బండి సంజయ్ ని తప్పించడం యావత్ బీసీలను అవమానించడమే...!
కళ్ళకు నల్లగుంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేసిన బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తప్పించడం యావత్ బీసీలను అవమానించడమేనని అందుకు నిరసనగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ ఆధ్వర్యంలో కళ్ళకు నల్లగంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన వ్యక్తంచేశారు.
గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు నల్లగంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన వ్యక్తం చేసిన అనంతరం కట్టెకోలు దీపేందర్ మాట్లాడుతూ బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి తీవ్రంగా ఖండించారు. అగ్రకుల నేతలు చేయలేనిపనిని బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ అధ్యక్ష పదవి తీసుకున్న అనతి కాలంలోనే చేసి చూపించారన్నారు. తన సర్వశక్తులు ఒడ్డి కేవలం పట్టణానికి పరిమితమైన భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లిన ఘనత బండి సంజయ్ దేనన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్ష బాధ్యతల నుంచి అవమానకర రీతిలో తప్పించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బడుగు బలహీన వర్గానికి చెందిన నాయకుడు బండి సంజయ్ ని అధ్యక్ష బాధ్యతల నుండి అవమానకరంగా తప్పించడం అంటే దేశవ్యాప్తంగా ఉన్న యావత్ బీసీలను అవమానపరచడమేనని అన్నారు. ఇప్పటివరకు తన సర్వశక్తి యుక్తులు ఒడ్డీ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ తీసుకువచ్చిన బండి సంజయ్ ని ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు ఒక సామాజిక వర్గం మెప్పుకోసం తొలగించి అగ్రకులానికి చెందిన నాయకుడిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం అంటే బిజెపికి బీసీలపైన ఉన్న చిత్తశుద్ధి కపట ప్రేమ ఏందో అర్థమై కనువిప్పు కలిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని దేశవ్యాప్తంగా ఉన్న యావత్ బీసీ సమాజం తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పి బంగాళాఖాతంలో కలుపుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Jul 06 2023, 17:29