/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Kashmir: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించి.. Yadagiri Goud
Kashmir: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించి..

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను నేడు భద్రతా దళాలు మట్టుబెట్టాయి..

కుప్వార వద్ద జరిగిన ఈ ఆపరేషన్‌ను భారత సైన్యంలోని చినార్‌ కోర్‌ దళాలు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించాయి.

దాదాపు వారం వ్యవధిలో ఇదే ప్రాంతంలో జరిగిన రెండో ఆపరేషన్‌ ఇది. ఈ ఎన్‌కౌంటర్‌ సరిహద్దుకు అత్యంత సమీపంలో మచిల్‌ సెక్టార్‌ వద్ద చోటు చేసుకొంది.

సరిహద్దుకు అవతల ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించే క్రమంలో కాలా జంగిల్‌ వద్ద ఎన్‌కౌంటర్‌ మొదలైంది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. జూన్‌ 16వ తేదీన ఇదే జిల్లాలోని జుమగుండ వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ రోజుల వ్యవధిలోనే తొమ్మిది మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చినట్లైంది..

ఉరుమడ్ల గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమం

•ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాలు ఇంటింటికీ

•కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం వైపు అడుగులు వేస్తూ భారత దేశ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు.

అవినీతిరహిత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గ్రామంలో వాడ వాడల ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారి విజయాలను తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి అందజేశారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి గాను 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి ప్రధానమంత్రి కి మద్దతు తెలుపండి అని ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంత్యోదయ స్ఫూర్తి తో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదల గృహాలకు నల్ల నీరు మరియు విద్యుత్ అందించడం, రైతు సంక్షేమానికి పెద్దపీట ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ. 6000 ఆర్థిక సహాయం, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ద్వారా 37.5 కోట్ల మంది రైతులు నమోదు,

MSP లో చారిత్రాత్మక పెరుగుదల, కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 4 కోట్ల రైతులకు రూ. 4.7 లక్షల కోట్ల క్రెడిట్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా 57 లక్షల మంది రైతులకు లబ్ధి, మౌలిక సదుపాయాల అపూర్వ వృద్ధి,PM గతి శక్తి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు, వందే భారత్ రైలు ప్రారంభం, జాతీయ రహదారుల నిర్మాణ వేగం, ఈశాన్య రాష్ట్రాల చారిత్రక అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల్లో 76% తగ్గిన తీవ్రవాద ఘటనలు, అస్సాం లో 2000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం, సాంస్కృతిక వారసత్వంలో కొత్త శకం, అయోధ్య రామ జన్మభూమి లో భవ్య మందిరం,

కాశీ విశ్వనాథ్, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో గ్రాండ్ కారిడార్ నిర్మాణం, సోమనాథ్, కేదార్ నాథ్ ఆలయాల పునరుద్ధరణ, జన్ జాతీయ గౌరవ్ దివస్, 10 గిరిజన మ్యూజియంలు, అత్యున్నత త్యాగం చేసిన మన సైనికుల గౌరవార్థం న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నిర్మాణం, నారీ నారాయణి: మహిళా సాధికారత, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా 9.6 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు జారి గ్యాస్ స్టవ్ ల పంపిణీ, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 11. 72 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం, స్టాండ్ అప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా 27.6 కోట్ల మంది మహిళా లబ్ధిదారులకు రుణాలు,

ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా 3. 03 కోట్ల మంది మహిళలకు సహాయం, భారతదేశ అమృతకాలం భావితరం సశక్తీకరణ, 390 కొత్త విశ్వవిద్యాలయాలు, 7 కొత్త IITలు మరియు ఏడు కొత్త IIMలు స్థాపన, 15 ఎయిమ్స్ మరియు 225 మెడికల్ కాలేజీలు స్థాపన, పీఎం శ్రీ యోజన ద్వారా 14,500 పాఠశాలల అభివృద్ధి, 1.37 కోట్ల మంది యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా శిక్షణ, దేశంలో ఒక లక్ష స్టార్టప్ లు మరియు 100 ప్లస్ యూనికార్నలు, ఉద్యోగమేళాల ద్వారా 71,000 పైన నియామక పత్రాల పంపిణీ, అందరికీ ఆరోగ్యకరమైన జీవితం 10.7 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భీమా కవరేజ్, ఆయుష్మాన్ భారత్ ద్వారా 4.5 కోట్ల ప్రజలకు ఉచిత చికిత్స,

జన్ ఔషధీ కేంద్రాలు, వైద్యశాలల బలోపేతం, ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కేంద్రాలు, ప్రపంచంలోనే అత్యంత భారీ టీకా కార్యక్రమం ద్వారా 220 కోట్ల పైన కరోనా టీకా డోసులు, మిషన్ ఇంద్రధనుష్, మధ్యతరగతికి సులభతర జీవితం, సశక్త భారతదేశం నేడు భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కరోనా కాలంలో వందే భారత్ మిషన్ ద్వారా 2. 97 కోట్ల మంది భారతీయులు స్వదేశం తరలింపు, భారతదేశం భద్రత పటిష్టం, ఆర్టికల్ 370 రద్దు, వసుదైవ కుటుంబం, డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా భారతదేశాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ తీర్చి దిద్దాడన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నకిరేకల్ ఎస్సీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, మీడియా సెల్ కన్వీనర్ ఉయ్యాల లింగస్వామి గౌడ్, ఎస్సీ మోర్చా చిట్యాల మండల అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, యాదయ్య, శ్రీను, మల్లేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య

ఖమ్మం జిల్లా:జూన్ 23

పెనుబల్లి మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.

కారాయి గూడెం గ్రామానికి చెందిన కుటుంబం మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

గ్రామానికి చెందిన పొట్రూ వెంకటకృష్ణరావు (40), భార్య సుహాసిని (35), కూతురు అమృత (16) ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

భార్య సుహాసినికి అనారోగ్య సమస్యలు కారణంగా అప్పుల బాధల్లో కూరుకుపోయారని స్థానికులు అంటున్నారు. అనారోగ్యానికి సంబంధించి భార్యకు ఇటీవల ఒక సర్జరీ జరిగినట్లు కూడా చెబుతున్నారు. ఆత్మ హత్యకు ముందే ప్రిపేరైన కుటుంబం కొత్త తాడులు పీటలు తో సహా సొంత మామిడి తోటకు వచ్చి ఉరి వేసుకున్నారు....

కూతురుతో కలిసి మీడియా ముందుకు రామ్ చరణ్, ఉపాసన

హైదరాబాద్ :జూన్ 23

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చరణ్ తండ్రి కావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతోంది.

కాసేపటి క్రితం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తమ బిడ్డను తీసుకుని రామ్ చరణ్, ఉపాసన ఇంటికి బయల్దేరారు. అయితే, చిన్నారి ముఖం కనిపించకుండా వస్త్రాలతో కప్పి ఉంచారు.

ఈ సందర్భంగా మీడియాతో చరణ్ మాట్లాడుతూ, తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని, ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి భయం లేదని అన్నారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవని చెప్పారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు.

కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నీ నాన్న పోలికలే అని చెప్పారు. పాపకు ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన నిర్ణయించామని, 21వ రోజున ఆ పేరును తానే వెల్లడిస్తానని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినప్పుడు అందరు తండ్రుల మాదిరే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.........

భారీ ఎన్ కౌంటర్… నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ :జూన్ 23

జమ్మూకశ్మీర్ లో ఈరోజు భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

కుప్వారాలోని మచల్​ సెక్టార్ లో గల నియంత్రణ రేఖ ఎల్ఓసీ సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు ఈరోజు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.

ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ లో నియంత్రణ రేఖ గుండా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు

ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

నాచారంలో యువతి సెల్ఫీ సూసైడ్

భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని నాచారంలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఆత్మహత్యకు ముందు తన చావుకి కారణం భర్తేనని పేర్కొంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఫేస్ బుక్ లో లైవ్ వీడియో పెట్టి తన గోడు తెలిపింది.

ఐదు నెలలుగా తన భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సన పేర్కొంది.

ఆ వీడియోలోనే సన ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. తన భర్త హేమంత్ వేధింపులకు గురిచేస్తున్నా.. కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదని, వాళ్లు కూడా తమ ఇష్టానికి మాట్లాడారని తెలిపింది. భర్త వేధింపులు మరింత ఎక్కువ అవడంతో.. భరించలేక ప్రాణం తీసుకుంటున్నట్లు . వీడియో ద్వారా తెలిపింది.....

PM Modi Tour: వైట్‌ హౌస్‌లో 'నాటు నాటు' ప్రస్తావన..!

శ్వేతసౌధంలో భారత ప్రధాని మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో సరదా సన్నివేశాలు చోటుచేసుకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన తాతగారు చెప్పిన మాటలను అతిథులతో పంచుకున్నారు..

'టోస్ట్‌' సంప్రదాయాన్ని ఎలా పాటించాలనే దానిపై అధ్యక్షుడు బైడెన్‌ ప్రధాని మోదీకి వివరించారు. అధికారిక విందు సందర్భంగా జో బైడెన్‌ టోస్ట్‌కు పిలుపునిచ్చే సమయంలో మాట్లాడుతూ ''మిస్టర్‌ పీఎం.. మీరు ఆల్కహాల్‌ తీసుకోకపోతే ఎడమ చేత్తో టోస్ట్‌ గ్లాస్‌ తీసుకోవాలి.

ఈ విషయాన్ని మా తాతయ్య ఆంబ్రోస్‌ ఫెన్నిగాన్‌ చెప్పేవారు. నేను జోక్‌ చేయడంలేదు. జిల్‌, నేను నేడు ప్రధాని మోదీతో అద్భుతంగా గడిపాం. ఇది చాలా ఫలవంతమైన పర్యటన. ఈరోజు రాత్రి అమెరికా- భారత్‌ మధ్య ఉన్న గొప్ప మైత్రిని గౌరవించుకొంటున్నాం'' అని పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ పక్కనే కుడిచేత్తో గ్లాస్‌ పట్టుకొని నవ్వుతూ ఉండిపోయారు.

శ్వేతసౌధంలో అధికారిక విందు సందర్భంగా ప్రధాని మోదీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలోని ఆస్కార్‌ గెలుపొందిన 'నాటు నాటు' పాటను ప్రస్తావించారు. ''గడిచే ప్రతి రోజునూ.. భారత్‌, అమెరికన్లు పరస్పరం మరింత మెరుగ్గా అర్థం చేసుకొంటున్నారు. హాలోవిన్‌ రోజున భారత్‌లో పిల్లలు స్పైడర్‌మెన్‌గా మారిపోతున్నారు. మరోవైపు అమెరికాలో యువత 'నాటు నాటు' ట్యూన్లకు స్టెప్పులేస్తున్నారు'' అని పేర్కొన్నారు..

జేపి నడ్డా ఒక కాల్ చేస్తే పదవి నుండి తప్పుకుంటా!! : బండి సంజయ్

నా బిస్తర్‌ రెడీగాఉంది.జేపీ నడ్డా ఒక్క కాల్‌ చేస్తే పదవి నుంచి తప్పకుంటా,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి.ఇది కచ్చితంగా అధ్యక్ష మార్పునకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

సందర్భం లేకపోయినా ఇటీవల బండి సంజయ్‌ పదే పదే ‘బీజేపీ వ్యక్తి ఆధారంగా నడవదు, నిర్ణయాలు ఢిల్లీ స్థాయిలోనే జరుగుతాయి, దానికీ ఓ పద్ధతి ఉంటుంది, రాత్రికి రాత్రే నిర్ణయాలు చెప్పరు’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. బండికి బలమైన సంకేతాలు ఉండటం వల్లే ఇలా మాట్లాడుతున్నారని అంతా భావిస్తున్నారు.

తాజా వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తప్పిస్తారని కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం సాగుతున్నది. పార్టీలో కోటరీలు ఏర్పాటు చేయడం, సీనియర్లను పక్కనబెట్టడం, తన అనుచరులకే పదవులు దక్కేలా చూడటంవంటి బండి సంజయ్‌ ఒంటెద్దు పోకడలపై ఢిల్లీ పెద్దలకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్తున్నాయని సమాచారం. బండి ప్రవర్తన వల్లే పార్టీలో చేరికలు ఆగిపోయాయని, రాష్ట్రంలో పార్టీకి పెరిగిన కాస్తో కూస్తో ఆదరణ కూడా తగ్గిపోయిందని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో బండిని తప్పించి ఈటలను అధ్యక్షుడిని చేస్తారని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈటల ఢిల్లీకి వెళ్లడం, బండి కొన్నాళ్లుగా పెద్దగా హడావుడి చేయకపోవడంవంటి పరిణామాలు దీనికి సంకేతమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు బండి వ్యాఖ్యలతో అధ్యక్షుడి మార్పు దాదాపు ఖాయమైందని అంటున్నారు.

కాంగ్రెస్‌లోకి ఆ ఇద్దరు నేతలు?

ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిదేండ్ల పాలనను పూర్తిచేసుకొన్న సందర్భంగా గురువారం నిర్వహించిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉండడం ఆ పార్టీలో విభేదాలను ఎత్తిచూపుతున్నది. కార్యకర్తల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు అందరూ పాల్గొనాలని చెప్పినా వీరిద్దరూ గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఈటల, కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఇది మరింత బలం చేకూర్చింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కోమటిరెడ్డి పార్టీతో అంటీముట్టనట్టగా వ్యవహరిస్తుండగా, ఈటలకు కూడా ఇప్పుడు తత్వం బోధపడిందని అంటున్నారు.తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పడంతోనే ఢిల్లీ పెద్దలు సరిపెట్టేస్తున్నారని ఈటల వాపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నరన్న చర్చ జోరుగా సాగుతున్నది...

యుఎస్ పార్లమెంట్‌లో, ఉగ్రవాదానికి ప్రపంచ ముప్పు : ప్రధాని మోదీ

•మైనారిటీలపై వివక్ష ప్రశ్నపై ఈ సమాధానం ఇచ్చారు

ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్లలో ఆరోసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇది ఆయన తొలి రాష్ట్ర పర్యటన.భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు యూఎస్ కాంగ్రెస్ (పార్లమెంట్) జాయింట్ సెషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ తీవ్రవాదం మొదలుకొని అనేక పెద్ద అంశాలపై మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి.. మాట్లాడాడు.. ఈ సందర్భంగా భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి కూడా మాట్లాడాడు.పాకిస్థాన్, చైనా పేర్లను ప్రస్తావించకుండా రెండు దేశాలను టార్గెట్ చేశాడు.

పేరు పెట్టకుండానే ఉగ్రవాదంపై చైనా-పాక్ గోల

అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి పెను ముప్పుగా అభివర్ణించారు. 9/11 మరియు 26/11 వంటి తీవ్రవాద దాడులను ప్రస్తావిస్తూ, ఈ దాడులు జరిగిన దశాబ్దానికి పైగా గడిచిన తర్వాత కూడా, ఉగ్రవాదం మరియు రాడికలిజం యొక్క ముప్పు ప్రపంచం మొత్తం మీద పెచ్చరిల్లిపోతోందని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువనీ, దాన్ని అరికట్టడానికి ఆస్కారం లేదు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే వారిపై మనం కలిసి పోరాడాలి. ప్రపంచం మారుతోంది. ప్రపంచానికి కొత్త ప్రపంచ క్రమం కావాలి.

సంభాషణ మరియు దౌత్యం కోసం సమయం, యుద్ధం కాదు

ఈ సందర్భంగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఇది యుద్ధానికి సమయం కాదని, చర్చలు మరియు దౌత్యానికి తగిన సమయం అని ప్రధాని మోదీ అన్నారు. యుద్ధం ప్రజలను బాధపెడుతుందని అన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా దెబ్బతిన్నాయి. యుద్ధం కారణంగా ప్రపంచీకరణ కూడా నష్టపోయింది. సరఫరా గొలుసు పరిమితమైంది. సరఫరా గొలుసును కూడా వికేంద్రీకరించడానికి మరియు ప్రజాస్వామ్యీకరించడానికి మేము గట్టి ప్రయత్నం చేయాలి. సాంకేతికత భద్రత మరియు శ్రేయస్సును నిర్ణయిస్తుంది. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూరప్ యుద్ధ నీడలో ఉంది. ఇందులో అనేక శక్తులు ఉన్నాయి, కాబట్టి పరిణామాలు భయంకరంగా ఉంటాయి.

మైనారిటీలపై వివక్ష అనే ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు జో బిడెన్‌తో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టు ప్రధాని మోదీని భారత్‌లో మైనారిటీల స్థితిగతుల గురించి ప్రశ్నించగా.. వివక్షకు సంబంధించిన ప్రశ్న అడిగారు. దీనిపై ఆ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నను ఓపికగా విన్న ప్రధాని మోదీ.. సమాధానం చెప్పడం ప్రారంభించారు. 'ప్రజాస్వామ్యం మన సిరల్లో ఉంది' అని ప్రధాని మోదీ అన్నారు. మనం ప్రజాస్వామ్యంగా జీవిస్తున్నాం. మన ప్రజాస్వామ్యంలో కులం, మతం, మతాల ఆధారంగా ఎవరిపైనా వివక్షకు తావు లేదు. ప్రెసిడెంట్ బిడెన్ చెప్పినట్లుగా, భారతదేశం మరియు అమెరికాల డిఎన్‌ఎలో ప్రజాస్వామ్యం ఉందని ప్రధాని మోదీ రాష్ట్రపతిని చూపిస్తూ అన్నారు. కాబట్టి వివక్ష అనే ప్రశ్నే లేదు. మన దేశం రాజ్యాంగంపై నడుస్తుందని.. 'అందరి మద్దతు, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే సూత్రంపై మా ప్రభుత్వం నడుస్తుందని, భారతదేశ ప్రజాస్వామ్య విలువలలో వివక్ష లేదని ప్రధాని మోదీ అన్నారు.

బిడెన్ పిఎం మోడీకి గ్రాండ్ స్టేట్ డిన్నర్ ఏర్పాటు

•ముఖేష్ అంబానీ మరియు ఆనంద్ మహీంద్రాతో సహా ప్రముఖులు హాజరు

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గ్రాండ్ స్టేట్ డిన్నర్ ఇచ్చారు.అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (జూన్ 22) రాష్ట్ర విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమ, ఫ్యాషన్, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.ఈ గ్రాండ్ ఈవెంట్‌కు 400 మంది అతిథులు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆనంద్ మహీంద్రా నుండి సుందర్ పిచాయ్ వరకు చాలా మంది పెద్ద వ్యక్తులు ఈ విందుకు హాజరయ్యారు. దీనితో పాటు, భారత ప్రభుత్వం నుండి పెద్ద ప్రతినిధులు ఈ రాష్ట్ర విందులో పాల్గొన్నారు, ఇందులో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరు కూడా ఉంది.

అమెరికన్ సంప్రదాయం ప్రకారం విందు సమయంలో టోస్ట్ వేడుక జరిగింది. సాధారణంగా టోస్ట్‌తో ఆల్కహాల్ తీసుకుంటారు, కానీ ప్రధాని మోడీ ఆల్కహాల్ తీసుకోరు కాబట్టి, టోస్ట్‌తో ఆల్కహాల్ లేని జింజర్ ఆలే పానీయాన్ని ఉపయోగించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, 'అతని తాత ఆంబ్రోస్ ఫిన్నెగాన్ మీరు టోస్ట్ చేయాలనుకుంటే మరియు మీ గ్లాస్‌లో వైన్ వద్దు, మీ ఎడమ చేతిలో గ్లాస్ పట్టుకోవాలని చెప్పేవారు. నేను తమాషా చేస్తున్నాను అని మీ అందరికీ అనిపిస్తుంది కానీ అది అలా కాదు. బిడెన్ ఈ విషయం చెప్పగానే, కార్యక్రమానికి హాజరైన ప్రజలతో పాటు ప్రధాని మోదీ కూడా పెద్దగా నవ్వారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

నన్ను ప్రేమతో పోషించాలన్న బిడెన్ కోరిక నెరవేరింది - ప్రధాని మోదీ

నేను మీకు చెప్తాను, ప్రధాని మోడీ రాష్ట్ర విందు కోసం ప్రత్యేక సన్నాహాలు చేశారు. విందు సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, ఈ గ్రాండ్ ఈవెంట్‌కు అధ్యక్షుడు జో బిడెన్ మరియు జిల్ బిడెన్‌లకు ధన్యవాదాలు తెలిపారు మరియు ఈ రోజు నన్ను ప్రేమతో తినిపించాలనే జో బిడెన్ కోరిక నెరవేరుతోందని అన్నారు. 2014లో ప్రధాని మోదీ నవరాత్రి ఉపవాసం ఉన్న సమయంలో ఈ విందు ఏర్పాటు చేశారని, ఆ సమయంలో ప్రధాని మోదీ ఏమీ తినడం లేదని బిడెన్ చాలా బాధపడ్డారని ప్రధాని మోదీ చెప్పారు. అటువంటి పరిస్థితిలో, జో బిడెన్ యొక్క ఈ కోరిక ఈ రాష్ట్ర విందు ద్వారా నెరవేరింది.

భారతీయ అమెరికన్లు ఒకరికొకరు దగ్గరవుతున్నారు - ప్రధాని మోదీ

రాష్ట్ర విందు సందర్భంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ, గడిచేకొద్దీ, భారతీయ అమెరికన్లు ఒకరికొకరు దగ్గరవుతున్నారని అన్నారు. భారతీయ పిల్లలు హాలోవీన్‌లో స్పైడర్‌మ్యాన్‌గా మారారు మరియు NATO-NATOలో అమెరికన్ యువత నృత్యం చేస్తారు. దీనితో పాటు, బేస్ బాల్‌తో అమెరికా ప్రజల అనుబంధం మధ్య ఇక్కడ క్రికెట్ కూడా ప్రాచుర్యం పొందిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న క్రికెట్ ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు అమెరికా జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

అతిథి జాబితాలో ఎవరు చేర్చబడ్డారు?

ఈ రాష్ట్ర విందులో దాదాపు 400 మంది పాల్గొన్నారు. మేము అతిథి గురించి మాట్లాడినట్లయితే, ప్రముఖ అతిథులు NSA అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి డాక్టర్ S. జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి, వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ, ఆనంద్ గిరిధర్దాస్, ఆనంద్ మహీంద్రా, సత్య నాదెళ్ల మరియు అను నాదెళ్ల, భారతీయ-అమెరికన్ చలనచిత్ర నిర్మాతలు M. నైట్ శ్యామలన్, నిధి తివారీ, Adobe CEO శంతను నారాయణ్, సల్మాన్ అహ్మద్. ఇంకా కిరణ్ అహుజా, US చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ రూఫస్ గిఫోర్డ్, రీమ్ అక్రా మరియు డాక్టర్ నికోలస్ టాగ్లే, మాలా అడిగా, లాయిడ్ ఆస్టిన్, Apple CEO టిమ్ కుక్, తరుణ్ ఛబ్రా, కమలా హారిస్, మరియా గ్రాజియా చియురి, రౌనక్ దేశాయ్ మరియు డాక్టర్ బన్సారీ షా, మైఖేల్ ఫ్రోహ్మాన్ , నాన్సీ గుడ్‌మాన్, ఎరిక్ గార్సెట్టి, మెరిక్ గార్లాండ్, అటార్నీ జనరల్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మరియు లిన్ రోసెన్‌మాన్ గార్లాండ్, కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్ మరియు ఇతరులు అతిథి జాబితాలో ఉన్నారు.