ఉరుమడ్ల గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమం
•ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాలు ఇంటింటికీ
•కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం వైపు అడుగులు వేస్తూ భారత దేశ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు.
అవినీతిరహిత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గ్రామంలో వాడ వాడల ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారి విజయాలను తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి గాను 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి ప్రధానమంత్రి కి మద్దతు తెలుపండి అని ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంత్యోదయ స్ఫూర్తి తో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదల గృహాలకు నల్ల నీరు మరియు విద్యుత్ అందించడం, రైతు సంక్షేమానికి పెద్దపీట ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ. 6000 ఆర్థిక సహాయం, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ద్వారా 37.5 కోట్ల మంది రైతులు నమోదు,
MSP లో చారిత్రాత్మక పెరుగుదల, కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 4 కోట్ల రైతులకు రూ. 4.7 లక్షల కోట్ల క్రెడిట్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా 57 లక్షల మంది రైతులకు లబ్ధి, మౌలిక సదుపాయాల అపూర్వ వృద్ధి,PM గతి శక్తి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు, వందే భారత్ రైలు ప్రారంభం, జాతీయ రహదారుల నిర్మాణ వేగం, ఈశాన్య రాష్ట్రాల చారిత్రక అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల్లో 76% తగ్గిన తీవ్రవాద ఘటనలు, అస్సాం లో 2000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం, సాంస్కృతిక వారసత్వంలో కొత్త శకం, అయోధ్య రామ జన్మభూమి లో భవ్య మందిరం,
కాశీ విశ్వనాథ్, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో గ్రాండ్ కారిడార్ నిర్మాణం, సోమనాథ్, కేదార్ నాథ్ ఆలయాల పునరుద్ధరణ, జన్ జాతీయ గౌరవ్ దివస్, 10 గిరిజన మ్యూజియంలు, అత్యున్నత త్యాగం చేసిన మన సైనికుల గౌరవార్థం న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నిర్మాణం, నారీ నారాయణి: మహిళా సాధికారత, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా 9.6 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు జారి గ్యాస్ స్టవ్ ల పంపిణీ, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 11. 72 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం, స్టాండ్ అప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా 27.6 కోట్ల మంది మహిళా లబ్ధిదారులకు రుణాలు,
ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా 3. 03 కోట్ల మంది మహిళలకు సహాయం, భారతదేశ అమృతకాలం భావితరం సశక్తీకరణ, 390 కొత్త విశ్వవిద్యాలయాలు, 7 కొత్త IITలు మరియు ఏడు కొత్త IIMలు స్థాపన, 15 ఎయిమ్స్ మరియు 225 మెడికల్ కాలేజీలు స్థాపన, పీఎం శ్రీ యోజన ద్వారా 14,500 పాఠశాలల అభివృద్ధి, 1.37 కోట్ల మంది యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా శిక్షణ, దేశంలో ఒక లక్ష స్టార్టప్ లు మరియు 100 ప్లస్ యూనికార్నలు, ఉద్యోగమేళాల ద్వారా 71,000 పైన నియామక పత్రాల పంపిణీ, అందరికీ ఆరోగ్యకరమైన జీవితం 10.7 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భీమా కవరేజ్, ఆయుష్మాన్ భారత్ ద్వారా 4.5 కోట్ల ప్రజలకు ఉచిత చికిత్స,
జన్ ఔషధీ కేంద్రాలు, వైద్యశాలల బలోపేతం, ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కేంద్రాలు, ప్రపంచంలోనే అత్యంత భారీ టీకా కార్యక్రమం ద్వారా 220 కోట్ల పైన కరోనా టీకా డోసులు, మిషన్ ఇంద్రధనుష్, మధ్యతరగతికి సులభతర జీవితం, సశక్త భారతదేశం నేడు భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కరోనా కాలంలో వందే భారత్ మిషన్ ద్వారా 2. 97 కోట్ల మంది భారతీయులు స్వదేశం తరలింపు, భారతదేశం భద్రత పటిష్టం, ఆర్టికల్ 370 రద్దు, వసుదైవ కుటుంబం, డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా భారతదేశాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ తీర్చి దిద్దాడన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నకిరేకల్ ఎస్సీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, మీడియా సెల్ కన్వీనర్ ఉయ్యాల లింగస్వామి గౌడ్, ఎస్సీ మోర్చా చిట్యాల మండల అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, యాదయ్య, శ్రీను, మల్లేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Jun 23 2023, 15:53