
•జేఏసీ చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ
తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నాడు నలగొండ ఎంపీడీవో ఆఫీస్ ముందు పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె ను జేఏసీ చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ ప్రారంభించారు. సమ్మనుద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుండి పంచాయతీ కార్మికులందరూ నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారని ప్రభుత్వం నిర్లక్ష్య మొండి వైఖరిని వీడి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
పరిష్కరించకపోతే ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులు పంచాయతీల్లో సేవలు చేస్తూ అర్దాకలతో అలమటిస్తున్నారని అన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ విధానం వలన కార్మికులకు అనుభవం లేని పనులు ట్రాక్టర్ డ్రైవింగ్ చేయడం, కరెంటు స్తంభాలు ఎక్కడం లాంటి పనులతో ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని అన్నారు కానీ ప్రభుత్వం మాత్రం చస్తే 5000/ ఇస్తాం అనే చందంగా వ్యవహరిస్తుంది తప్పితే ఆ కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకుండా కుటుంబాన్ని బజారున పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం పదిలక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్, ఇతర వస్తువుల ధరలు పేరుగుతున్న తరుణంలో కార్మికుల జీతాలు మాత్రం పెరుగుదల లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 11వ పిఆర్సి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% వేతనాలు పెంచుతున్నట్లుజీవోలు జారీ చేశారు అవి అమలు కూడా అవి అయ్యాయి కానీ ప్రభుత్వంరంగ సంస్థ అయినా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం చిన్న చూపే చూసిందే తప్ప వాళ్లకు వేతనాలు పెంచలేదు కాబట్టే మేము ఈరోజు సమ్మెలోకి వెళ్ళామని అన్నారు.ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఏ విధమైన వేతనాలు ఇస్తున్నారు అదే తరహా వేతనాలను పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పైన ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక వినోద్ కుమార్, యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మండల అధ్యక్ష కార్యదర్శులు కాశీ మల్ల రాములు, పోలే సత్యనారాయణ జేఏసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఇరిగి ఎల్లేష్, పగిళ్ల ముత్తయ్య, వంగూరి శ్రీకాంత్, పెరిక రాంబాబు, యాదగిరి, చింతకింది భద్రయ్య, నరేష్, పోలే సుధాకర్, రేణుక, కళావతి, వాణి, చింత నాగయ్య, గోవర్ధనా చారి తదితరులు పాల్గొన్నారు.
Jul 07 2023, 12:04