నల్గొండ పట్టణంలో ఘోర ప్రమాదం.. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు మృతి
నల్లగొండజిల్లా :జూన్ 26
జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లగొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలోని ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
స్థానికంగా ఉన్న న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు.
పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేస్తున్న మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు....
Jun 26 2023, 20:43