/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మాణిక్ రావు ఠాక్రే కు టిపిసిసి ఉపాధ్యక్షులు డా:చెరుకు సుధాకర్ పిర్యాదు Yadagiri Goud
మాణిక్ రావు ఠాక్రే కు టిపిసిసి ఉపాధ్యక్షులు డా:చెరుకు సుధాకర్ పిర్యాదు

శ్రీ మాణిక్‌రావు ఠాక్రే గారు,

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గారికి

నేను డా. చెరుకు సుధాక‌ర్‌, ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌దేశ్ రాష్ట్ర ఉపాధ్య‌క్షులుగా ఉన్నాను. ఉమ్మ‌డి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ప్ర‌జా ఉద్య‌మాల్లో, తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో 3 ద‌శాబ్ధాలు పైగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర స‌మితిలో పొలిట్‌బ్యూరో స‌భ్యుడిగా ఉండి, 2014 త‌రువాత తెలంగాణ ఉద్య‌మ వేదికగా ప‌నిచేసి, 2017లో తెలంగాణ ఇంటి పార్టీగా ఉండి, 2022 ఆగ‌స్టు 5న అఖిల భార‌త కాంగ్రెస్ అధ్య‌క్షులైన మ‌ల్లిఖార్జున ఖార్గే స‌మ‌క్షంలో కాంగ్రెస్ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి గారి చొరువ‌తో కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ హాల్‌లో కాంగ్రెస్‌లో చేరినాను.

ఢిల్లీ నుండి నేరుగా రేవంత్‌రెడ్డి గారితో క‌లిసి మునుగోడు ఉప ఎన్నిక‌ల్లోని ప్ర‌చార స‌భ‌కు చండూర్‌లో హ‌జ‌ర్ అయ్యి మాట్లాడినాను. అదే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఎన్నిక‌ల స‌మ‌న్య‌యంలో మ‌ర్రిగూడ మండ‌లంలో ఉండి అన్ని ప్రాంతాల ప్ర‌చారంలో పాల్గొన్నాను.

మునుగోడు కాంగ్రెస్ యం.య‌ల్‌.ఏగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఉద్దేశపూర్వ‌క రాజీనామా వెనుక కుట్ర‌ను, కాంగ్రెస్‌ను బ‌ల‌హీనప‌రిచేకుయుక్తుల‌ను వ్య‌తిరేకిస్తూ, బ‌హిరంగంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి గారు, కొంత ప‌రోక్షంగా బిజెపి అభ్య‌ర్ధిని స‌మ‌ర్ధించ‌డంతో వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ అభ్య‌ర్ది కోసం ప‌ని చేసిన‌ది వాస్త‌వం. నా చేరిక‌ను వ్య‌తిరేకిస్తూ నన్ను, రాష్ట్ర అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి గారిని జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖిర్జున ఖార్గే గారిని, ఇంచార్జి మాణిక్యం ఠాగోర్ గారిని నిందిస్తూ గౌర‌వ భువ‌న‌గిరి పార్ల‌మెంట్ స‌భ్యుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాట్లాడిన తీరు పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగించిన‌ది.

మార్చి 3వ తేది, 2023న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి గారు, నా కుమారుడు డా . చెరుకు సుహాస్‌, న‌వ్య హాస్పిట‌ల్‌కు న‌ల్ల‌గొండకు ఫోన్ చేసి అత్యంత జుగుప్సాక‌రంగా తిట్ట‌డం, చంపుతామ‌ని బెదిరించ‌డంతో అన్ని తెలంగాణాలోని, తెలుగులోని ప‌త్రిక‌ల్లో, మీడియాలో ప‌తాకా శీర్ష‌క‌ల్లో రావ‌డం, విప‌రీత‌మైన చ‌ర్చ‌కు, న‌ష్టానికి దారి తీసింది.

2023, మార్చి 6న మీకు జ‌రిగిన ప‌రిణామాలు, తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌కై నేను ఇత‌ర టి.పి.సి.సి స‌భ్యుల‌తో పిర్యాదు చేస‌న‌ప్ప‌టికి ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌పై క‌నీస చ‌ర్చ కూడా జ‌ర‌గ‌క‌పోవ‌డం పార్టీ ప్ర‌తిష్ట‌కు న‌ష్ట‌మ‌నే భావిస్తున్నాను.

ఉద‌య్‌పూర్ కాంగ్రెస్ మేధోమ‌ద‌నం త‌రువాత‌, రాయ్‌పూర్ స‌భ‌ల త‌రువాత సామాజిక న్యాయం, ఇంకా ఇత‌ర విష‌యాల్లో గుణాత్మ‌క‌, ఆచ‌ర‌ణాత్మ‌క మార్పును తెలంగాణ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. దేశానికి కాంగ్రెస్ అవ‌స‌ర‌మ‌ని, యావ‌త్ పౌర స‌మాజం కూడా సానుకూలంగా స్పందిస్తున్న స‌మ‌యంలో బుజ్జ‌గింత‌లో కాకుండా నిర్ధిష్ట క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు కోమ‌టిరెడ్డి లాంటి నేత‌ల‌పై తీసుకోక‌పోతే రాబోయే రోజుల్లో సానుకూల ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డానికి ఆటంకం క‌లుగుతుంద‌ని గుర్తుచేస్తున్నాం.

ప్రియాంక గాంధీ గారు యువ‌కుల‌కు సంబందించి ఒక డిక్ల‌రేష‌న్‌ను ఈ మ‌ద్య ప్ర‌క‌టించ‌డంతో పాటు తెలంగాణ ఉద్య‌మ‌కారుల కోసం ఒక భ‌రోస‌, భాద్య‌త త‌మ‌ద‌ని మాట్లాడినారు.

న‌ల్ల‌గొండ‌లో నిరుద్యోగ భ‌రోస కోసం జ‌రిగిన కాంగ్రెస్ స‌భ‌లో యువ‌త‌ను కూడ‌గ‌ట్టి క్షేత్ర‌స్థాయిలో స‌నిచేసిన న‌న్ను, ఇంకా దుబ్బాక న‌ర్సంహా రెడ్డి, కొండేటి మ‌ల్ల‌య్య‌, చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి, కైలాష్ నేత‌ను వేదిక మీద పిలువ వ‌ద్ద‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వొత్తిడి చేసి అవ‌మానానికి గురి చేసినారు.

తెలంగాణ ఉద్య‌మ‌కారుల కోసం జూన్ 2 తెలంగాణ ఆవిర్హావ దినోత్స‌వ వేడుక‌ల కోసం ఒక క‌మిటీని ప్ర‌క‌టించి, దానికి చైర్మ‌న్‌గా నేను ఉండాల‌ని రేవంత్‌రెడ్డి గారు ఆదేశిస్తే, క‌మిటీ స‌భ్యుల‌తో విడుద‌ల‌కు సిద్‌,మైన ప్ర‌క‌ట‌న‌ను ఆపు చేయించి గౌ. చిన్నారెడ్డి గారిని వెంట‌నే ప్ర‌క‌టించినారు. ఈ ర‌క‌మైనా అడ్డంకులు పార్టీ ఇమేజ్‌ను దెబ్బ‌తీస్తుంద‌ని గ‌మ‌నించాలి.

గౌ. భ‌ట్టి విక్ర‌మార్క గారు, కాంగ్రెస్ లెజిస్లేచ‌ర్ పార్టీ నాయ‌కులు ఆదిలాబాద్ నుండి న‌ల్ల‌గొండ‌కు వ‌చ్చిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో మంచిర్యాల‌, వ‌రంగ‌ల్‌, భువ‌న‌గిరి, దేవ‌ర‌కొండ‌, జి. చెన్నారంలో పాల్గొని, తేది 17న న‌ల్లగొండ క్లాక్ ట‌వ‌ర్‌లో జ‌రిగిన కార్న‌ర్ మీటింగ్‌లో ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు ఎవ‌రు ఉన్నా వేదిక ఖాళీ చేయాల‌ని స్థానిక నాయ‌కుల‌చే అనిపించి, కోమ‌టిరెడ్డి అనుచ‌రులే వేదిక‌పై ఉండాలి, ఇత‌రులు దిగాల‌ని హెచ్చ‌రించ‌డం ఒక్క‌ బ‌హుజ‌న, తెలంగాణ ఉద్య‌మనాయ‌కుడికి జ‌రిగిన అవ‌మాన‌మే కాదు, భ‌విష్య‌త్తులో రాహుల్ గాంధీ గారు నిత్యం చెబుతున్న సోష‌ల్ ఇంజ‌నీరింగ్ తెలంగాణ‌లో, న‌ల్ల‌గొండ‌లో అమ‌ల‌వుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తున్న‌ది. అంతేకాక, ఎవ‌రు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప‌రిమిత‌మైన నాయ‌కులో, ఏ ప్ర‌కారం ప్ర‌స్తుత భువ‌న‌గిరి యం.పి న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడ‌వుతారో చెప్పాలి. ఆయ‌న న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అయితే నేను కూడా అదే నియోజ‌క‌వ‌ర్గం అవుతాను. లేదంటే టి.పి.సి.సి స‌భ్యులు అన్ని నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు అవుతారు.

నిన్న జ‌రిగిన ప‌రిణామాలు అంత‌కు ముందు నిరుద్యోగ భ‌రోసాలో అవ‌మానాలు, కాంగ్రెస్‌లో మా అంద‌రినిఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తున్న‌ది. రాష్ట్రవ్యాప్తంగా ఇట్లా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌పై మీరు రాష్ట్ర ఇంచార్జ్‌గా చ‌ర్చించ‌వ‌ల‌సి ఉన్న‌ది. ద‌ళితున్ని ముఖ్య‌మంత్రి చేయ‌గ‌లిగే, పీపుల్స్‌మార్చ్‌లో భ‌ట్టితో స‌హా అంద‌రి మౌనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు రావాల్సిన మైలేజీకి అడ్డంకి కాకూడ‌ద‌ని మీ దృష్టికి తీసుకు వ‌స్తున్నాను.

వంద కార్ల‌లో వ‌చ్చి చెర‌కు సుధాక‌ర్‌ను చంపుతామ‌ని బెదిరించే స్టార్ క్యాంపెయిన‌ర్ పార్టీకి భారం కావొద్ద‌ని, న‌కిరేక‌ల్‌లో, ఇత‌ర ప్రాంతాల్లో అదే ప‌ద్ద‌తి కొన‌సాగిస్తే ఎవ‌రి ఉనికికై వారు ప్ర‌తిచ‌ర్య చేప‌డితే పార్టీకి న‌ష్ట‌మ‌ని గుర్తు చేస్తూ, మీ స్పంద‌న‌కై ఎదురు చూస్తున్నాం.

డా. చెరుకు సుధాక‌ర్‌

టి.పి.సి.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షులు

గిరిజన విద్యార్థికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పదివేల రూపాయల చెక్ అందజేత

గిరిజన దినోత్సవ సందర్భంగా

గిరిజన దినోత్సవం సందర్బంగా 7/06/2023 శనివారం సాయంత్రం రవీంద్రభారతి హైదరాబాద్ నందు 10వ తరగతి లో10GP సాధించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల కంగ్టి,

విద్యార్థి అయినటువంటి

 కె. సతీష్ కు పది వేయిల చెక్ ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అందించారు. 

అలాగే విద్యార్థిని, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రాయ్, Rco కళ్యాణి, దేవేందర్ లను మంత్రి గారు అభినందించారు.

కేసీఆర్, డీజీపీ సార్ వెంటనే చర్యలు తీసుకోండి.. చేతులెత్తి మొక్కిన రాజాసింగ్..

రంజాన్ తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్ జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజేపీ అంజనీకుమార్‌కు లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆయన హెచ్చరించారు.

మీకు చేతకాకపోతే చెప్పండి..!

ఈ బక్రీద్ సందర్భంగా సంబరాలు చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేకలు, గొర్రెలు కొసుకుని బక్రీద్ సంబరాలు చేసుకుంటే కూడా మాకు ఇబ్బంది లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆవులు, దూడలను కోయరాదు. ఆవులు, దూడలు కోస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆవులు, దూడల రక్షణకు చర్యలు చేపట్టలేదు. కనీసం ఎక్కడా చెక్ పోస్ట్‌లు కూడా ఏర్పాటు చేయలేదు.

మీకు చేతకాకపోతే చెప్పండి మా ఆవులు దూడలు రక్షించుకునేందుకు మేమే రంగంలోకి దిగుతాం. సీఎం కేసీఆర్‌కు, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నాను.. వెంటనే చర్యలు తీసుకోండి. మతపరమైన గొడవలు కావద్దనే మేం ఇలా అడుగుతున్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే మా టీమ్‌లు రంగంలోకి దిగుతాయి.. జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి’ రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా గోషామహల్ ఎమ్మెల్యే విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ లేఖపై డీజీపీ, కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

ఇదేం మంచిది కాదు..!

కాగా.. గత నాలుగైదు రోజులుగా గోవుల అక్రమ రవాణా చేయకూడదని, గోవధను ఖండించాలని రాజాసింగ్ వరుస ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు. గోవుల అక్రమ రవాణాకు తెలంగాణ పోలీసులే సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్​ప్రొటెక్షన్‌తో రాష్ట్రంలో వేల ఆవులు కోతకు గురవుతున్నాయని ఆవేదనకు లోనయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవుల రక్తంతో తడిసిన రాష్ట్రానికి మంచి జరగదన్నారు. ఛత్రపతి శివాజీ స్పూర్తితో గోరక్షకులు నడుం బిగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ ఇటీవలే పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఆ మధ్య గోమాంసం తినేవారి నుంచి అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళంగా తీసుకోవద్దని కూడా ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ అప్పట్లో పెను సంచలనమే అయ్యాయి........

Heat Wave: వడగాలులతో బెంబేలు.. మూడు రోజుల్లో 98 మంది మృతి

దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన వడగాల్పుల (Heat Wave) ప్రభావం అధికంగా ఉంది..

ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజుల్లోనే వడదెబ్బ కారణంగా అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బలియా జిల్లాలోనే గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మంది చనిపోవడం కలవరపెడుతోంది. మరోవైపు బిహార్‌లోనూ 44 మంది వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు..

ఇక బిహార్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. గత మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 44 మంది చనిపోగా.. రాజధాని పట్నాలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. నలందా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో 19 మంది, పీఎంసీహెచ్‌లో 16 మంది మృత్యువాతపడ్డారు.

మరో తొమ్మిది మరణాలు ఇతర జిల్లాల్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పట్నా, షేక్‌పురాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా అక్కడి విద్యాసంస్థలకు జూన్‌ 24వరకు సెలవులు పొడిగించారు..

పాలమూరు అసెంబ్లీ బరిలో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు భారీ స్కెచ్..?

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో సాధ్యమైనంత వరకు ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు వీలుగా వ్యూహ రచనలు సాగిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మీ బిడ్డకు కానుకగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఇటీవల జడ్చర్ల వేదికగా జరిగిన బహిరంగ సభలో జనానికి విజ్ఞప్తి చేశారు.

ఇదే సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 స్థానాలలో 12 స్థానాలను గెలుచుకోవాలని సూచించగా.. లేదు లేదు 14 స్థానాలను గెలిపించి తీరుతాము అని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధిక స్థానాలను గెలుచుకుంటేనే పీసీసీ అధ్యక్షునిగా తన బాధ్యతలను సమర్థవంతునిగా నిర్వహించినవాడని అవుతాను అన్న ఆలోచనలతో రేవంత్ రెడ్డి ఉన్నారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తారు అన్న విషయము స్పష్టం అయ్యింది. ప్రస్తుతము ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలు అన్నింట్లో అధికార బీఆర్ఎస్ పార్టీ బలిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలి అంటే రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైనా ఒక నియోజకవర్గంలో నుండి తప్పనిసరిగా పోటీలో ఉండాలి.

కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రభావం ఉంటుంది అన్న ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఆగస్టు 1 నుంచి 23వరకు ‘గురుకుల’ పరీక్షలు

: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెసిడెన్షియల్‌ గురుకులాల్లోని 9,210 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ట్రిబ్‌) పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 23వరకు ఆయా పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను (సీబీఆర్‌టీ) నిర్వహించాలని నిర్ణయించింది.

అయితే.. ఆగస్టులోనే కేంద్ర సర్వీసుల పరీక్షలు ఉన్నాయి. ఇటు టీఎస్‌పీఎస్‌సీ సైతం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో గురుకుల పోస్టులను ఏ తేదీల్లో నిర్వహించాలి, ఎప్పుడు ఏం పరీక్షలు ఉన్నాయి అన్నదానిపై ట్రిబ్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆగస్టులో కేంద్ర సర్వీసుల పరీక్షల తేదీలు సైతం ఇప్పటికే విడుదల అయ్యాయి. మరోవైపు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామ్‌(ఎస్‌ఎస్‌సి–హెచ్‌ఎస్‌ఎల్‌)ను ఆగస్టు 2 నుంచి 22వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన విడదులైంది.

ఈ పరీక్ష కోసం రాష్ట్రం నుంచి చాలా మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఐబీపీఎస్‌–ఆర్‌ఆర్‌బి పరీక్షలో ఉచిత పరీక్ష శిక్షణను(పీఈటీ) ఆగష్టు 17 నుంచి 22 వరకు నిర్వహించాలని, ప్రిలిమినరీ పరీక్షను అదే నెల 12, 13, 19 తేదీల్లో నిర్వహించాలని ఆ బోర్డు నిర్ణయించింది. ఇక గురుకుల పరీక్షల షెడ్యూల్‌ కూడా వస్తే తమ పరిస్థితి ఏంటోనని అభ్యర్ధులు అందోళనకు లోనవుతున్నారు. నెల రోజుల వ్యవధిలో అత్యంత ముఖ్యమైన పరీక్షలన్నింటినీ ఉంటే తాము అంతిమంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందేమోనంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురుకుల పోస్టుల పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు చేసి తమను ఆదుకోవాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లోని 9,210 పోస్టులను భర్తీ చేసేందుకు గురుకుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్‌ 5న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 14 నుంచి మే 25వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఆయా పోస్టుల దరఖాస్తులను స్వీకరించారు. అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయి. ఈక్రమంలో గురుకుల బోర్డు పరీక్ష తేదీలను సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ : వాన కబురు

తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా.. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణను తాకే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. అలాగే పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం కొనసాగనుంది.

నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయని వాతావారణశాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని స్పష్టం చేసింది.

ఇక ఇవాళ కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలుల ప్రభావం ఉంటుందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. రేపు పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాలులు తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అలాగే సోమవారం పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది. ఈరోజు నుంచి 21 మధ్య రుతుపవనాలు విస్తరించేందుకు మరిన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో తెలంగాణలో 19వ తేదీ నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

ఇక నేడు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశముందని స్పష్టం చేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు, 27 డిగ్రీలు నమోదవుతాయని తెలిపింది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంది.

అటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పలు ప్రాంతాల్లో నమోదవుతుండటంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు.....

మండే ఎండ‌లు.. సెలవులు ఇవ్వాలా! వద్దా? ఆలోచనలో తెలుగు ప్రభుత్వాలు

ఇంకా సమ్మర్ గండం వీడిపోవడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్ల కెళ్లే పిల్లల మీద వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. బడికెళ్లడమా వద్దా అనే సంశయంతోనే రోజులు గడిచిపోతున్నాయి.

ఇప్ప‌టికే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇంకా ప్రారంభించ‌లేదు. రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చాయి అనే వార్త వినగానే.. హమ్మయ్య ఇక ఎండలు నుంచి రిలీఫ్ వస్తుందని భావించాం. కానీ సీన్ రివర్స్. బిపర్ జోయ్ తుఫాన్ కారణంగా రుతుపవనాల వాన జాడే కనిపించడం లేదు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లలు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. విద్యాశాఖ అధికారులు కూడా.. స్కూల్స్ సెల‌వుల విష‌యంలో ఆలోచిస్తున్నారు.

జూన్ చివరివారంలో పడుతున్నా సమ్మర్ గండం వీడిపోవడం లేదు. మిగతా వాళ్లసంగతేమో గాని స్కూళ్లకెళ్లే పిల్లల మీద వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. బడికెళ్లడమా వద్దా అనే సంశయంతోనే రోజులు గడిచిపోతున్నాయి. పేరెంట్స్ పిల్లల ఆరోగ్యమా, చదువులా అనే డైలమాతోనే తల్లడిల్లిపోతున్నారు. మండేసూర్యుడు నడినెత్తిన నాట్యమాడేస్తున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోరమైన పరిస్థితి. ముఖ్యంగా గ్రీష్మతాపంతో తల్లడిల్లిపోతోంది తెలంగాణా. రామగుండంలో నిన్న 44 డిగ్రీల టెంపరేచర్ నమోదైందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎండలకు భయపడి పిల్లల రాక తగ్గిపోవడంతో స్కూళ్లలో హాజరు శాతం దారుణంగా పడిపోతోంది.

కొన్ని జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో రెండుపూట్లా బడి నడుస్తోంది. కానీ 60 శాతానికి మించి విద్యార్థుల్లేరు. కేవలం టీచర్లు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలోనూ అదే పరిస్థితి. ఒంటిపూట బడి పెట్టినా స్టూడెంట్స్‌కి తిప్పలు తప్పడం లేదు. జూన్‌లో ఎండలు తగ్గి వాతావరణం చల్లబడి.. ఉత్సాహంగా స్కూళ్లకెళ్లాల్సిన పిల్లల్లో నిరుత్సాహాన్ని నింపుతోంది గ్రీష్మతాపం. అటు.. ప్రైమరీ స్కూల్స్‌కి పిల్లల్ని పంపడం దాదాపుగా ఆపేశారు పేరెంట్స్.

తెలుగు రాష్ట్రాలలో దారుణంగా ఎండ‌లు..

జూన్‌ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్‌ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

చదువుల కంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యం..

ఈ లోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. పిల్లలు వడదెబ్బకు గురవుతారని బెంబేలెత్తిపోతున్నారు పేరెంట్స్. చదువుల కంటే తమ పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటూ బడిబాటకు విరామం కోరుతున్నారు. ఏపీలో ఒంటిపూట బడులు ముగిసిపోయాయి.

ఎండ తీవ్రత తగ్గేదాకా సెలవులు ప్రకటించాలని కోరుతున్నాయి పేరెంట్స్ అసోసియేషన్లు. విద్యార్థి సంఘాలు కూడా పేరెంట్స్ ఆందోళనకు సపోర్ట్‌గా నిలబడుతున్నాయి. మరి ప్రభుత్వం సెలవులు ఇస్తుందా..? లేదా ఒంటి పూట బడులు కొనసాగిస్తుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు కూడా సెల‌వులు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు ఉన్నారు.

పిల్లలను స్కూల్ కు పంపిస్తే..

వైద్య‌ నిపుణులు కూడా విపరీతమైన ఎండల్లో పిల్లలను స్కూల్ కు పంపిస్తే డీ హైడ్రేషన్, వడదెబ్బలకు గురై అనారోగ్యాల భారిన పడతారని సూచిస్తున్నారు. ఎండలు కాస్త తగ్గాకే స్కూల్స్ ఓపెన్ చేస్తే బాగుంటుందని వైద్య, విద్యారంగానికి చెందిన నిపుణులు సూచనలు చేస్తున్నారు. మరి ఈ విషయం పై ఇరు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే...

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ..

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవతరించబోతోంది. ఈ మేరకు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ కీలక ప్రకటన చేశారు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోరిక మేరకు కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం అవుతుందని ప్రకటించారు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్. ఇప్పటి వరకు జరిగిన దోపిడీని కొత్త పార్టీ కక్కిస్తుందని..

వైసీపీ, టీడీపీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కావాలన్నారు. ఆవిర్భావ సభ జూలై 23న నాగార్జున వర్సిటీలో ప్రజా సింహ గర్జన పేరుతో నిర్వహిస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

టీడీపీపాలనలో కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని ఏ వర్గ అభ్యున్నతి కోసం ఆ పార్టీ పాటుపడలేదని విమర్శలు చేశారు. రౌడీ, హత్యా రాజకీయాలు ఫ్యాక్షన్ పార్టీ వైసీపీ అని.. ఆ పార్టీ ఏర్పాటు, అది అధికారంలోకి రావడం దురదృష్టం అని మండిపడ్డారు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్. రెండు పార్టీలు రాజధాని విషయంలో అన్యాయం చేశాయని ఆగ్రహించారు..

బీసీలకు రూ. లక్ష సాయం నిరంతర ప్రక్రియ...!

దరఖాస్తు ఫారాన్ని ఏఅదికారికి ఇవ్వవలసిన అవసరం లేదు, ఆన్లైన్ చేయాలి.

- గంగుల కమలాకర్ వెళ్ళడి

రాష్ట్రంలో చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి బీసీలకు రూ.లక్ష సహాయం పథకం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు.కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు.

శనివారం వరకు 2,70,000 దరఖాస్తులు ఆన్‌లైన్లో నమోదయ్యాయని వివరించారు. మొదటగా అర్హతకలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదవారికి అందజేస్తామని వెల్లడించారు.ప్రతి నెలా 5వతేదీ లోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు.

ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా సహాయాన్ని అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు కేవలం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఫారాన్ని ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి గాని సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.ఎంపికైన లబ్ధిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామాగ్రిని కొనుక్కోవాలని సూచించారు . లబ్ధిదారుల అభివృద్ధి కోసం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని అన్నారు. నెలలోపు లబ్ధిదారులతో కూడిన యూనిట్ల ఫోటోలను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీసీ సహాయం పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించారు.