నేడు బిజెపి బహిరంగ సభ
•ముఖ్యఅతిథిగా హాజరుకానున్న దగ్గుబాటి పురంధేశ్వరి
నంద్యాల జిల్లా:జూన్ 27
నగరంలోని కల్లూరు బైరెడ్డి ఫంక్షన్ హాలులో నంద్యాల జిల్లా బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభ నిర్వహిచను న్నట్లు బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైౖరెడ్డి శబరి తెలిపారు.
సోమవా రం బైరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆమె సమావేశం నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చేపట్టనున్న బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిధిగా హజరవుతారని బైరెడ్డి శబరి తెలిపారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ళ పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజలకు వివరిస్తారన్నారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ చార్జి రమేష్ నాయుడు, కె,చెన్నయ్య, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జిఎస్ నాగరాజు, రామ మోహన్‌రెడ్డి, వీరప్ప, సోమేశ్వర ఆచారి, భాస్కర్, రమణ పాల్గొన్నారు.....
Jun 27 2023, 09:24