రచ్చకెక్కిన అద్దంకి సీఐ రాసలీలలు
బాపట్ల జిల్లా:జూన్ 22
అద్దంకి సీఐ రోశయ్య గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన రాసలీల ఆడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో చీరాల సీఐగా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, సీఐ ప్రవర్తనతో ఓ వ్యక్తి ఉరివేసుకుని చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడని మొదలు పెట్టి వివిధ కారణాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళల్ని లోబర్చుకుని వేధింపులకు గురి చేస్తున్నారంటూ సిఐపై ఆరోపణలు చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన ఆడియో క్లిప్‌లు పోలీసుశాఖలో హాట్ టాపిక్ గా మారాయి.
తనతో మాట్లాడకుండా ఫోన్‌ను బ్లాక్ చేస్తే మామూలుగా ఉండదంటూ ఓమహిళను బెదిరిస్తున్న ఆడియో కూడా ఒకటి లీక్ అయి కలకలం రేపింది. ఇక అదే సమయంలో తన ఆడియోలపై వస్తున్న వార్తలపై కానిస్టేబుల్‌తో సెటెరికల్‌గా స్పందించిన సీఐ ఆడియో కూడా మరోకటి బయటకు వచ్చి మరింత రచ్చకు దారి తీసింది.
వాళ్ళ దగ్గర ఆడియో లేకపోతే చెప్పు నేను ఆ పనిలో ఉన్నప్పుడు చెబుతా వచ్చి వీడియోలు తీసుకోమను, అవి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి, నేను మగాణ్ణి అంటూ కానిస్టేబుల్‌తో మాట్లాడినట్టు ఆడియోలో ఉంది.
ఈ ఆడియోల కలకలంతో అద్దంకి సీఐ రోశయ్యను వీఆర్ కు పంపారు పోలీస్ అధికారులు. అద్దంకి సీఐ రోశయ్య వ్యవహారాలపై ఒక మహిళా పోలీస్ ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. తనను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయిస్తానని బెదిరించి రాజశేఖర్ అనే కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేయించారని మహిళా కానిస్టేబుల్ ఆరోపిస్తోంది.
నిజానికి ముందు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు రాజశేఖర్ ను సస్పెండ్ చేశారు పోలీసు అధికారులు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ రాజశేఖర్ ని మెడికల్ టెస్టుల కోసం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించగా తనపై కక్షతోనే సీఐ రోశయ్య ఇదంతా చేశారంటున్న కానిస్టేబుల్ రాజశేఖర్, కోర్టుకు వెళ్లే లోపు తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి మరి...
Jun 22 2023, 13:00